Hollywood project
-
Shruti Haasan: చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది!
హీరోయిన్ శ్రుతీహాసన్ కొన్ని రోజులుగా గ్రీస్‌లోనే ఉంటున్నారు. ఏదైనా వెకేషన్‌కి వెళ్లారేమో? అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆమె అక్కడికి వెళ్లింది ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం. డాఫ్నే ష్మోన్ దర్శకత్వంలో ‘ది ఐ’ అనే సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కనుంది. ఈ ఇంగ్లీష్ ఫిల్మ్‌లో మార్క్ రౌలీ, శ్రుతీహాసన్ లీడ్ యాక్టర్స్‌గా నటించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ గ్రీస్‌లో జరుగుతున్నాయి. ఈ వర్క్‌షాప్స్‌లో శ్రుతీహాసన్ పాల్గొంటున్నారు. ‘‘ఈ సినిమాలో భాగం కావడం నాకు స్పెషల్. చాలా ఎగై్జటింగ్‌గా ఉంది’’ అని ట్వీట్ చేశారు శ్రుతీహాసన్. 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాకు ఎమిలీ కార్లటన్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఐస్లాండ్లో చనిపోయిన భర్త అస్తికల కోసం అక్కడికి వెళ్తుంది ఓ యువతి. భర్త మరణం గురించి కొన్ని ఊహించని అంశాలు తెలుసుకున్న ఆ యువతి అక్కడ ఏం చేసింది? అనే నేపథ్యంలో ఈ కథనం సాగుతుందట. కాగా చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణతో ఓ సినిమాతో పాటు ప్రభాస్ ‘సలార్’లతో బిజీగా ఉన్నారు శ్రుతీహాసన్. -
ప్రియాంకా చోప్రా దూకుడు : బిగ్ న్యూస్
సాక్షి, ముంబై: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా(38) కొత్త హాలీవుడ్ మూవీలో నటించబోతున్నారు. 2016 జర్మన్ భాషా చిత్రం ఎస్ఎంఎస్ ఫర్ డిచ్ రీమేక్ లో నటించే అవకాశం దక్కించుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. టెక్ట్స్ ఫర్ యూ పేరుతో రానున్న ఈ మూవీలో ప్రియాంకాకు హీరోయిన్గా నటించనున్నారు. అద్భుతమైన వ్యక్తులతో, అమోఘమైన సినిమాలో నటించడం చాలా సంతోషంగా, ఇది తనకు గొప్ప గౌరవంగా ఉందని ఆమె వెల్లడించారు. దీంతో ప్రియాంకాకు అభినందనల వెల్లువ కురుస్తోంది. ఆమె భర్త నిక్ జోనస్ కూడా ఫైర్ ఎమోజీని పోస్ట్ చేయడం విశేషం. ముఖ్యంగా గ్రామీ అవార్డు విజేత సెలిన్ డియోన్, నెట్‌ఫ్లిక్స్ సిరీస్ అవుట్ల్యాండర్ పాత్రలో మంచి పేరు తెచ్చుకున్న నటుడు సామ్ హ్యూఘన్‌తో కలిసి నటించనున్నట్లు ప్రియాంకా ఇన్‌స్టాలో వెల్లడించారు. ఈ మూవీని గ్రేస్ ఈజ్ గాన్, పీపుల్ ప్లేసెస్ థింగ్స్ , ది ఇన్ క్రెడిబుల్ జెస్సికా జేమ్స్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన జిమ్ స్ట్రౌజ్ డైరక్ట్ చేస్తున్నారు. స్టోరీ విషయానికి వస్తే..తన కాబోయే భర్తను కోల్పోయిన విషాదాన్నుంచి తేరుకునేందుకు తన పాత ఫోన్ కు శృంగార సందేశాలు పంపుతూ వుంటుంది హీరోయిన్. అయితే యాదృచ్చికంగా ఆ నంబరు దాదాపు ఇదే వేదన అనుభవిస్తున్న మరో వ్యక్తికి కేటాయిస్తారు. అలా రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కించనున్నఈ మూవీ సోఫీ క్రామెర్ ప్రసిద్ధ నవల ఆధారంగా రూపొందింది. కాగా ప్రియాంక ప్రధాన పాత్రలో తెరకెక్కిన అమెరికన్ టీవీ సీరీస్ క్వాంటికో ద్వారా హాలీవుడ్ లో కూడా మంచి మార్కులు కొట్టేసిన సంగతి తెలిసిందే. View this post on Instagram So excited to kick start this amazing movie with such incredible people! Jim Strouse, Sam Heughan, Celine Dion. It’s my honour. Let’s gooooo! @celinedion @samheughan #JimStrouse @sonypictures #ScreenGems A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on Oct 27, 2020 at 11:28am PDT -
40 రోజులు... వందకోట్లు!
హాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న బాలీవుడ్ కథానాయిక ప్రియాంకా చోప్రా ఇండియాకు వస్తున్నారు. ఏకంగా 40 రోజుల పాటు ఆమె బస ఇక్కడే. అదేంటి ఇంత బిజీలో కూడా ఆమె ఎందుకోసం వస్తున్నారు? సినిమా షూటింగ్ కోసమా? ఏ సినిమాలో నటిస్తున్నారనేదేగా మీ ప్రశ్న. ఆమె వస్తోంది సినిమా కోసం కాదు. తమ బ్రాండ్స్‌కు ప్రచారకర్తగా వ్యవహరించాల్సిందిగా 24 బహుళజాతి సంస్థలు ప్రియాంకా చోప్రాతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందాల విలువ ఏకంగా రూ. 100 కోట్లట. వీటికి సంబంధించిన షూటింగ్స్, ఫొటోషూట్స్ ఇండియాలోనే జరగనున్నాయి. అందుకే ప్రియాంక పెట్టె బేడా సర్దుకొని ఇండియా రానున్నారు. ప్రస్తుతం ‘బేవాచ్’ టీవీ సిరీస్‌కు తెర రూపంగా వస్తున్న చిత్రంలో ఆమె విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. వరుసగా అక్కడి షూటింగ్స్‌తో బిజీగా ఉన్న ప్రియాంక లాస్ ఏంజిల్స్‌లో ఇల్లు వెతుక్కొనే పనిలో పడ్డారు. అన్నట్లు ఆ మధ్య ఆమె ఇండియాకు వచ్చినప్పుడు దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ కథ వినిపించారనీ, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనీ వార్తలొచ్చాయి. మరి ఆమె ఇండియాకొచ్చినప్పుడు ఇంకెన్ని కబుర్లు బయటకొస్తాయో!