విదేశాల్లో అన్వేషణ | Shruti Haasan And Mark Rowley Will Play The Leads In The Eye | Sakshi
Sakshi News home page

విదేశాల్లో అన్వేషణ

Published Sun, Nov 13 2022 4:18 AM | Last Updated on Sun, Nov 13 2022 4:18 AM

Shruti Haasan And Mark Rowley Will Play The Leads In The Eye - Sakshi

గ్రీస్‌లో బిజీ బిజీగా ఉంటున్నారు శ్రుతీహాసన్‌. ఇంగ్లిష్‌ ఫిల్మ్‌ ‘ది ఐ’ కోసమే అంత బిజీగా ఉన్నారు. మార్క్‌ రౌలీ, శ్రుతీహాసన్‌ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న సైకలాజికల్‌ చిత్రం ‘ది ఐ’. డాఫ్నే ష్మోన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం గ్రీస్‌లో జరుగుతోంది. అలాగే ఏథెన్స్‌లోని లొకేషన్స్‌లో కూడా ఈ సినిమా షూటింగ్‌ను జరుపుతున్నారు.

1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథతో ఈ సినిమా కథనం ఉంటుంది. ఈ చిత్రంలో భర్త మరణానికి దారితీసిన కారణాల కోసం అన్వేషించే యువతి పాత్రలో శ్రుతి కనిపిస్తారని టాక్‌. ఇక ఈ సినిమా కాకుండా తెలుగులో చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’, ప్రభాస్‌ ‘సలార్‌’ చిత్రాల్లో శ్రుతీహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement