Ashish Gandhi's Director Movie To Release On 18th March - Sakshi
Sakshi News home page

Ashish Gandhi's Director Movie: మార్చి 18న భయపెట్టబోతున్న ‘డైరెక్టర్‌’

Mar 17 2022 4:08 PM | Updated on Mar 17 2022 4:30 PM

Director Movie To Release On 18th March - Sakshi

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు టాలీవుడ్‌లో ఎప్పుడూ డిమాండ్‌ ఉంటుంది. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తెరకెక్కిస్తే ఈ జోనర్ సినిమాలు భారీ కలెక్షన్లను రాబడుతాయి. ఆ విధంగా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కి ప్రేక్షకులను అలరించడానికి ముస్తాబవుతున్న చిత్రం ‘డైరెక్టర్’. నాటకం సినిమా తో నటుడిగా మంచి గుర్తింపు సాధించుకున్న ఆశిష్ గాంధీ హీరోగా ఐశ్వర్య రాజ్, మరీనా, ఆంత్ర హీరోయిన్లుగా నటిస్తున్నారు. విజన్ సినిమాస్ బ్యానర్ పై డా.నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ సినిమా లో నిర్మాత నాగం తిరుపతి రెడ్డి ఓ కీలక పాత్రలో కూడా కనిపించారు. దర్శక ద్వయం కిరణ్ పొన్నాడ-కార్తీక్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి, టీజర్ కి, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా పై కూడా అంచనాలను పెంచాయి. రాజా ది గ్రేట్, పటాస్, సుప్రీమ్ వంటి పలు సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించిన సాయి కార్తీక్ సంగీతం సమకూర్చారు.  బి.నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించగా ఆదిత్య వర్దిన్ ఛాయాగ్రాహకుడు గా పనిచేశారు. కాగా ఈ చిత్రాన్ని ఈ నెల 18 వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement