Shruti Haasan To Star In International Movie The Eye - Sakshi
Sakshi News home page

Shruti Haasan: చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది!

Published Sat, Oct 22 2022 4:46 AM | Last Updated on Sat, Oct 22 2022 9:40 AM

Shruti Haasan to star in international movie The Eye - Sakshi

హీరోయిన్‌ శ్రుతీహాసన్‌ కొన్ని రోజులుగా గ్రీస్‌లోనే ఉంటున్నారు. ఏదైనా వెకేషన్‌కి వెళ్లారేమో? అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆమె అక్కడికి వెళ్లింది ఓ హాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ కోసం. డాఫ్నే ష్మోన్‌ దర్శకత్వంలో ‘ది ఐ’ అనే సైకలాజికల్‌ థ్రిల్లర్‌ మూవీ తెరకెక్కనుంది. ఈ ఇంగ్లీష్‌ ఫిల్మ్‌లో మార్క్‌ రౌలీ, శ్రుతీహాసన్‌ లీడ్‌ యాక్టర్స్‌గా నటించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్‌ గ్రీస్‌లో జరుగుతున్నాయి. ఈ వర్క్‌షాప్స్‌లో శ్రుతీహాసన్‌ పాల్గొంటున్నారు.

‘‘ఈ సినిమాలో భాగం కావడం నాకు స్పెషల్‌. చాలా ఎగై్జటింగ్‌గా ఉంది’’ అని ట్వీట్‌ చేశారు శ్రుతీహాసన్‌. 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాకు ఎమిలీ కార్లటన్‌ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఐస్లాండ్‌లో చనిపోయిన భర్త అస్తికల కోసం అక్కడికి వెళ్తుంది ఓ యువతి. భర్త మరణం గురించి కొన్ని ఊహించని అంశాలు తెలుసుకున్న ఆ యువతి అక్కడ ఏం చేసింది? అనే నేపథ్యంలో ఈ కథనం సాగుతుందట. కాగా  చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణతో ఓ సినిమాతో పాటు ప్రభాస్‌ ‘సలార్‌’లతో  బిజీగా ఉన్నారు శ్రుతీహాసన్‌.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement