Pre-production
-
వేసవిలో 171 షురూ
బ్రేక్ తీసుకునేది లేదు అన్నట్లు రజనీకాంత్ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఆయన హీరోగా నటించిన ‘జైలర్’ ఇటీవల విడుదలై, బంపర్ హిట్ సాధించింది. ప్రస్తుతం టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తన 170వ సినిమా చేస్తున్నారు రజనీ. ఇప్పటికే తన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో ‘లాల్ సలాం’ చిత్రంలో కీ రోల్ చిత్రీకరణ పూర్తి చేశారు. ఇక 170వ సినిమా పూర్తయిన వెంటనే 171వ సినిమాతో బిజీ అవుతారు రజనీ. ఈ చిత్రదర్శకుడు లోకేశ్ కనగరాజ్ వెల్లడించిన ప్లాన్ ప్రకారం వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభమవుతుంది. ఏప్రిల్‌లో చిత్రీకరణ ఆరంభించేలా లోకేశ్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ హీరోగా లోకేశ్ దర్శకత్వం వహించిన ‘లియో’ ఈ నెల 19న రిలీజ్ కానుంది. కొన్ని నెలలుగా ‘లియో’తో బిజీగా గడిపిన లోకేశ్ ఈ చిత్రం విడుదల తర్వాత చిన్న గ్యాప్ తీసుకుని, రజనీ 171వ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఆరంభిస్తారట. నిజానికి ఈ చిత్రకథను తాను దర్శకత్వం వహించిన ‘మానగరం’ (2017)కి ముందే రాశారట. ఒక ఫ్రెండ్ కోసం రాసిన ఈ కథను రజనీకాంత్‌కి వినిపించగా ఆయనకు నచ్చిందని లోకేశ్ పేర్కొన్నారు. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాల్లో కొన్నింటిని ‘ఐమ్యాక్స్ కెమెరా’తో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నామని లోకేశ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఒక్క ట్వీట్‌తో గుడ్‌బై చెప్పాలనుకున్నా! ‘‘దర్శకుడిగా చిత్ర పరిశ్రమలో ఎక్కువ కాలం ఉండాలనుకోవడం లేదు.. కెరీర్ పరంగా గర్వపడే స్థాయిలో ఉన్నప్పుడు ఒక్క ట్వీట్‌తో దర్శకత్వానికి గుడ్‌బై అని అనౌ¯Œ ్స చేయాలనుకున్నా’’ అన్నారు డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. దర్శకుడిగా త్వరగా రిటైర్మెంట్ తీసుకుంటా అని గతంలో ఓసారి చెప్పిన లోకేశ్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలోనూ ఇదే విషయంపై స్పందించారు. ‘‘సినిమా ఇండస్ట్రీలో నేను ఎక్కువ కాలం ఉండాలనుకోలేదు. 10 మంచి సినిమాలు చేసి వీలైనంత త్వరగా రిటైర్ అవ్వాలనుకున్నాను. కెరీర్ పరంగా గర్వపడే స్థాయిలో ఉన్నప్పుడు ఒక్క ట్వీట్‌తో గుడ్‌బై అని అనౌన్స్ చేయాలనుకున్నాను. ఆ తర్వాత ఎన్నో ప్రదేశాలకు వెళ్లాలని ప్రణాళిక వేసుకున్నాను. అయితే, ఇటీవల ఓ వేడుకలో దర్శకులందరం కలిశాం. రిటైర్మెంట్ ప్రయత్నాలను విరమించుకోవాలని వాళ్లు సూచించారు.. వాళ్ల మాటలపై ఉన్న గౌరవంతో రిటైర్మెంట్ గురించి ఇప్పుడే మాట్లాడాలనుకోవడం లేదు’’ అన్నారు. -
మెగాస్టార్ 157 ప్రాజెక్ట్‌లో నయనతార
హీరో చిరంజీవి నటించనున్న157వ సినిమాకి ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్‌పై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మించనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మరింత ఊపందుకున్నాయి. ‘‘మెగా ఫిల్మ్ కోసం మెగా స్టార్ట్. చిరంజీవిగారి 157వ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌ను స్టార్ట్ చేశాం’’ అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు దర్శకుడు వశిష్ఠ. అడ్వెంచరస్ సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. నవంబరు నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరిగేలా చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోందని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార, అనుష్క, మృణాళ్ ఠాకూర్ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. మరి ఫైనల్‌గా ఎవరు ఫిక్స్ అవుతారో వేచి చూడాలి. ఈ సినిమాకు కెమెరా: ఛోటా కె. నాయుడు. -
రాముడిగా రణ్‌బీర్.. రావణుడిగా యశ్?
భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా ఇప్పటికే పలు చిత్రాలు వచ్చాయి.. ఇంకొన్ని వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామాయణం ఆధారంగా అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రా ఓ సినిమాను నిర్మించనున్నట్లుగా ప్రకటన వచ్చి దాదాపు మూడేళ్లు ముగిసింది. కానీ ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. దాంతో ఈ చిత్రం నిలిచి΄ోయిందా? అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే అలాంటిదేమీ లేదని, ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని నిర్మాతలు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఈ ఏడాది చివర్లో రెగ్యులర్ షూటింగ్‌ను ఆరంభించాలని నిర్మాతలు అనుకుంటున్నారన్నది తాజా సమాచారం. ఈ చిత్ర దర్శకుడు నితీష్ తివారి ఈ సినిమా పనులను మరింత వేగవంతం చేశారని బాలీవుడ్లో వినిపిస్తోంది. ప్రస్తుతం నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారట. రాముడు, సీత, లక్ష్మణుడు, రావణుడు, హనుమంతుడు వంటి ప్రధాన పాత్రలకు ఆర్టిస్టులను ఎంపిక చేసి, లుక్ టెస్ట్‌ను నిర్వహించేందుకు నితీష్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా ఆలియా భట్, రావణుడి పాత్రలో యశ్‌లు నటించనున్నారని, ముందు వీరి లుక్ టెస్ట్ జరుగుతుందని టాక్. మరి.. ఈ ‘రామాయణం’లో రియల్ లైఫ్ జంట ఆలియా, రణ్‌బీర్ సీతారాములుగా కనిపిస్తారా? ‘కేజీఎఫ్’లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో విజృంభించిన యశ్ ఈ చిత్రంలో రావణుడిగా బీభత్సం సృష్టిస్తారా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. -
Shruti Haasan: చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది!
హీరోయిన్ శ్రుతీహాసన్ కొన్ని రోజులుగా గ్రీస్‌లోనే ఉంటున్నారు. ఏదైనా వెకేషన్‌కి వెళ్లారేమో? అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆమె అక్కడికి వెళ్లింది ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం. డాఫ్నే ష్మోన్ దర్శకత్వంలో ‘ది ఐ’ అనే సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కనుంది. ఈ ఇంగ్లీష్ ఫిల్మ్‌లో మార్క్ రౌలీ, శ్రుతీహాసన్ లీడ్ యాక్టర్స్‌గా నటించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ గ్రీస్‌లో జరుగుతున్నాయి. ఈ వర్క్‌షాప్స్‌లో శ్రుతీహాసన్ పాల్గొంటున్నారు. ‘‘ఈ సినిమాలో భాగం కావడం నాకు స్పెషల్. చాలా ఎగై్జటింగ్‌గా ఉంది’’ అని ట్వీట్ చేశారు శ్రుతీహాసన్. 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాకు ఎమిలీ కార్లటన్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఐస్లాండ్లో చనిపోయిన భర్త అస్తికల కోసం అక్కడికి వెళ్తుంది ఓ యువతి. భర్త మరణం గురించి కొన్ని ఊహించని అంశాలు తెలుసుకున్న ఆ యువతి అక్కడ ఏం చేసింది? అనే నేపథ్యంలో ఈ కథనం సాగుతుందట. కాగా చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణతో ఓ సినిమాతో పాటు ప్రభాస్ ‘సలార్’లతో బిజీగా ఉన్నారు శ్రుతీహాసన్. -
ఎన్టీఆర్- కొరటాల మూవీ: వచ్చే నెలలో షూటింగ్!
ఎన్టీఆర్ ఓ హీరోగా చేసిన ‘ఆర్ఆర్ఆర్’ (రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రామ్‌చరణ్ మరో హీరో) చిత్రం విడుదల ఈ వేసవికి వాయిదా పడింది. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యేలోపు తన తదుపరి చిత్రంపై ఎన్టీఆర్ దృష్టి పెట్టాలనుకుంటున్నారని తెలిసింది. ‘జనతా గ్యారేజ్’ వంటి హిట్ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను స్పీడప్ చేశారు దర్శకుడు కొరటాల శివ. వచ్చే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూట్‌ను ఆరంభించడానికి సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్, ఇతర కీలక పాత్రల్లో నటించనున్న నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా ప్రకటించాలనుకుంటున్నారని తెలిసింది. -
స్పీడ్ పెంచారు
‘అర్జున్ రెడ్డి’ రీమేక్‌తో తమిళ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్. తొలి సినిమాకే నటుడిగా మంచి ప్రశంసలు అందుకున్నాడు. అలాగే సినిమాలు అంగీకరించడంలో స్పీడ్ పెంచాడు ధ్రువ్. రెండో సినిమాను తండ్రి విక్రమ్‌తో కలసి చేస్తున్నట్టు ప్రకటించాడు. ధ్రువ్, విక్రమ్ ముఖ్య పాత్రల్లో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. తాజాగా ధ్రువ్ విక్రమ్ సోలో హీరోగా ఓ సినిమా కమిటయ్యారు. ‘పరియేరు పెరుమాళ్, కర్ణన్’ చిత్రాలను తెరకెక్కించిన మారీ సెల్వరాజ్ దర్శకత్వంలో ధ్రువ్ ఓ సినిమా చేయబోతున్నారట. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. తండ్రితో చేస్తున్న సినిమా, తాజాగా ఒప్పుకున్న ఈ సినిమాను ఏకకాలంలో పూర్తి చేస్తాడట ధ్రువ్. -
వెరైటీ మాస్
‘రాక్షసుడు’ సినిమాతో ఈ ఏడాది సూపర్ సక్సెస్‌ను ఖాతాలో వేసుకుని మంచి ఫామ్‌లో ఉన్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఇదే ఉత్సాహంలో తన తర్వాతి చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లే పనులను మొదలుపెట్టారు. ఈ కొత్త సినిమాకు ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తారు. సాయి శ్రీనివాస్ కోసం ఓ పవర్ఫుల్ మాస్ ఎంటర్టైన్మెంట్ కథను సిద్ధం చేశారట సంతోష్. ఈ మాస్ కథ చాలా వెరైటీగా ఉంటుందట. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. -
బిజీ బిజీ
మన స్టార్ హీరోల్లో చాలామంది ప్రస్తుతం షూటింగ్స్‌తో బిజీ బిజీగా ఉన్నారు. మరికొందరు ప్రీ-ప్రొడక్షన్లో పాలుపంచుకుంటూ, నెక్ట్స్ మంత్ సెట్స్‌కి వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆ విశేషాల్లో కొన్ని మీ కోసం.... ఒకటికి రెండు! సీనియర్ స్టార్ హీరో నాగార్జున చాలా బిజీగా ఉన్నారు. నూతన దర్శకుడు కల్యాణకృష్ణ దర్శకత్వంలో ‘సోగ్గాడే చిన్నినాయనా’ చేస్తున్నారు. ఆ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. ఈ నెల 26న హైదరాబాద్‌లో ఈ సినిమాకు సంబంధించి మరో షెడ్యూలు మొదలుకానుంది. ఇది కాక, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ హీరో కార్తీతో కలిసి నాగ్ నటిస్తున్న మరో చిత్రం కూడా చిత్రీకరణ దశలో ఉంది. జూలై 10 తర్వాత ఈ సినిమా షెడ్యూలు ఉంటుందని సమాచారం. మహారాష్ట్ర టు గుజరాత్ పవన్‌కల్యాణ్ కూడా కొత్త సినిమా షూటింగ్‌కు సిద్ధమయ్యారు. పవన్ కల్యాణ్ హీరోగా బాబీ దర్శకత్వంలో శరత్‌మరార్ నిర్మిస్తున్న ‘గబ్బర్‌సింగ్2’ (ఇది వర్కింగ్ టైటిల్. అసలు పేరింకా ఖరారు కాలేదు) ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. మహారాష్ట్రలోని పుణేకు సమీపంలో ఇటీవలే కొద్దిరోజులు చిత్రీకరణ జరిపారు. త్వరలోనే రెండో షెడ్యూల్ గుజరాత్లో ప్రారంభం కానుంది. మొన్నటి దాకా బెంగుళూరు పరిసరాల్లో జిమ్‌కు వెళుతూ కనిపించిన పవన్ ఆ షెడ్యూల్‌కు తనను తాను సిద్ధం చేసుకుంటున్నారు. ఒకటి చివర్లో..! మరొకటి మొదట్లో..! స్టార్ హీరో మహేశ్ ఇప్పుడు ‘శ్రీమంతుడు’ చిత్రం పూర్తి చేసే హడావిడిలో ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుదిఘట్టంలో ఉంది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణా ఏడెకరాల్లో వేసిన గాజుల దుకాణాల స్ట్రీట్ సెట్లో చిత్రీకరణ సాగుతోంది. మహేశ్‌తో పాటు