అప్పుడు ఉయ్యాల ఇప్పుడు రంగుల రాట్నం | Raj Tarun's 'Rangula Ratnam' for Sankranthi! | Sakshi
Sakshi News home page

అప్పుడు ఉయ్యాల ఇప్పుడు రంగుల రాట్నం

Published Wed, Jan 3 2018 1:08 AM | Last Updated on Wed, Jan 3 2018 4:14 AM

Raj Tarun's 'Rangula Ratnam' for Sankranthi! - Sakshi

మాస్‌కి ఈజీగా నచ్చేసే కుర్రాడు రాజ్‌ తరుణ్‌. మొదటి సినిమా ‘ఉయ్యాల జంపాల’తో మంచి పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ద్వారా రాజ్‌ తరుణ్‌ని హీరోగా పరిచయం చేసిన అన్నపూర్ణ స్టూడియోస్‌ మళ్లీ అతనితో ఓ సినిమా నిర్మించింది. ‘రంగుల రాట్నం’ పేరుతో శ్రీ రంజని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో చిత్రా శుక్లా హీరోయిన్‌. షూటింగ్‌ కంప్లీట్‌ అయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. సంక్రాంతికి సినిమా రిలీజ్‌ కానుంది. సితార, ప్రియదర్శి ముఖ్య పాత్రలు చేసిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, కెమెరా: ఎల్‌.కె. విజయ్, ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement