socio fantasy movie
-
మెగాస్టార్ 157 ప్రాజెక్ట్‌లో నయనతార
హీరో చిరంజీవి నటించనున్న157వ సినిమాకి ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్‌పై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మించనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మరింత ఊపందుకున్నాయి. ‘‘మెగా ఫిల్మ్ కోసం మెగా స్టార్ట్. చిరంజీవిగారి 157వ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌ను స్టార్ట్ చేశాం’’ అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు దర్శకుడు వశిష్ఠ. అడ్వెంచరస్ సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. నవంబరు నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరిగేలా చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోందని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార, అనుష్క, మృణాళ్ ఠాకూర్ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. మరి ఫైనల్‌గా ఎవరు ఫిక్స్ అవుతారో వేచి చూడాలి. ఈ సినిమాకు కెమెరా: ఛోటా కె. నాయుడు. -
రెండో సినిమానే చిరంజీవితో.. ఈ డైరెక్టర్ అంత స్పెషలా?
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రెండు కొత్త సినిమాల్ని ప్రకటించారు. అందులో ఒకటి ఆయన కూతురు సుస్మిత నిర్మిస్తోంది. దీనికి 'Chiru156' అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. అలానే 'బింబిసార' ఫేమ్ దర్శకుడు మల్లిడి వశిష్ట్‌తో చిరు కలిసి పనిచేయబోతున్నారు. దీనికి 'chiru157' అనేది వర్కింగ్ టైటిల్. అయితే రెండో మూవీకే చిరుతో కలిసి బంపరాఫర్ కొట్టేసిన ఈ కుర్ర డైరెక్టర్ ఎవరు? అతడి బ్యాక్ గ్రౌండ్ ఏంటి? (ఇదీ చదవండి: 'రీమేక్స్'... చిరుకు కలిసొచ్చాయా? ముంచేశాయా?) 20 ఏళ్ల తర్వాత అప్పుడెప్పుడో 2003లో చిరు 'అంజి' అనే సోషియో ఫాంటసీ సినిమా చేశారు. ఆరేడేళ్ల పాటు సెట్స్‌పై ఉన్న ఆ సినిమా అప్పట్లో ఎందుకో సరిగా వర్కౌట్ కాలేదు. దీంతో చిరు ఆ తరహా చిత్రాలు చేయడమే మానేశారు. మళ్లీ ఇన్నాళ్లకు సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్లో నటించబోతున్నారు. దీనికి వశిష్ట్ దర్శకుడు కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. హీరో నుంచి డైరెక్టర్ తెలుగులో పలు సినిమాలతో నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న మల్లిడి సత్యనారాయణ కొడుకే వశిష్ట్. ఇప్పుడంటే దర్శకుడిగా ఒక్క సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇండస్ట్రీలోకి మల్లిడి వేణు పేరుతో తొలుత హీరోగా పరిచయమయ్యాడు. 16 ఏళ్ల క్రితం 'ప్రేమలేఖ రాశా' అనే మూవీలో నటించాడు. అందులో అంజలి హీరోయిన్. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ వర్కౌట్ కాకపోవడంతో వేణు నటన పక్కనబెట్టేశాడు. (ఇదీ చదవండి: రీఎంట్రీలో చిరంజీవి ఆ తప్పులు చేస్తున్నారా?) ఒక్క సినిమాతో యాక్టింగ్ నుంచి సైడ్ అయిన వేణు.. తన పేరుని వశిష్ట్గా డైరెక్షన్ రూట్లోకి వచ్చాడు. కథలు పట్టుకుని రవితేజ, అల్లు శిరీష్ లాంటి హీరోలతో సినిమాలు తీసే ప్రయత్నాలు చేశాడు. కానీ శిరీష్‌తో ఓ ప్రాజెక్ట్ ఓకే అయి, బడ్జెట్ కారణాల వల్ల ఆగిపోయింది. ఫైనల్‌గా ఇతడిని నమ్మిన కల్యాణ్ రామ్.. 'బింబిసార' చేసే ఛాన్స్ ఇచ్చాడు. బాక్సాఫీస్ దగ్గర ఇది సూపర్‌హిట్ కావడంతో వశిష్ట్ పేరు మార్మోగిపోయింది. పోస్టర్ చూస్తుంటే అయితే 'బింబిసార'తో సోషియో ఫాంటసీలో తన మార్క్ చూపించిన వశిష్ట్.. చిరుకు ఆ తరహా కథనే చెప్పాడు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో ఓ పెద్ద శిల.. దానిపై బంగారు నక్షత్రం గుర్తు.. అందులో పంచ భూతాలని సూచిస్తూ ఐదు గళ్లని నింపుతూ మధ్యలో త్రిశూలం ఉండటం చూస్తుంటే ఇదేదో పెద్ద ప్లానింగ్లా కనిపిస్తుంది. రెండో సినిమాకే మెగాస్టార్‌ని ఒప్పించాడంటే, వశిష్ట్ మరో హిట్ కొట్టడం కన్ఫర్మ్ అనిపిస్తుంది. ప్రస్తుతానికి పోస్టర్ మాత్రమే రిలీజ్ చేశారు. టీజర్ రిలీజ్ చేస్తే అప్పుడు స్టోరీ ఏంటనేది తెలిసే ఛాన్స్ ఉంటుంది. My heartfelt thanks to the MIGHTY MEGASTAR @KChiruTweets garu for believing me and giving me the chance to present you on BIG screens🙏🏻 Wishing the BOSS of Masses a very happy birthday!🌟 Here’s the concept poster of #MEGA157 - MEGA MASS BEYOND UNIVERSE 🔥 More details soon!… pic.twitter.com/oA0rg3g5Zn — Vassishta (@DirVassishta) August 22, 2023 (ఇదీ చదవండి: 30 ఏళ్లుగా చిరంజీవికి డూప్‌గా నటించిన ఈ వ్యక్తి గురించి తెలుసా?) -
త్రిభాషా చిత్రంలో ముంబయి నటి
చెన్నై: ‘విన్నైతాండి వంద ఏంజల్’ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో భారీ ఎత్తున తెరకెక్కుతోంది. సరస్వతి ఫిలింస్ పతాకంపై సింధూరపువ్వు కృష్ణారెడ్డి కథనం, నిర్మాణ బాధ్యతలను చేపట్టిన ఈ చిత్రానికి బాహుబలి కె.పళని దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈయన దర్శకుడు రాజమౌళి వద్ద బాహుబలి చిత్రానికి సహాయదర్శకుడిగా పని చేశారు. నాగఅన్వేష్ కథానాయకుడిగానూ ముంబయి బ్యూటీ నేహా పటేల్ నాయకిగానూ నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో సుమన్, శాయాజీషిండే, ప్రదీప్‌రావత్ తదితర భారీ తారాగణం నటిస్తున్నారు. చిత్ర వివరాలను నిర్మాత తెలుపుతూ..‘ జీవితం చాలా చిన్నది. త్వరగా సంపాదించి బాగా ఎంజాయ్ చేయాలని భావించే కథానాయకుడు, సరిగ్గా అలాంటి భావాలు కలిగిన అతని స్నేహితుడి మధ్య కలలో కూడా ఊహించని విధంగా ఒక యువతి వచ్చి చేరుతుంది. తను కూడా ఈ భూమిపై ఉన్న అన్ని సంతోషాలను అనుభవించాలని కోరుకుంటుంది. అలాంటి ఈ ముగ్గురూ అనూహ్యంగా ఒక ఆపదలో చిక్కుకుంటారు. అది ఆ అమ్మాయి కారణంగానే కలుగుతుందన్నది చిత్ర కథలో మలుపు..’ అని తెలిపారు. అయితే అది ఎలాంటి ఆపద? అందులోంచి వారు ఎలా బయట పడగలిగారన్న పలు ఆసక్తి కరమైన ఆశాలతో ఈ చిత్రం ఉంటుందని తెలిపారు. బాహుబలి తరువాత తమిళం, తెలుగు, హిందీలో తెరకెక్కుతున్న చిత్రం ఇదేనని అన్నారు. చారిత్రక నేపథ్యంలో హైటెక్నాలజీతో సోషల్ ఫాంటసీ అంశాలతో రూపొందిన బాహుబలి చిత్రం తరహాలో తమ చిత్రంలోనూ గ్రాఫిక్స్ సన్నివేశాలుంటాయని తెలిపారు. దీనికి బీం సంగీతాన్ని అందిస్తున్నట్లు నిర్మాత కృష్ణారెడ్డి తెలిపారు.