మెగాస్టార్‌ 157 ప్రాజెక్ట్‌లో నయనతార | Pre-production works begins for Chiranjeevi Mega budget film | Sakshi
Sakshi News home page

మెగాస్టార్‌ 157 ప్రాజెక్ట్‌లో నయనతార

Published Mon, Sep 11 2023 12:45 AM | Last Updated on Mon, Sep 11 2023 6:50 AM

Pre-production works begins for Chiranjeevi Mega budget film - Sakshi

హీరో చిరంజీవి నటించనున్న157వ సినిమాకి ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్పై వంశీ, ప్రమోద్, విక్రమ్‌ నిర్మించనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్  పనులు మరింత ఊపందుకున్నాయి. ‘‘మెగా ఫిల్మ్‌ కోసం మెగా స్టార్ట్‌.

చిరంజీవిగారి 157వ సినిమా ప్రీ ప్రొడక్షన్  వర్క్స్‌ను స్టార్ట్‌ చేశాం’’ అని సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు దర్శకుడు వశిష్ఠ. అడ్వెంచరస్‌ సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. నవంబరు నుంచి ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ జరిగేలా చిత్రయూనిట్‌ ప్లాన్  చేస్తోందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార, అనుష్క, మృణాళ్‌ ఠాకూర్‌ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. మరి ఫైనల్‌గా ఎవరు ఫిక్స్‌ అవుతారో వేచి చూడాలి. ఈ సినిమాకు కెమెరా: ఛోటా కె. నాయుడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement