ప్రియాంకా చోప్రా దూకుడు : బిగ్ న్యూస్  | Priyanka Chopra to coStar with Sam Heughan Hollywood project | Sakshi
Sakshi News home page

ప్రియాంకా చోప్రా దూకుడు : బిగ్ న్యూస్ 

Published Wed, Oct 28 2020 1:23 PM | Last Updated on Wed, Oct 28 2020 3:25 PM

Priyanka Chopra to coStar with Sam Heughan Hollywood project - Sakshi

సాక్షి, ముంబై: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా(38) కొత్త హాలీవుడ్‌ మూవీలో నటించబోతున్నారు. 2016 జర్మన్ భాషా చిత్రం ఎస్ఎంఎస్ ఫ‌ర్ డిచ్  రీమేక్ లో నటించే అవకాశం దక్కించుకున్నారు. ఈ విషయాన్ని  స్వయంగా  ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.  టెక్ట్స్ ఫ‌ర్ యూ పేరుతో  రానున్న ఈ మూవీలో ప్రియాంకాకు హీరోయిన్‌గా నటించనున్నారు. అద్భుతమైన వ్యక్తులతో, అమోఘమైన సినిమాలో నటించడం చాలా సంతోషంగా, ఇది తనకు గొప్ప గౌరవంగా ఉందని ఆమె వెల్లడించారు. దీంతో ప్రియాంకాకు అభినందనల వెల్లువ కురుస్తోంది. ఆమె భర్త నిక్ జోనస్ కూడా  ఫైర్ ఎమోజీని పోస్ట్ చేయడం విశేషం.  

ముఖ్యంగా గ్రామీ అవార్డు విజేత సెలిన్ డియోన్,  నెట్‌ఫ్లిక్స్ సిరీస్ అవుట్‌ల్యాండర్ పాత్రలో మంచి పేరు తెచ్చుకున్న నటుడు సామ్ హ్యూఘన్‌తో కలిసి నటించనున్నట్లు ప్రియాంకా ఇన్‌స్టాలో వెల్లడించారు.  ఈ మూవీని  గ్రేస్ ఈజ్ గాన్, పీపుల్ ప్లేసెస్ థింగ్స్ , ది ఇన్ క్రెడిబుల్ జెస్సికా జేమ్స్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన జిమ్ స్ట్రౌజ్ డైర‌క్ట్ చేస్తున్నారు.

స్టోరీ విషయానికి వస్తే..తన కాబోయే  భర్తను  కోల్పోయిన విషాదాన్నుంచి తేరుకునేందుకు  తన పాత  ఫోన్ కు  శృంగార సందేశాలు పంపుతూ వుంటుంది హీరోయిన్. అయితే  యాదృచ్చికంగా ఆ నంబరు దాదాపు ఇదే వేదన అనుభవిస్తున్న మరో వ్యక్తికి కేటాయిస్తారు. అలా రొమాంటిక్ డ్రామాగా  తెర‌కెక్కించ‌నున్నఈ మూవీ సోఫీ క్రామెర్  ప్రసిద్ధ నవల ఆధారంగా రూపొందింది.  కాగా ప్రియాంక ప్రధాన పాత్రలో తెరకెక్కిన అమెరికన్ టీవీ సీరీస్ క్వాంటికో ద్వారా హాలీవుడ్ లో కూడా మంచి  మార్కులు కొట్టేసిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement