Grease
-
గ్రీజ్ అంటిన చేతితో తాకాడని.. దళితుడి ఒంటికి మలం రాశాడు!
చత్తర్‌పూర్: అనుకోకుండా గ్రీజ్ పూసిన చేతితో తాకినందుకు ఓబీసీ కులానికి చెందిన ఓ వ్యక్తి తనకు మలం పూశాడంటూ మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ దళితుడు ఆరోపించడం కలకలం రేపుతోంది. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. దశరథ్ అహిర్వార్ అనే వ్యక్తి బికౌరా గ్రామంలో పంచాయతీ మురుగుకాల్వ నిర్మాణ పనులు చేస్తున్నాడు. సమీపంలోని చేతి పంపు వద్ద రామ్‌కృపాల్ పటేల్ స్నానం చేస్తున్నాడు. గ్రీజ్ అంటిన చేతితో తాకడంతో ఆగ్రహించిన పటేల్ చేతిలోని మగ్గుతో మలాన్ని తీసుకువచ్చి అహిర్వార్ ముఖం, తల సహా ఒంటిపై రాశాడు. కులం పేరుతో దూషించాడు. పంచాయతీ పెద్దలు అహిర్వార్కు రూ.600 జరిమానా కూడా విధించారు. బాధితుడు కేసు పెట్టడంతో పటేల్‌పై కేసు నమోదయ్యాయి. వారు సరదాగా వస్తువులు విసిరేసుకున్నారు. అది కాస్తా ఇలా వికటించినట్టు విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు. కాగా, మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో గిరిజన యువకుడిపై ఒక వ్యక్తి మూత్రవిసర్జన చేసిన ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైన విషయం తెలిసిందే. -
విదేశాల్లో అన్వేషణ
గ్రీస్‌లో బిజీ బిజీగా ఉంటున్నారు శ్రుతీహాసన్. ఇంగ్లిష్ ఫిల్మ్ ‘ది ఐ’ కోసమే అంత బిజీగా ఉన్నారు. మార్క్ రౌలీ, శ్రుతీహాసన్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న సైకలాజికల్ చిత్రం ‘ది ఐ’. డాఫ్నే ష్మోన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గ్రీస్‌లో జరుగుతోంది. అలాగే ఏథెన్స్లోని లొకేషన్స్‌లో కూడా ఈ సినిమా షూటింగ్‌ను జరుపుతున్నారు. 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథతో ఈ సినిమా కథనం ఉంటుంది. ఈ చిత్రంలో భర్త మరణానికి దారితీసిన కారణాల కోసం అన్వేషించే యువతి పాత్రలో శ్రుతి కనిపిస్తారని టాక్. ఇక ఈ సినిమా కాకుండా తెలుగులో చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’, ప్రభాస్ ‘సలార్’ చిత్రాల్లో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. -
Shruti Haasan: చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది!
హీరోయిన్ శ్రుతీహాసన్ కొన్ని రోజులుగా గ్రీస్‌లోనే ఉంటున్నారు. ఏదైనా వెకేషన్‌కి వెళ్లారేమో? అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆమె అక్కడికి వెళ్లింది ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం. డాఫ్నే ష్మోన్ దర్శకత్వంలో ‘ది ఐ’ అనే సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కనుంది. ఈ ఇంగ్లీష్ ఫిల్మ్‌లో మార్క్ రౌలీ, శ్రుతీహాసన్ లీడ్ యాక్టర్స్‌గా నటించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ గ్రీస్‌లో జరుగుతున్నాయి. ఈ వర్క్‌షాప్స్‌లో శ్రుతీహాసన్ పాల్గొంటున్నారు. ‘‘ఈ సినిమాలో భాగం కావడం నాకు స్పెషల్. చాలా ఎగై్జటింగ్‌గా ఉంది’’ అని ట్వీట్ చేశారు శ్రుతీహాసన్. 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాకు ఎమిలీ కార్లటన్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఐస్లాండ్లో చనిపోయిన భర్త అస్తికల కోసం అక్కడికి వెళ్తుంది ఓ యువతి. భర్త మరణం గురించి కొన్ని ఊహించని అంశాలు తెలుసుకున్న ఆ యువతి అక్కడ ఏం చేసింది? అనే నేపథ్యంలో ఈ కథనం సాగుతుందట. కాగా చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణతో ఓ సినిమాతో పాటు ప్రభాస్ ‘సలార్’లతో బిజీగా ఉన్నారు శ్రుతీహాసన్. -