శ్రుతీహాసన్, తదితరులు షూటింగ్లో పాల్గొంటున్నారు. మహేశ్ పుట్టిన రోజు (ఆగస్టు 9) కానుకగా, ఆగస్టు 7న ‘శ్రీమంతుడు’ విడుదల కానుంది. ఈ సినిమా ఇలా చివరలో ఉండగానే, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘బ్రహ్మోత్సవం’కి ఇప్పటికే పూజాకార్య క్రమాలు జరిపారు. ‘శ్రీమంతుడు’ పూర్తవుతూనే, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్లో మహేశ్ పాల్గొంటారు. విదేశాలకు... రెడీ ‘టెంపర్’ తర్వాత ఎన్టీఆర్ స్పీడు పెంచారు. వరుసపెట్టి సినిమాలు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సుకుమార్ దర్శకత్వంలో ఆయన ఓ సినిమా కమిటయ్యారు. ఈ నెలాఖరు నుంచి యూరప్‌లో భారీ షెడ్యూలు జరగనుంది. ఇప్పటికే సుకుమార్, ఛాయా గ్రాహకుడు విజయ్ కె. చక్రవర్తి యూరప్‌లో లొకేషన్ల ఎంపిక పూర్తిచేశారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేస్తారని కృష్ణానగర్ కబురు. జోరు... మాస్ ఎంటర్టైనర్ల హోరు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రవితేజ హీరోగా చేసిన ‘కిక్2’ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకొంటోంది. కొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులతో పాటు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రవితేజ, మరోపక్క సంపత్ నంది దర్శకత్వంలో రాధా మోహన్ నిర్మిస్తున్న ‘బెంగాల్ టైగర్’తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంతో సాగుతోంది. ఆర్.ఎఫ్.సి.లో భారీ షెడ్యూల్ జరుగుతోంది. ఇందులో రవితేజతో పాటు బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ, తదితర నటీనటులు పాల్గొంటున్నారు. ఏకకాలంలో రెండు షూట్స్ రామ్ శరవేగంతో రెండు సినిమాలు చేస్తున్నారు. ఈ రెండూ స్రవంతి మూవీస్ సంస్థలోనే తయారవుతున్నాయి. ఈ రెండు సినిమాల ద్వారా ఇద్దరు కొత్త దర్శకులు పరిచయమవుతుండడం విశేషం. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ‘శివం’ ఇప్పటికే 70 శాతం పూర్తయింది. గతవారం రోజులుగా ఊటీలో షెడ్యూలు జరుపుకుంది. సెప్టెంబరులో ఈ చిత్రం విడుదలవుతుంది. ఇక మరో చిత్రం కథ ‘హరికథ’ కూడా కొంత చిత్రీకరణ జరుపుకొంది. కిశోర్ తిరుమల దర్శకుడు. ఈ రెండు చిత్రాలకూ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్నారు. ఫీల్‌గుడ్ మూవీలో! గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మన్జిమా మోహన్, నాగచైతన్య జంటగా తయారవుతున్న చిత్రం ప్రస్తుతం షూటింగ్లో ఉంది. గతంలో ఒకే కథ వేర్వేరు హీరోలతో తమిళంలో ‘విన్నై తాండి వరువాయా’, తెలుగులో ‘ఏం మాయ చేశావే’ చేసి, విజయం సాధించినట్లే, ఇప్పుడు ఈ సినిమాను గౌతమ్ మీనన్ రూపొందిస్తున్నారు. ఈ తెలుగు - తమిళ ద్విభాషా చిత్రంలో తెలుగు వెర్షన్లో నాగచైతన్య హీరో అయితే, తమిళంలో శింబు కథానాయకుడు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం తమిళనాట సాగుతోంది. యాక్షన్ హంగామా అక్కినేని అఖిల్ పరిచయ చిత్రం షూటింగ్ దేశవిదేశాల్లో జరుగుతోంది. ఇటీవలే స్పెయిన్‌లో కీలక ఎపిసోడ్స్ చిత్రీకరణ చేసివచ్చారు. కొద్దిరోజుల్లోనే బ్యాంకాక్‌లో షూటింగ్ చేయడానికి చిత్ర బృందం బయలుదేరి వెళ్తోంది. అక్కడ పాటలు, ముఖ్య సన్నివేశాలు చిత్రీకరిస్తారు. వి.వి. వినాయక్ దర్శకత్వంలో హీరో నితిన్ నిర్మిస్తున్నారీ చిత్రాన్ని. ముచ్చటగా మూడు! దేవ కట్టా దర్శకత్వంలో ‘డైనమైట్’ చిత్రంతో మంచు విష్ణు బిజీగా ఉన్నారు. ఈ సినిమా జూలై రిలీజ్ కోసం సన్నాహాలు జరుపుకొంటూ ఉండగానే, ఆయన మరో రెండు సినిమాలు ఎనౌన్స్ చేశారు. నూతన దర్శకుడు హనుమాన్ నిర్దేశకత్వంలో ఒక సినిమా, తనికెళ్ళ భరణి దర్శకత్వంలో పౌరాణిక గాథ ‘కన్నప్ప కథ’కు కసరత్తులు చేస్తున్నారు. ప్రత్యేకించి, ‘కన్నప్ప కథ’ కోసం లుక్ నుంచి అన్నీ జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇక అల్లు అర్జున్, గోపీచంద్ తదితర కథానాయకుల కొత్త చిత్రాలు కూడా ఇప్పటికే ముహూర్తాలు జరుపుకొన్నాయి. వచ్చే నెలలో పూర్తి స్థాయిలో సెట్స్ మీదకు వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. -
ఇలాంటి సినిమా చేయడంనిజంగా కత్తిమీద సామే..!
