బ్రేక్ తీసుకునేది లేదు అన్నట్లు రజనీకాంత్ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఆయన హీరోగా నటించిన ‘జైలర్’ ఇటీవల విడుదలై, బంపర్ హిట్ సాధించింది. ప్రస్తుతం టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తన 170వ సినిమా చేస్తున్నారు రజనీ. ఇప్పటికే తన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో ‘లాల్ సలాం’ చిత్రంలో కీ రోల్ చిత్రీకరణ పూర్తి చేశారు.
ఇక 170వ సినిమా పూర్తయిన వెంటనే 171వ సినిమాతో బిజీ అవుతారు రజనీ. ఈ చిత్రదర్శకుడు లోకేశ్ కనగరాజ్ వెల్లడించిన ప్లాన్ ప్రకారం వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభమవుతుంది. ఏప్రిల్‌లో చిత్రీకరణ ఆరంభించేలా లోకేశ్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ హీరోగా లోకేశ్ దర్శకత్వం వహించిన ‘లియో’ ఈ నెల 19న రిలీజ్ కానుంది.
కొన్ని నెలలుగా ‘లియో’తో బిజీగా గడిపిన లోకేశ్ ఈ చిత్రం విడుదల తర్వాత చిన్న గ్యాప్ తీసుకుని, రజనీ 171వ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఆరంభిస్తారట. నిజానికి ఈ చిత్రకథను తాను దర్శకత్వం వహించిన ‘మానగరం’ (2017)కి ముందే రాశారట. ఒక ఫ్రెండ్ కోసం రాసిన ఈ కథను రజనీకాంత్‌కి వినిపించగా ఆయనకు నచ్చిందని లోకేశ్ పేర్కొన్నారు. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాల్లో కొన్నింటిని ‘ఐమ్యాక్స్ కెమెరా’తో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నామని లోకేశ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
ఒక్క ట్వీట్‌తో గుడ్‌బై చెప్పాలనుకున్నా!
‘‘దర్శకుడిగా చిత్ర పరిశ్రమలో ఎక్కువ కాలం ఉండాలనుకోవడం లేదు.. కెరీర్ పరంగా గర్వపడే స్థాయిలో ఉన్నప్పుడు ఒక్క ట్వీట్‌తో దర్శకత్వానికి గుడ్‌బై అని అనౌ¯Œ ్స చేయాలనుకున్నా’’ అన్నారు డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. దర్శకుడిగా త్వరగా రిటైర్‌మెంట్ తీసుకుంటా అని గతంలో ఓసారి చెప్పిన లోకేశ్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలోనూ ఇదే విషయంపై స్పందించారు. ‘‘సినిమా ఇండస్ట్రీలో నేను ఎక్కువ కాలం ఉండాలనుకోలేదు.
10 మంచి సినిమాలు చేసి వీలైనంత త్వరగా రిటైర్ అవ్వాలనుకున్నాను. కెరీర్ పరంగా గర్వపడే స్థాయిలో ఉన్నప్పుడు ఒక్క ట్వీట్‌తో గుడ్‌బై అని అనౌన్స్ చేయాలనుకున్నాను. ఆ తర్వాత ఎన్నో ప్రదేశాలకు వెళ్లాలని ప్రణాళిక వేసుకున్నాను. అయితే, ఇటీవల ఓ వేడుకలో దర్శకులందరం కలిశాం. రిటైర్‌మెంట్ ప్రయత్నాలను విరమించుకోవాలని వాళ్లు సూచించారు.. వాళ్ల మాటలపై ఉన్న గౌరవంతో రిటైర్‌మెంట్ గురించి ఇప్పుడే మాట్లాడాలనుకోవడం లేదు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment