
ఆశిష్ గాంధీ, అశోక్, వర్ష, హ్రితిక హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘హద్దు లేదురా..’. రాజశేఖర్ రావి దర్శకత్వంలో వీరేష్ గాజుల బళ్లారి నిర్మించారు. ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్‌ని దర్శకుడు క్రిష్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘హద్దు లేదురా..’ టైటిల్ బాగుంది. ఫస్ట్ లుక్, సినిమా థీమ్ వైవిధ్యంగా ఉన్నాయి. సినిమా హిట్ అవ్వాలి’’ అన్నారు.
‘‘అలనాటి కృష్ణార్జునులు స్నేహితులు అయితే ఎలా ఉంటారో తెలిపే కథ, కథనంతో ‘హద్దు లేదురా..’ రూ΄పొందింది. ఫైట్స్, పాటలు, సెకండ్ హాఫ్‌లో వచ్చే ట్విస్టులు, క్లైమాక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అన్నారు రాజశేఖర్ రావి. ‘‘జనవరిలో మా సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు గాజుల వీరేశ్. ‘‘స్నేహం నేపథ్యంలో రూ΄పొందిన ‘హద్దు లేదురా..’ మా యూనిట్‌కి మంచి పేరు తీసుకొస్తుంది’’ అన్నారు ఆశిష్ గాంధీ. తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సహ నిర్మాత: రావి మోహన్ రావు.
Comments
Please login to add a commentAdd a comment