mark rowley
-
విదేశాల్లో అన్వేషణ
గ్రీస్‌లో బిజీ బిజీగా ఉంటున్నారు శ్రుతీహాసన్. ఇంగ్లిష్ ఫిల్మ్ ‘ది ఐ’ కోసమే అంత బిజీగా ఉన్నారు. మార్క్ రౌలీ, శ్రుతీహాసన్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న సైకలాజికల్ చిత్రం ‘ది ఐ’. డాఫ్నే ష్మోన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గ్రీస్‌లో జరుగుతోంది. అలాగే ఏథెన్స్లోని లొకేషన్స్‌లో కూడా ఈ సినిమా షూటింగ్‌ను జరుపుతున్నారు. 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథతో ఈ సినిమా కథనం ఉంటుంది. ఈ చిత్రంలో భర్త మరణానికి దారితీసిన కారణాల కోసం అన్వేషించే యువతి పాత్రలో శ్రుతి కనిపిస్తారని టాక్. ఇక ఈ సినిమా కాకుండా తెలుగులో చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’, ప్రభాస్ ‘సలార్’ చిత్రాల్లో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. -
Shruti Haasan: చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది!
హీరోయిన్ శ్రుతీహాసన్ కొన్ని రోజులుగా గ్రీస్‌లోనే ఉంటున్నారు. ఏదైనా వెకేషన్‌కి వెళ్లారేమో? అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆమె అక్కడికి వెళ్లింది ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం. డాఫ్నే ష్మోన్ దర్శకత్వంలో ‘ది ఐ’ అనే సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కనుంది. ఈ ఇంగ్లీష్ ఫిల్మ్‌లో మార్క్ రౌలీ, శ్రుతీహాసన్ లీడ్ యాక్టర్స్‌గా నటించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ గ్రీస్‌లో జరుగుతున్నాయి. ఈ వర్క్‌షాప్స్‌లో శ్రుతీహాసన్ పాల్గొంటున్నారు. ‘‘ఈ సినిమాలో భాగం కావడం నాకు స్పెషల్. చాలా ఎగై్జటింగ్‌గా ఉంది’’ అని ట్వీట్ చేశారు శ్రుతీహాసన్. 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాకు ఎమిలీ కార్లటన్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఐస్లాండ్లో చనిపోయిన భర్త అస్తికల కోసం అక్కడికి వెళ్తుంది ఓ యువతి. భర్త మరణం గురించి కొన్ని ఊహించని అంశాలు తెలుసుకున్న ఆ యువతి అక్కడ ఏం చేసింది? అనే నేపథ్యంలో ఈ కథనం సాగుతుందట. కాగా చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణతో ఓ సినిమాతో పాటు ప్రభాస్ ‘సలార్’లతో బిజీగా ఉన్నారు శ్రుతీహాసన్. -
‘ఒంటరిగానే ఈ పని చేశాడనుకుంటున్నాం’
లండన్: బ్రిటన్ పార్లమెంటుపై దాడి యత్నం ఘటనకు సంబంధించి ఏడుగురుని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో భాగంగా ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ విషయాన్ని లండన్‌కు చెందిన ఉగ్రవాద నిరోధక విభాగం సీనియర్ అధికారి మార్క్ రౌలే చెప్పారు. థేమ్స్ నది బ్రిడ్జిపై కారుతో విధ్వంసం సృష్టించి దాదాపు 40మందిని గాయపరిచిన దుండగుడు అనంతరం నేరుగా పార్లమెంటు రెయిలింగ్ వద్దకు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. అనంతరం పార్లమెంటులోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఓ పోలీసు అధికారిని చంపి అనంతరం బలగాల కాల్పుల్లో చనిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి తాజా వివరాలు వెల్లడించిన మార్క్ రౌలే.. లండన్, బర్మింగ్హామ్లలో విచారణలో భాగంగా గాలింపులు చేపడుతున్నారు. వేరే వాళ్ల ప్రోద్బలంతో ఈ దాడి జరిగిందా అనే యోచన చేస్తున్నామన్నారు. అయితే, అంతర్జాతీయ ఉగ్రవాదం ప్రేరేపితుడై అతడొక్కడే ఈ దాడికి దిగినట్లు విశ్వసిస్తున్నామని అన్నారు. ఈ సమయంలో ఇంతకంటే ఎక్కువగా చెప్పలేమన్నారు. ఈ దాడిలో దుండగుడితో సహా నలుగురు చనిపోయారని చెప్పారు. మృత్యువాతపడిన వారు వేరు వేరు ప్రాంతాలకు చెందినవారని వారి వివరాలు మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం 29మంది ఆయా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారిలో ఏడుగురు పరిస్థితి విషమంగా ఉందని వివరించారు.