
భారీ అంచనాల మధ్య విడుదలైన భోళా శంకర్ చిరంజీవి కెరియర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచిపోయింది. దీంతో చిరంజీవి కొంత గ్యాప్ తీసుకుని తన తన తదుపరి సినిమాల విషయంలో నిర్ణయం తీసుకుంటాడని సోషల్‌మీడియాలో ప్రచారం జరిగింది. వరుస పరాజయల తర్వాత కొంత బ్రేక్ తీసుకొన్న తరవాతే.. కొత్త సినిమా ప్రకటన ఉంటుందని వార్తలొచ్చాయి. అయితే, మెగాస్టార్ ప్రణాళికల్లో ఎలాంటి మార్పూ లేదని, ఇలాంటి ఒడిదుడుకులు సహజమేనని ఈ ప్రకటనతో చిరంజీవి తెలిపారని చెప్పవచ్చు.
(ఇదీ చదవండి: ఆ సినిమా కోసం అనిరుధ్ మ్యూజిక్‌తో పాటు ఆరుగురు వరల్డ్ ఫేమస్ ఫైట్ మాస్టర్స్)
ముందుగా అనుకొన్నట్టుగానే తన పుట్టిన రోజున నేడు (ఆగష్టు 22) కొత్త సినిమా ప్రకటన వచ్చేస్తోంది. దానిలో భాగంగానే కొన్నిగంటల క్రితం యూవీ క్రియేషన్స్ ట్విటర్ ద్వారా ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత చిరంజీవి చెయబోయే సినిమా ఎవరితో ఉంటుందా అని ఫ్యాన్స్ చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న సమయంలో తాజాగా యూవీ క్రియేషన్స్ అధికారికంగా సోషల్‌మీడియాలో ఒక పోస్టర్‌తో గుడ్‌న్యూస్ తెలిపింది. నేడు 10:53 నిమిషాలకు మెగాస్టార్ మూవీకి చెందిన పలు వివరాలను ప్రకటిస్తామని వారు వెల్లడించారు.
యూవీ క్రియేషన్స్-చిరంజీవి కాంబినేషన్‌లో వస్తున్న ఈ బిగ్ ప్రాజెక్ట్‌తో బింబిసార మూవీ ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ మెగాఫోన్ పట్టనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు.
(ఇదీ చదవండి: ఫైనల్‌గా వశిష్ఠకే దక్కిన మెగా 157 ప్రాజెక్ట్)
The universe conspires for beautiful things to happen ✨
— UV Creations (@UV_Creations) August 21, 2023
One man inspires us to achieve the universe itself 💫
Stay tuned to @UV_Creations ❤️
Today at 10.53 AM 🔮#HBDMegastarChiranjeevi pic.twitter.com/v7W9LCB8Ij