‘‘దర్శకునిగా నాకిది తొలి సినిమా. నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకం. ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ నాటి సంఘటనలు అన్నీ ఇప్పటికీ గుర్తున్నాయి. ఇలాంటి సినిమా చేయడం నిజంగా కత్తి మీద సామే. ఇది కల్పిత కథ కాదు కాబట్టి... జరిగింది జరిగినట్టుగా తీయాలి. ఏ మాత్రం చిన్న తేడా జరిగినా ఒప్పుకోరు. చరిత్ర ప్రకారం మల్బార్ భవన్లో గాంధీ-అంబేద్కర్ల మధ్య కొంత సంవాదం జరిగింది. అస్పృశ్యత గురించి ఎందుకు సందేశం ఇవ్వలేదని గాంధీని, అంబేడ్కర్ ప్రశ్నిస్తారు. ఈ ఎపిసోడ్‌ను జాగ్రత్తగా తీయాల్సి వచ్చింది. గాంధీని కించపరచకూడదు. అలాగని వాస్తవాన్ని కప్పిపుచ్చకూడదు. గెటప్స్, కాస్ట్యూమ్స్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకున్నాం. ఈ సినిమాలో డైలాగులు చాలా బాగుంటాయి. ముఖ్యంగా ఒక డైలాగ్ అయితే నాకు ఇప్పటికీ గుర్తే. ‘లా’ చదవడం కోసం అంబేడ్కర్ లండన్ వెళ్తుంటాడు. భార్య ఆందోళన చెందుతూ ఉంటుంది. ‘‘నీకేం భయం లేదు... ఇంటి వ్యవహారాలన్నీ అన్నయ్య చూసుకుంటారు’’ అంటాడు అంబేడ్కర్. ‘‘చదువులో పడి భార్యాపిల్లలను మరిచిపోరు కదా’’ అని అంటుంది భార్య. దానికాయన ‘‘అలా మరిచిపోయి చదివితే నా ధ్యేయం నెరవేరినట్టేగా’’ అంటాడు. ఎంత గొప్ప డైలాగ్ అండీ! సంగీత దర్శకుడు చక్రవర్తి గారు తన ఆఖరి స్టేజ్‌లో ఈ సినిమా చేశారు. రీ-రికార్డింగ్ వాళ్లబ్బాయ్ శ్రీ చేశాడు. ఇండియా-పాక్ విభజన టైంలో వచ్చే ఓ పాటను సి. నారాయణరెడ్డిగారు ఎక్స్ట్రార్డినరీగా రాస్తే, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు అంతే ఎక్స్ట్రార్డినరీగా పాడారు. ఆకాశ్ ఖురానాకు ఘంటసాల రత్నకుమార్ డబ్బింగ్ చెప్పారు. రాష్ట్రపతిభవన్‌లో నాటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మగారు స్పెషల్ షో వేసుకుని చూశారు. మమ్మలందర్నీ సత్కరించారు కూడా. ఇండియన్ పనోరమాకు ఎంపిక చేశారు కానీ, అక్కడ ప్రదర్శించలేదు. దాంతో కొంత వివాదం జరిగింది. ‘గాంధీ’ చిత్రాన్ని కోట్లల్లో తీస్తే, మేం లక్షల్లో తీశాం. కానీ క్వాలిటీ ఏమాత్రం తగ్గలేదు.’’