చెన్నై: ‘విన్నైతాండి వంద ఏంజల్’ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో భారీ ఎత్తున తెరకెక్కుతోంది. సరస్వతి ఫిలింస్ పతాకంపై సింధూరపువ్వు కృష్ణారెడ్డి కథనం, నిర్మాణ బాధ్యతలను చేపట్టిన ఈ చిత్రానికి బాహుబలి కె.పళని దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈయన దర్శకుడు రాజమౌళి వద్ద బాహుబలి చిత్రానికి సహాయదర్శకుడిగా పని చేశారు. నాగఅన్వేష్ కథానాయకుడిగానూ ముంబయి బ్యూటీ నేహా పటేల్ నాయకిగానూ నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో సుమన్, శాయాజీషిండే, ప్రదీప్‌రావత్ తదితర భారీ తారాగణం నటిస్తున్నారు.
చిత్ర వివరాలను నిర్మాత తెలుపుతూ..‘ జీవితం చాలా చిన్నది. త్వరగా సంపాదించి బాగా ఎంజాయ్ చేయాలని భావించే కథానాయకుడు, సరిగ్గా అలాంటి భావాలు కలిగిన అతని స్నేహితుడి మధ్య కలలో కూడా ఊహించని విధంగా ఒక యువతి వచ్చి చేరుతుంది. తను కూడా ఈ భూమిపై ఉన్న అన్ని సంతోషాలను అనుభవించాలని కోరుకుంటుంది. అలాంటి ఈ ముగ్గురూ అనూహ్యంగా ఒక ఆపదలో చిక్కుకుంటారు. అది ఆ అమ్మాయి కారణంగానే కలుగుతుందన్నది చిత్ర కథలో మలుపు..’ అని తెలిపారు.
అయితే అది ఎలాంటి ఆపద? అందులోంచి వారు ఎలా బయట పడగలిగారన్న పలు ఆసక్తి కరమైన ఆశాలతో ఈ చిత్రం ఉంటుందని తెలిపారు. బాహుబలి తరువాత తమిళం, తెలుగు, హిందీలో తెరకెక్కుతున్న చిత్రం ఇదేనని అన్నారు. చారిత్రక నేపథ్యంలో హైటెక్నాలజీతో సోషల్ ఫాంటసీ అంశాలతో రూపొందిన బాహుబలి చిత్రం తరహాలో తమ చిత్రంలోనూ గ్రాఫిక్స్ సన్నివేశాలుంటాయని తెలిపారు. దీనికి బీం సంగీతాన్ని అందిస్తున్నట్లు నిర్మాత కృష్ణారెడ్డి తెలిపారు.
త్రిభాషా చిత్రంలో ముంబయి నటి
Published Fri, Jul 7 2017 8:15 PM | Last Updated on Tue, Sep 5 2017 3:28 PM
Advertisement
Advertisement