మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఈ శుక్రవారం (ఆగస్టు 11) రిలీజ్ అయింది. అయితే, ఈ సినిమా ప్రేక్షకులు, విమర్శకుల నుంచి నెగెటివ్ టాక్‌ను తెచ్చుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఆశించిన వసూళ్లను రాబట్టలేకపోవచ్చు. అంతేకాకుండా చిత్ర నిర్మాతలకు భారీగా నష్టాలు రావడం ఖాయం అని తెలుస్తోంది. ముఖ్యంగా మెహర్ రమేశ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన ఔట్‍డేటెడ్ విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అతనిపై భారీగా ట్రోల్స్ కూడా వస్తున్నాయి. థియేటర్ల వద్దే ఆయనపై పలు వ్యాఖ్యలతో ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. ఇలాంటి సమయంలో చిరంజీవి తర్వాత సినిమాకు డైరెక్ట్ చేయాలంటే చాలా ఘట్స్ ఉండాల్సిందే. వాల్తేరు వీరయ్య మినహా వరసు ప్లాపులతో ఉన్న చిరుకు ఖచ్చితంగా భారీ హిట్ అవసరం ఎంతైనా ఉంది.
ఇలాంటి సమయంలో చిరంజీవి తర్వాత చేయనున్న ఓ సినిమాపై తాజాగా సమాచారం బయటికి వచ్చింది. తన 157వ చిత్రాన్ని సోషియో ఫ్యాంటసీ జోనర్‌లో మెగాస్టార్ చేయనున్నారు. బింబిసార మూవీ ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మించనుంది. తాజాగా, ఈ మూవీ షూటింగ్ ప్రారంభం గురించి సమాచారం బయటికి వచ్చింది.
ఎప్పుడు ప్రారంభం
చిరంజీవి - డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్‍లో ఈ సోషియో ఫ్యాంటసీ మూవీ షూటింగ్ ఈ ఏడాది నవంబర్‌లో మొదలుకానున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం డేట్లను కూడా మెగాస్టార్ కేటాయించారట. ఈ సినిమాకు 'ముల్లోక వీరుడు' అనే టైటిల్‍ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి కెరీర్‌లో మైలురాయి చిత్రంగా నిలిచిన 'జగదేకవీరుడు అతిలోక సుందరి' తరహాలోనే ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది.
ఈ రీమేక్ సంగతేంటి..?
ఈ సోషియో ఫ్యాంటసీ సినిమా కంటే ముందు మలయాళ సినిమా 'బ్రో డాడీ' రీమేక్ మూవీని చిరంజీవి మొదలుపెడతారని తెలుస్తోంది. 'సోగ్గాడే చిన్ననాయన, బంగార్రాజు మూవీస్ ఫేమ్ కల్యాణ్ కృష్ణ ఈ మెగా156 చిత్రానికి దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఇప్పుడు భోళా శంకర్ దెబ్బతో ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లడం కష్టమేనని సమచారం. ఈ మధ్య కాలంలో మెగా బ్రదర్స్ వరసగా రీమేక్స్ సినిమాలే చేస్తుండటంతో సాధారణ ప్రేక్షకులతో పాటు మెగా అభిమానులు కూడా కొంతమేరకు అసహనానికి గురౌతున్నారు.
దీంతో బ్రో డాడీని పక్కనబెట్టి... సోషియో ఫ్యాంటసీ సినిమాకే చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. గతంలో రజనీ,కమల్ వంటి వారికి కంటిన్వ్యూగా ప్లాప్‌లు వచ్చాయి. తర్వాత వారిద్దరికి జైలర్,విక్రమ్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద వారి స్టామినా ఎంటో చూపించాయి. ఇలాగే చిరుకు ఒక్క సినిమా పడితే చాలు టాలీవుడ్‌లో తన సత్తా ఎంటో చెబుతుందని ఫ్యాన్స్ అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment