Hero Ashish Gandhi Gets Married Nikitha, His Marriage Photos Went Viral On Social Media - Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌తో హీరో ఆశీష్‌ గాంధీ పెళ్లి.. ఫోటోలు వైరల్‌

Jun 4 2021 5:36 PM | Updated on Jun 4 2021 5:59 PM

Actor Ashish Gandhi Married Nikitha Photos Goes Viral - Sakshi

'నాటకం' ఫేమ్‌ ఆశీష్‌ గాంధీ ఓ ఇంటివాడయ్యాడు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ నికితతో ఆశిష్‌ ఏడడుగులు వేశారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో వీరి వివాహం జరిగింది. కోవిడ్‌ నియమ నిబంధనల నేపథ్యంలో అతి కొద్ది మంది బంధుమిత్రులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే ఆశిష్, నిఖిలత వివాహం జరిగింది. రెండు కుటుంబాల పెద్దల అంగీకారంతోనే అశిష్, నికితలు ఒక్కటైయ్యారు.

తన పెళ్లి గురించి ఆశీష్‌ మాట్లాడుతూ.. ‘రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌లో నన్ను చూసి నిఖిత ఇష్టపడింది. అప్పట్నుంచి మా ఫ్యామిలీ ఫంక్షన్స్‌ జరిగిన ప్రతిసారి నన్ను గమనిస్తూనే ఉంది. ఫాలో చేస్తూనే ఉంది. అంటే తను అప్పట్నుంచే నన్ను ప్రేమిస్తుంది. ఈ విషయాలను నిఖిత నాతో చెబుతున్నప్పుడు నాకు చాలా సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది.నేను కోరుకున్న లక్షణాలు ఉన్న అమ్మాయి నా జీవితంలోకి వచ్చినందుకు  చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా తను నా వ్యక్తితగతమైన విషయాలను బాగా అర్థం చేసుకుంటుంది. సాధారణంగా సినిమా లైఫ్‌ అంటే చాలా మందికి భిన్నమైన ఆలోచనలు ఉంటాయి. అందుకే తనతో నా వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను చర్చించాలనుకున్నాను. తను బాగా అర్థం చేసుకుంది. చాలా మెచ్యూర్డ్‌ గా ఆలోచిస్తుంది’అంటూ భార్యపై ప్రేమను వ్యక్తం చేశాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement