Vasishta
-
మృగశృంగుడి కథ
పూర్వం కుత్సురుడు అనే విప్రుడు ఉండేవాడు. అతడు ధార్మికుడు. నియమబద్ధంగా జీవించేవాడు. కుత్సురుడి యోగ్యతను గమనించి, కర్దమ మహర్షి అతడికి తన కూతురునిచ్చి వివాహం చేశాడు. కొంతకాలానికి కుత్సురుడికి ఒక కొడుకు కలిగాడు. కుత్సురుడి కొడుకు గనుక కౌత్సుడని పేరు పొందాడు. అతడు దినదిన ప్రవర్ధమానంగా పెరగసాగాడు. కొడుకుకు ఐదేళ్ల వయసు రాగానే కుత్సురుడు అతడికి ఉపనయనం చేశాడు. తండ్రి వద్ద కౌత్సుడు సకల శాస్త్రాలనూ అభ్యసించాడు. యుక్తవయసు రాగానే దేశాటనకు వెళ్లాలనే అభిలాషతో తండ్రి వద్ద అనుమతి తీసుకుని బయలుదేరాడు.ఇంటి వద్ద నుంచి బయలుదేరి ఊళ్లు, అడవులు దాటుకుంటూ ప్రయాణించిన కౌత్సుడు కొంతకాలానికి కావేరీ తీరానికి చేరుకున్నాడు. అది మాఘమాసం. కావేరీ పరిసరాలు ప్రశాంతంగా ఉండటంతో అక్కడే ఉంటూ, అనుదినం నదిలో స్నానం చేస్తూ, తపస్సు చేసుకోవడం ప్రారంభించాడు. తపస్సులో నిమగ్నమై ఉన్న కౌత్సుడిని జింకలు తమ కొమ్ములతో నిమురుతూ ఉండేవి. మృగశృంగాలను ఆకట్టుకున్నవాడు కావడం వల్ల అతడికి మృగశృంగుడనే పేరు వచ్చింది. కొన్నాళ్లకు మృగశృంగుడికి శ్రీహరి దర్శనమిచ్చాడు. ‘వత్సా! ఏమి కావాలో కోరుకో’ అన్నాడు శ్రీహరి.‘ఆపద్బాంధవా! జగద్రక్షకా! ఇక్కడ నన్ను అనుగ్రహించినట్లే, నువ్వు ఇక్కడే కొలువుంటూ భక్తులను కటాక్షిస్తూ ఉండాలి. అంతకు మించి నాకే కోరికా లేదు’ అన్నాడు మృగశృంగుడు. శ్రీహరి సమ్మతించాడు. శ్రీహరి దర్శనం పొందిన తర్వాత మృగశృంగుడు ఇంటికి చేరుకున్నాడు. యుక్తవయసుకు వచ్చిన మృగశృంగుడికి వివాహం జరిపించాలని తల్లిదండ్రులు భావించారు. భోగాపురంలో దైవజ్ఞుడైన బ్రాహ్మణుడికి సుశీల అనే కుమార్తె ఉంది. ఆమె అన్ని విధాలా అనుకూలవతి అని తెలుసుకోవడంతో మృగశృంగుడు ఆమెనే వివాహం చేసుకోవాలని తలచాడు. తల్లిదండ్రుల అనుమతితో ఆమెను చూడటానికి బయలుదేరాడు. సుశీల తన ఇద్దరు చెలికత్తెలతో కావేరీ నదిలో స్నానం చేయడానికి బయలుదేరింది. వారు ముగ్గురూ నది వైపు వెళుతుండగా, ఒక మదపుటేనుగు ఘీంకరిస్తూ వారిని తరమసాగింది. ప్రాణభయంతో ముగ్గురూ హాహాకారాలు చేస్తూ పరుగులు తీస్తూ, తోవలో ఉన్న దిగుడుబావిలో పడిపోయారు. ఈ సంగతి వారి తల్లిదండ్రులకు తెలిసి, చూడటానికి వచ్చేసరికి వారు ముగ్గురూ దిగుడుబావిలో చనిపోయి ఉన్నారు. వారు కన్నీరు మున్నీరుగా విలపించసాగారు. అదే సమయానికి మృగశృంగుడు అక్కడకు చేరుకున్నాడు. జరిగినదంతా తెలుసుకున్నాడు. ముగ్గురు యువతుల మృతదేహాలను అప్పటికే గ్రామస్థులు వెలికితీశారు. తాను వచ్చేంత వరకు ఆ మృతదేహాలను కాపాడుతూ ఉండమని చెప్పి, మృగశృంగుడు కావేరీ నదిలో మెడలోతు వరకు దిగి, యమధర్మరాజు గురించి తపస్సు చేయడం ప్రారంభించాడు. అతడి తపస్సుకు యముడు దిగివచ్చాడు. ‘కుమారా! నన్ను గురించి ఇంత దీక్షగా తపస్సు చేసిన వారెవరూ ఇంతవరకు లేరు. ఏమి కావాలో కోరుకో. నీ అభీష్టాన్ని తప్పక నెరవేరుస్తాను’ అన్నాడు యముడు.‘మహానుభావా! అకాల మరణానికి ప్రాణాలు పోగొట్టుకున్న ఆ ముగ్గురు కన్యలనూ బతికించు’ అని కోరుకున్నాడు మృగశృంగుడు. ‘నీ పరోపకార బుద్ధికి సంతసిస్తున్నాను’ అంటూ యముడు సుశీలను, ఆమె చెలికత్తెలిద్దరినీ బతికించాడు.తర్వాత మృగశృంగునికి సుశీలతో వివాహం జరిగింది.సుశీలతో పాటు తమను కూడా పునర్జీవితులను చేయడంతో సుశీల ఇద్దరు చెలికత్తెలూ మృగశృంగునిపై మనసు పడ్డారు. వారు అతడి వద్దకు వచ్చి, ‘సుశీలను పునర్జీవితురాలిని చేసినట్లే, నువ్వు మమ్మల్ని కూడా పునర్జీవితులను చేశావు. హాయిగా సుశీలను పెళ్లాడావు. నిన్నే నమ్ముకుని ఉన్నాం. మా గతి ఏమిటి?’ అన్నారు. ‘ఒకరికి ఒక భార్య ఉండటమే ధర్మం’ అన్నాడు మృగశృంగుడు.‘ఒకరికి ఒక భార్య మాత్రమే ఉండాలనే నియమం ఏ శాస్త్రంలోనూ లేదు. దశరథునికి ముగ్గురు భార్యలు లేరా? ఆ కృష్ణ పరమాత్ముడికి ఏకంగా ఎనిమిది మంది భార్యలు ఉన్నారే! చివరకు ఆదిభిక్షువైన ఆ పరమశివునికి కూడా గంగ, గౌరి ఇద్దరూ భార్యలుగా ఉన్నారు కదా!’ అని వాదించారు.మృగశృంగుడు వారికి బదులివ్వలేక ఉక్కిరిబిక్కిరి అయ్యాడు.ఈలోగా పెద్దలైన కొందరు మునులు కలగజేసుకుని, ‘మృగశృంగా! అభ్యంతరం చెప్పకు. ఈ కన్యలిద్దరిని కూడా వారి మనోభీష్టం మేరకు పెళ్లాడు. బహుభార్యలను కలిగి ఉండటం శాస్త్రవిరుద్ధం కాదు. మొండిగా నువ్వు వారిని తిరస్కరిస్తే, వారు బాధపడి కన్నీరుపెడితే నీకు జయం కాదు’ అని నచ్చచెప్పారు.పెద్దలందరూ నచ్చజెప్పడంతో చివరకు మృగశృంగుడు సుశీల చెలికత్తెలిద్దరిని కూడా వివాహమాడాడు. ∙సాంఖ్యాయన -
మెగాస్టార్ 157 ప్రాజెక్ట్‌లో నయనతార
హీరో చిరంజీవి నటించనున్న157వ సినిమాకి ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్‌పై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మించనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మరింత ఊపందుకున్నాయి. ‘‘మెగా ఫిల్మ్ కోసం మెగా స్టార్ట్. చిరంజీవిగారి 157వ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌ను స్టార్ట్ చేశాం’’ అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు దర్శకుడు వశిష్ఠ. అడ్వెంచరస్ సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. నవంబరు నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరిగేలా చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోందని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార, అనుష్క, మృణాళ్ ఠాకూర్ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. మరి ఫైనల్‌గా ఎవరు ఫిక్స్ అవుతారో వేచి చూడాలి. ఈ సినిమాకు కెమెరా: ఛోటా కె. నాయుడు. -
చిరంజీవి కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది.. వివరాలు ఇవే
భారీ అంచనాల మధ్య విడుదలైన భోళా శంకర్ చిరంజీవి కెరియర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచిపోయింది. దీంతో చిరంజీవి కొంత గ్యాప్ తీసుకుని తన తన తదుపరి సినిమాల విషయంలో నిర్ణయం తీసుకుంటాడని సోషల్‌మీడియాలో ప్రచారం జరిగింది. వరుస పరాజయల తర్వాత కొంత బ్రేక్ తీసుకొన్న తరవాతే.. కొత్త సినిమా ప్రకటన ఉంటుందని వార్తలొచ్చాయి. అయితే, మెగాస్టార్ ప్రణాళికల్లో ఎలాంటి మార్పూ లేదని, ఇలాంటి ఒడిదుడుకులు సహజమేనని ఈ ప్రకటనతో చిరంజీవి తెలిపారని చెప్పవచ్చు. (ఇదీ చదవండి: ఆ సినిమా కోసం అనిరుధ్ మ్యూజిక్‌తో పాటు ఆరుగురు వరల్డ్ ఫేమస్ ఫైట్ మాస్టర్స్) ముందుగా అనుకొన్నట్టుగానే తన పుట్టిన రోజున నేడు (ఆగష్టు 22) కొత్త సినిమా ప్రకటన వచ్చేస్తోంది. దానిలో భాగంగానే కొన్నిగంటల క్రితం యూవీ క్రియేషన్స్ ట్విటర్ ద్వారా ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత చిరంజీవి చెయబోయే సినిమా ఎవరితో ఉంటుందా అని ఫ్యాన్స్ చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న సమయంలో తాజాగా యూవీ క్రియేషన్స్ అధికారికంగా సోషల్‌మీడియాలో ఒక పోస్టర్‌తో గుడ్‌న్యూస్ తెలిపింది. నేడు 10:53 నిమిషాలకు మెగాస్టార్ మూవీకి చెందిన పలు వివరాలను ప్రకటిస్తామని వారు వెల్లడించారు. యూవీ క్రియేషన్స్-చిరంజీవి కాంబినేషన్లో వస్తున్న ఈ బిగ్ ప్రాజెక్ట్‌తో బింబిసార మూవీ ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ మెగాఫోన్ పట్టనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు. (ఇదీ చదవండి: ఫైనల్‌గా వశిష్ఠకే దక్కిన మెగా 157 ప్రాజెక్ట్) The universe conspires for beautiful things to happen ✨ One man inspires us to achieve the universe itself 💫 Stay tuned to @UV_Creations ❤️ Today at 10.53 AM 🔮#HBDMegastarChiranjeevi pic.twitter.com/v7W9LCB8Ij — UV Creations (@UV_Creations) August 21, 2023 -
చిరు కొత్త సినిమా ప్రకటన.. సూపర్ హిట్ డైరెక్టర్‌కు ఛాన్స్
మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఈ శుక్రవారం (ఆగస్టు 11) రిలీజ్ అయింది. అయితే, ఈ సినిమా ప్రేక్షకులు, విమర్శకుల నుంచి నెగెటివ్ టాక్‌ను తెచ్చుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఆశించిన వసూళ్లను రాబట్టలేకపోవచ్చు. అంతేకాకుండా చిత్ర నిర్మాతలకు భారీగా నష్టాలు రావడం ఖాయం అని తెలుస్తోంది. ముఖ్యంగా మెహర్ రమేశ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన ఔట్‌డేటెడ్ విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతనిపై భారీగా ట్రోల్స్ కూడా వస్తున్నాయి. థియేటర్ల వద్దే ఆయనపై పలు వ్యాఖ్యలతో ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. ఇలాంటి సమయంలో చిరంజీవి తర్వాత సినిమాకు డైరెక్ట్ చేయాలంటే చాలా ఘట్స్ ఉండాల్సిందే. వాల్తేరు వీరయ్య మినహా వరసు ప్లాపులతో ఉన్న చిరుకు ఖచ్చితంగా భారీ హిట్ అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి సమయంలో చిరంజీవి తర్వాత చేయనున్న ఓ సినిమాపై తాజాగా సమాచారం బయటికి వచ్చింది. తన 157వ చిత్రాన్ని సోషియో ఫ్యాంటసీ జోనర్లో మెగాస్టార్ చేయనున్నారు. బింబిసార మూవీ ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మించనుంది. తాజాగా, ఈ మూవీ షూటింగ్ ప్రారంభం గురించి సమాచారం బయటికి వచ్చింది. ఎప్పుడు ప్రారంభం చిరంజీవి - డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్లో ఈ సోషియో ఫ్యాంటసీ మూవీ షూటింగ్ ఈ ఏడాది నవంబర్‌లో మొదలుకానున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం డేట్లను కూడా మెగాస్టార్ కేటాయించారట. ఈ సినిమాకు 'ముల్లోక వీరుడు' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి కెరీర్లో మైలురాయి చిత్రంగా నిలిచిన 'జగదేకవీరుడు అతిలోక సుందరి' తరహాలోనే ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఈ రీమేక్ సంగతేంటి..? ఈ సోషియో ఫ్యాంటసీ సినిమా కంటే ముందు మలయాళ సినిమా 'బ్రో డాడీ' రీమేక్ మూవీని చిరంజీవి మొదలుపెడతారని తెలుస్తోంది. 'సోగ్గాడే చిన్ననాయన, బంగార్రాజు మూవీస్ ఫేమ్ కల్యాణ్ కృష్ణ ఈ మెగా156 చిత్రానికి దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఇప్పుడు భోళా శంకర్ దెబ్బతో ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లడం కష్టమేనని సమచారం. ఈ మధ్య కాలంలో మెగా బ్రదర్స్ వరసగా రీమేక్స్ సినిమాలే చేస్తుండటంతో సాధారణ ప్రేక్షకులతో పాటు మెగా అభిమానులు కూడా కొంతమేరకు అసహనానికి గురౌతున్నారు. దీంతో బ్రో డాడీని పక్కనబెట్టి... సోషియో ఫ్యాంటసీ సినిమాకే చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. గతంలో రజనీ,కమల్ వంటి వారికి కంటిన్వ్యూగా ప్లాప్‌లు వచ్చాయి. తర్వాత వారిద్దరికి జైలర్,విక్రమ్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద వారి స్టామినా ఎంటో చూపించాయి. ఇలాగే చిరుకు ఒక్క సినిమా పడితే చాలు టాలీవుడ్లో తన సత్తా ఎంటో చెబుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. -
మెగాస్టార్‌తో బింబిసార డైరెక్టర్ ఫిల్మ్ ఫిక్స్
-
కథ విన్నారా?
హీరో చిరంజీవి, ‘బింబిసార’ ఫేమ్ దర్శకుడు వశిష్ఠ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుందా? చిరంజీవి కథ విన్నారా? అంటే ఫిల్మ్‌నగర్ అవునంటోంది. చిరంజీవికి వశిష్ఠ ఇటీవల ఓ కథ చెప్పారట. ఆ స్టోరీ చిరంజీవిని ఇంప్రెస్ చేయడంతో ప్రస్తుతం స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారట వశిష్ఠ. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. ఇక ప్రస్తుతం ‘భోళా శంకర్’ చిత్రంతో బిజీగా ఉన్నారు చిరంజీవి. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. -
AP Govt: వశిష్ట నిర్మాణానికి ఓకే.. రూ.490 కోట్ల వ్యయంతో వారధి..
సాక్షి, ఏలూరు: తీరప్రాంత ప్రజల చిరకాల కోరికగా మిగిలిన వశిష్ట గోదావరి వారధి నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనేక అడ్డంకులు, అవరోధాలు, కోర్టు కేసులను దాటుకుని వచ్చే జనవరిలో టెండర్లు నిర్వహించి యుద్ధప్రాతిపదికన పనులు నిర్వహించనున్నారు. వశిష్ట గోదావరిపై వంతెన కట్టి ప్రజల చిరకాల కల నెరవేరుస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల నర్సాపురం పర్యటనలో ప్రకటించారు. ఉభయగోదావరి జిల్లాలను కలిపే కీలక బ్రిడ్జి కావడంతో ముఖ్యమంత్రి ప్రకటనతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. బ్రిటీష్ హయాంలోనే అంకురార్పణ జరిగిన ఈ వంతెన నిర్మాణం దశాబ్దాల కలగా మిగిలిపోయింది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా వంతెన నిర్మాణం ప్రారంభమవుతుందన్న తరుణంలో ఆయన అకాల మృతితో ఆ ప్రయత్నం కూడా ఆగిసోయింది. మళ్లీ ఆయన తనయుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వంతెన నిర్మాణంపై దృష్టి పెట్టారు. 216 జాతీయ రహదారికి బైపాస్ నిర్మించి.. రూ.490 కోట్లతో నరసాపురం మండలం రాజుల్లంక గ్రామం వద్ద వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. కోనసీమ జిల్లా చించినాడ మీదుగా నరసాపురం నుంచి ఒంగోలు వరకూ నిర్మించిన 216 జాతీయ రహదారికి బైపాస్ నిర్మించడం ద్వారా వంతెన నిర్మాణం చేపట్టబోతున్నారు. కోనసీమ జిల్లా శివకోడు నుంచి టేకిశెట్టిపాలెం మీదుగా ఉన్న స్టేట్‌హైవేను జాతీయ రహదారిగా మార్పుచేసి రామేశ్వరం మీదుగా ఇటు పశ్చిమగోదావరి జిల్లాలోని రాజుల్లంక, వైఎస్ పాలెం, సీతారామపురం మీదుగా 216 జాతీయ రహదారికి బైపాస్ హైవే రోడ్డు నిర్మించనున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా హామీ ఇచ్చారు 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ వంతెన పనులకు శంకుస్థాపన చేశారు. పనులు మైథాస్ సంస్థకు అప్పగించారు. అయితే ఈ సంస్థ సంక్షోభంలోకి వెళ్లడంతో మళ్లీ మరో కంపెనీకి వంతెన పనులు అప్పగించారు. కానీ ఆయన మృతితో పనులు నిలిచిపోయాయి. తరువాత టీడీపీ ప్రభుత్వం వంతెన విషయంలో అనేక డ్రామాలు నడిపింది. ఇప్పుడు కూడా ప్రభుత్వానికి పేరు వస్తుందనే వంతెన నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ జనవరిలో వంతెన పనులకు టెండర్లు పిలుస్తాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యత తీసుకుని, బ్రిటీష్ కాలం నుంచి డిమాండ్‌గా ఉన్న వంతెన నిర్మాణానికి పూనుకుంటున్నారు. – ముదునూరి ప్రసాదరాజు, ప్రభుత్వ చీఫ్ విప్ దశాబ్దాల కలల వారధి 1910లో నరసాపురం పట్టణం వద్ద వంతెన నిర్మాణానికి అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం కేవలం రూ.70 వేలతో అంచనాలు తయారు చేసింది. అయితే అది కార్యరూపం దాల్చలేదు. ఇక అప్పటి నుంచి నరసాపురం వశిష్ట వంతెన కథ నడుస్తూనే ఉంది. ప్రతీ ఎన్నికల సమయంలోనూ నేతలు హామీలు ఇవ్వడం, మరిచిపోవడం జరుగుతోంది. 1986లో మొదటిసారిగా నరసాపురం వశిష్ట వంతెనకు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు శంకుస్థాపన చేశారు. అయితే తరువాత రాజకీయ కారణాలతో ఇక్కడ నిర్మించాల్సిన వంతెనను చించినాడలో నిర్మించారు. 2003లో చంద్రబాబు హయాంలో ఫ్లోటింగ్ బ్రిడ్జి అంటూ హడావిడి చేసి శంకుస్థాపన చేశారు. రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉండగా కూడా వశిష్ట వంతెన నిర్మాణంపై సాక్షాత్తు అసెంబ్లీలో ప్రకటన చేసి హడావిడి చేయడం జరిగింది. కోర్టులకెక్కి ఆపే ప్రయత్నం.. నిజానికి ఈ నెల 18న నరసాపురంలో జరిగిన ముఖ్యమంత్రి పర్యటనలో శంకుస్థాపనలు జరిగిన రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్‌లతో పాటే వశిష్ట వంతెనకు కూడా శంకుస్థాపన జరగాలి. అయితే స్థలసేకరణ విషయం వచ్చేసరికి ఈ ప్రభుత్వం హయాంలో వంతెన నిర్మాణానికి బీజం పడితే జగన్ సర్కారుకు ఎక్కడ పేరు వస్తుందేమోనని.. ప్రతిపక్షాలు కుట్రలకు తెరలేపాయి. కావాలని అడ్డంకులు సృష్టించడానికి స్థల సేకరణ అంశంలో కోర్టుకు వెళ్లి స్టే తీసుకువచ్చారు. అయితే ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు గట్టి ప్రయత్నం చేసి స్టేను వెకేట్ చేయించి, ముఖ్యమంత్రితో శంకుస్థాపన చేయించాలని నిర్ణయించారు. తీరా ముఖ్యమంత్రి పర్యటన దగ్గరికి వచ్చే సమయానికి మళ్లీ రెండోసారి కోర్టు నుంచి స్టే తీసుకువచ్చారు. దీని వెనుక టీడీపీ, జనసేన నాయకులు ఉన్నట్టు సమాచారం. సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక చొరవతో.. చించినాడ 216 జాతీయ రహదారికి కోనసీమ జిల్లా నుంచి నరసాపురం వరకూ బైపాస్ నిర్మించి, మధ్యలో వంతెన నిర్మిస్తే ఈ ప్రాజెక్ట్‌కు మోక్షం కలుగుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా కేంద్ర మంత్రి నితిన్ గట్కరీకి లేఖ రాయడం, శివకోడు సఖినేటిపల్లి మీదుగా రామేశ్వరం నుంచి నరసాపురం వరకూ 25 కిలోమీటర్ల మేర స్టేట్ హైవేను 216కు బైపాస్‌గా నేషనల్ హైవేగా మార్పు చేయాలని, మధ్యలో రాజుల్లంకవద్ద గోదావరిపై వంతెన నిర్మించాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖకు స్పందించిన గట్కరీ వెంటనే ఆమోదం తెలపడంతో దశాబ్దాల వంతెన సమస్యకు లైన్ క్లియర్ అయ్యింది. -
బిగ్‌బాస్ తనీష్ హీరోగా 'అంతేలే కథ అంతేలే'
బిగ్‌బాస్ కంటెస్టెంట్ తనీష్, వికాస్ వశిష్ట (సినిమాబండి) సహర్ కృష్ణన్ (హీరోయిన్) , శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం "అంతేలే కథ అంతేలే". మహారాజశ్రీ, లంక వంటి చిత్రాలతో ప్రేక్షకాదరణ పొందినటువంటి దర్శకుడు శ్రీ ఎం నివాస్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. అనంతపురం బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది. ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు నివాస్ మాట్లాడుతూ.. రిధిమ క్రియేషన్స్ పతాకంపై అంతేలే కథ అంతేలే సినిమా నిర్మిస్తున్నాం. రాయలసీమ ప్రాంతంలోని ఒక మారుమూల గ్రామంలో జరిగే కథ ఇది. ఇందులో అనేక భావోద్వేగాలు మిళితమై ఉంటాయి. ఈ చిత్రాన్ని అనంతపురం, నల్గొండ, హైదరాబాద్‌లలో మూడు షెడ్యూల్స్‌లో షూటింగ్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాము' అన్నారు. హీరో తనీష్ మాట్లాడుతూ.. 'ఇలాంటి సినిమాలు చాలా తక్కువ మంది అటెంప్ట్ చేస్తారు. అయితే ఇలాంటి సినిమాలు తక్కువ వచ్చినా ప్రేక్షకులు అదరిస్తారు. ఇప్పటి వరకు నాకున్న ఇమేజ్, నేను చేసిన పాత్రల నుంచి బయటకు వచ్చి చేస్తున్న అద్భుతమైన ఎమోషన్స్‌తో కూడిన పాత్ర ఇది. ఈ సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకుల గుండెలు బరువెక్కుతాయి' అన్నారు. హీరోయిన్ సహార్ కృష్ణన్ మాట్లాడుతూ.. 'నా యాక్టింగ్ చూడకుండానే నన్ను ఇంత ఎమోషన్ ఉన్న పాత్రకు సెలెక్ట్ చేసుకున్న దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు' అన్నారు. నటుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. 'సీనియర్ నటి గీతాంజలి రామకృష్ణ గారి అబ్బాయిని. ఇంతకుముందు నేను కొన్ని సినిమాలు చేశాను. ఈ సినిమాలో నాకు మంచి గుర్తింపు వచ్చే పాత్ర దొరికింది' అన్నారు. చదవండి: నా షోకి రమ్మని వాళ్లిద్దరినీ ఎప్పటికీ పిలవను త్రిష రాజకీయ ఎంట్రీపై స్పందించిన హీరోయిన్ తల్లి! -
‘బింబిసార’కోసం త్రిగర్తల సామ్రాజ్యాన్ని క్రియేట్ చేశాం : దర్శకుడు
‘బింబిసారుడు అనే రాజు 500 సంవత్సరాలకు ముందు పరిపాలించిన రాజు. ఆయనకు సంబంధించిన వివరాలేవీ తెలియదు. ఆయన చరిత్రకి మా చిత్రానికి ఎలాంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా కల్పిత కథ. సాధారణంగా ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో ఏదో కాలంలోకి వెళ్లినట్లు చూపించారు. కానీ ఇదే కాలానికి చెందిన ఓ రాజు మరో పీరియడ్‌లోకి వస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో నుంచే ‘బింబిసార’ కథ పుట్టింది’ అన్నారు యువ దర్శకుడు వశిష్ట్. ఆయన దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బింబిసార’. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్ క్యాప్షన్. వశిష్ట్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ .కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 5న ఈ మూవీ గ్రాండ్ లెవల్లో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు వశిష్ట సినిమా గురించి విశేషాలు.. ► 2018లో ‘బింబిసార’ జర్నీ ప్రారంభమైంది. కథంతా ఓ ఫార్మేట్లోకి వచ్చిన తర్వాత కల్యాణ్ రామ్‌ని కలిశాను. నేను చెప్పిన పాయింట్ ఆయనకు బాగా నచ్చేసింది. రెండు, మూడు రోజుల్లో కలుద్దామని అన్నారు. అప్పుడు నిర్మాత హరిగారికి కథ నెరేట్ చేశాను. ఆయనకు నచ్చింది. తర్వాత సినిమా ఎలా ముందుకెళ్లిందనేది అందరికీ తెలిసిందే. ► నాకిది తొలి సినిమా. నా సబ్జెక్ట్‌ని కళ్యాణ్‌రామ్, నిర్మాత హరి నమ్మారు. బింబిసార వంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. వారు నాకు ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవటానికి ఎంత కష్టపడాలో అంతా కష్టపడ్డాను. నాకు టీమ్ కూడా బాగా సపోర్ట్ చేసింది. కెమెరామెన్ ఛోటాగారు, ఆర్ట్ డైరెక్టర్ కిరణ్‌గారు, ఫైట్ మాస్టర్ ఇలా అందరి సపోర్ట్‌తో సినిమాను అనుకున్న సమయంలో పూర్తి చేయగలిగాం. ► నాకు ముందు నుంచి డైరెక్షన్ అంటేనే ఇష్టం. అయితే మధ్యలో ప్రేమ లేఖ రాశా అనే సినిమాలో హీరోగా నటించాను. అయితే ఆ సినిమా రిలీజ్ కాలేదు. చివరకు నాకు వచ్చిన, నచ్చిన పని చేసుకోవటం ఉత్తమం అనిపించింది. దాంతో మళ్లీ దర్శకత్వ శాఖ వైపు అడుగు లేశాను. ► ‘బింబిసార’ టైమ్ ట్రావెల్ మూవీ. కాబట్టి నేను కొత్తగా నేర్చుకుంటూ దాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేశాను. ఓరకంగా చెప్పాలంటే నాకు కూడా ప్రతిరోజూ టైమ్ ట్రావెల్ చేసినట్లు అనిపించేది. బింబిసారుడుకి సంబంధించి త్రిగర్తల అనే సామ్రాజ్యాన్ని క్రియేట్ చేశాం. ► మన దేశాన్ని పాలించిన మన రాజులు ఎవరున్నారు అని ఆలోచించినప్పుడు బింబిసారుడు గురించి తెలిసింది. ఆ పేరు కూడా స్ట్రైకింగ్‌గా అనిపించింది. ఇది పూర్తిగా కల్పిత కథ. ► బింబిసార సినిమా అనుకోగానే కీరవాణిగారినే మ్యూజిక్ డైరెక్టర్‌గా అనుకున్నాం. అయితే అప్పటికే ఆయన ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. దీంతో ఆయన్ని కలవలేకపోయాం. అప్పుడు చిరంతన్ భట్ గారిని అనుకున్నాం. ఎందుకంటే అప్పటికే ఆయన ఈ టైప్ ఆఫ్ మూవీ గౌతమీ పుత్ర శాతకర్ణిని చేసున్నారు. ఆయన్ని కలిసి కథ చెప్పిన తర్వాత కర్మ సాంగ్‌ను ఇచ్చారు. తర్వాత మరో సాంగ్‌ను ఇచ్చారు. మూడో సాంగ్‌ను వరికుప్పల యాదగిరి ఇచ్చారు. ఫోక్ సాంగ్ కావాలి. కానీ.. రొటీన్ ఫోక్ కాకూడదనిపించి.. వరికుప్పల యాదగిరికి విషయం చెబితే ఆయనే ట్యూన్ కంపోజ్ చేశారు. తర్వాత టీజర్‌కి సంతోష్ నారాయణ్మ్యూజిక్ అందించారు. తర్వాత ఆయన బిజీగా ఉండటంతో కీరవాణిగారిని కలిశాం. ఆయన సినిమా చూసి ఏమంటారోనని కాస్త ఆలోచించాం. కానీ ఆయన సినిమా చూసి వర్క్ చేస్తానని చెప్పారు. ► సీనియర్ ఎన్టీఆర్ నుంచి ఇప్పటి వరకు చాలా మంది హీరోలు రాజుల పాత్రల్లో మనల్ని అలరించారు. వారికి దగ్గర పోలికల్లో మన సినిమాలో హీరో లుక్ ఉండకూడదని అనిపించింది. ఆ సమయంలో మా డిజైనర్ రాము కొన్ని స్కెచెస్ ఇచ్చారు. అందులో ఇప్పటి లుక్ అందరికీ నచ్చింది. ► బింబిసార చిత్రాన్ని రెండు భాగాలుగా చూపించబోతున్నాం. ఇందులో పాత్రలన్నీంటికీ ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి అన్నింటినీ ఓ సినిమాలోనే చూపించలేం. కాబట్టి రెండు భాగాలు చేయాలని అనుకుంటున్నాం. స్క్రిప్టింగ్ టైమ్‌లోనే ఈ ఆలోచన ఉంది. బింబిసారుడు అనే క్యారెక్టర్ ఓ సూపర్ మ్యాన్‌లాంటి క్యారెక్టర్ దీన్ని 3, 4 భాగాలుగా కూడా చూపించవచ్చు.