గ్రీజు డబ్బా.. గిఫ్ట్ ప్యాక్! ‘పుష్ఫ’ స్టైల్లో హష్ ఆయిల్ రవాణా
సాక్షి, నాగోలు: గంజాయి ప్రాసెసింగ్ ద్వారా తయారు చేసే హష్ ఆయిల్ స్మగ్లింగ్‌లో ఓ ముఠా ‘పుష్ఫ’ పంథాను అనుసరించింది. గ్రీజు డబ్బాతో పాటు గిఫ్ట్ ప్యాక్ రూపంలోనూ నాలుగు లీటర్లు తీసుకువస్తుండగా సమాచారం అందుకున్న ఎల్బీనగర్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్వోటీ) పోలీసులు ఇద్దరిని పట్టుకున్నారు. గురువారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్, డీసీపీలు సన్‌ప్రీత్‌సింగ్, మురళీధర్, ఏసీపీలు వెంకన్న నాయక్, పురుషోత్తం రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ లీటర్ హష్ ఆయిల్ రూ.4 లక్షలు.. ఏపీలోని విశాఖపట్నం జిల్లా జంపెన గ్రామానికి చెందిన కోనశివ (24) డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన వంట పని కార్మికుడు నూకరాజుతో (25) ఇతడికి స్నేహం ఉంది. శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతానికి చెందిన సంతోష్‌కుమార్‌తో శివకు మూడేళ్లుగా పరిచయం ఉంది. ఇటీవల శివను కలిసిన సంతోష్ తాను ఇచ్చే హష్ ఆయిల్‌ను హైదరాబాద్‌కు చేరిస్తే రూ.40 వేలు ఇస్తానంటూ చెప్పడంతో అంగీకరించిన శివ తనకు సహకరిస్తే ఆ మొత్తంలో సగం ఇచ్చేలా నూక రాజుతో ఒప్పందం కుదుర్చుకుని వీరిద్దరూ బుధవారం విశాఖలోని లంకెలపాలెం వెళ్లి సంతోష్‌ను కలిశారు. అక్కడ సంతోష్‌తో పాటు అతడి స్నేహితుడైన సంజీవ్‌రావు కూడా ఉన్నాడు. లీటర్ హష్ ఆయిల్‌ను గిఫ్ట్‌కవర్‌లో ప్యాక్ చేసి సంతోష్ వీరికి అప్పగించాడు. గ్రీజు డబ్బా అడుగున మూడు లీటర్ల హష్ ఆయిల్‌ను ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి ఉంచి, దానిపై గ్రీజు నింపిన డబ్బాను సంజీవరావు అప్పగించాడు. వీటిని తీసుకుని శివ, నూక రాజు పోలీసులకు అనుమానం రాకుండా వేర్వేరుగా బయలుదేరారు. గతంలో గంజాయి, హష్ ఆయిల్ పంపే ఏజెన్సీ ముఠాలు హైదరాబాద్‌లో ఎవరికి అందించాలే సరఫరా దారులకు చెప్పేవాళ్లు. ఇలా చేస్తే పోలీసులకు వాళ్లూ చిక్కుతున్నారనే ఉద్దేశంతో ఇటీవల పంథా మార్చారు. తొలుత హైదరాబాద్ చేరుకున్నాక తమకు ఫోన్ చేయాలని, అప్పుడు ఎవరికి అందించాలనేది చెప్తామంటూ శివ, నూకరాజుకు చెప్పారు. వీరి కదలికలపై ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందటంతో ఇన్స్పెక్టర్ సుధాకర్ నేతృత్వంలోని బృందం హయత్‌నగర్ పోలీసులతో కలిసి దాడి చేసి ఇద్దరినీ పట్టుకుని హష్ ఆయిల్ స్వాధీనం చేసుకుని సరఫరా దారుల కోసం గాలిస్తున్నారు. హష్ ఆయిల్‌ను నగరంలో లీటర్ రూ.4 లక్షలు లేదా 10 ఎంఎల్ రూ.4 వేలు చొప్పున అమ్ముతున్నట్లు గుర్తించారు. చదవండి: ట్యాక్సీ డ్రైవర్‌తో మహిళా టెక్కీ ప్రేమ పెళ్లి.. తప్పటడుగులు వేశానంటూ.. -
చంద్రుడిని చూశారుగా? ఎంత పెద్దగా కనిపిస్తున్నాడో.. ఎక్కడో తెలుసా!
చంద్రుడిని చూశారుగా? ఎంత పెద్దగా కనిపిస్తున్నాడో కదా! ఇంత పెద్దగా ఎలా కనిపిస్తున్నాడని సందేహం వచ్చే ఉంటుంది కదా. చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చే రోజు, పౌర్ణమి రెండూ ఒకేరోజు వస్తే ఇలా పెద్ద ఆకారంలో చంద్రుడు కనిపిస్తాడు. దీన్నే ‘సూపర్ మూన్’అంటారు. ఈ సమయంలో చంద్రుడు మామూలు కన్నా 14 శాతం పెద్దగా, 30 శాతం ప్రకాశవంతంగా ఎరుపు, కాషాయం రంగుల్లో మెరుస్తుంటాడు. ఇంతకీ ఫొటో ఎక్కడ తీశారో చెప్పలేదు కదా. ఇటీవల గ్రీస్‌లోని కేప్ ఆఫ్ సౌనియన్ ప్రాంతంలో తీశారు. ఇక్కడ కనిపిస్తున్న కట్టడంపేరు టెంపుల్ ఆఫ్ పొసెయ్డన్. చదవండి: ప్రాణాలకు తెగించి మరీ సింహంతో పోరాడిన కుక్క: వైరల్ -
కలల తీరం
వీలైనప్పుడల్లా ప్రేమ యాత్రలకు పయనమవుతారు లవ్‌బర్డ్స్ నయనతార, విఘ్నేష్ శివన్. ఈ ప్రేమజంట తాజాగా గ్రీస్‌లోని శాండోరిని దీవుల్లో ఫుల్‌గా హాలిడే టైమ్‌ని స్పెండ్ చేస్తున్నారు. ఈ వెకేషన్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు విఘ్నేష్. ‘‘ఎప్పటినుంచో ఇక్కడికి వెళ్దాం అనుకున్నాం. ఇప్పటికి కుదిరింది. డ్రీమ్ డెస్టినేషన్’’ అని పేర్కొన్నారు విఘ్నేష్. ఇక సినిమాల విషయానికి వస్తే... రజనీకాంత్ ‘దర్బార్’, విజయ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. అలాగే తెలుగులో చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘సైరా: నరసింహారెడ్డి’ సినిమాలో హీరోయిన్గా నటించారు నయన్. ఇక ఎప్పటిలాగానే తన ఉమెన్‌సెంట్రిక్ ఫిల్మ్స్‌లో నటించడం ఆపలేదు ఈ లేడీ సూపర్‌స్టార్. శివకార్తికేయన్ హీరోగా ఓ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు విఘ్నేష్ శివన్. -
ఎండాకాలం... కురులు కులాసాగా...
ఈ కాలం శిరోజాలూ చమట, జిడ్డు కారణాలతో త్వరగా మురికి అవుతాయి. పొడిబారి చిట్లుతుంటాయి. ఈ సమస్యకు విరుగుడుగా ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకొని, కురుల నిగనిగలను కాపాడుకోవచ్చు. ∙రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె, అర టీæ స్పూన్ బియ్యం, టీ స్పూన్ మిరియాలు. ఈ మూడింటిని కలిపి బియ్యం ముదురు గోధుమరంగులోకి వచ్చేవరకు మరిగించి, దించి, చల్లారనివ్వాలి. వారానికి రెండు సార్లు ఈ నూనెను వేడి చేసి, తలకు మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు మృదువుగా అవడమే కాకుండా, రాలడం సమస్య తగ్గుతుంది. ∙వారానికి రెండుసార్లు గోరువెచ్చని కొబ్బరి నూనెతో తలకు మసాజ్ చేసుకోవడం, నెలకు ఒకసారి హెన్నా ప్యాక్ వాడితే కురుల అందం పాడవదు. ∙వేడిమి వల్ల రోజూ తలస్నానం చేస్తుంటారు. దీంతో మాడు పై చర్మం పొడిబారి వెంట్రుకలు చిట్లడం, రాలడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి రాత్రి సమయాల్లో ఉసిరి, తులసి, వేప ఆకులను మరిగించిన కొబ్బరినూనెతో తలకు మసాజ్ చేసుకోవాలి. ఇలా చేస్తే కుదుళ్లు బలంగా ఉంటాయి. -
బ్యూటిప్స్
నాచురల్ ఫేస్ మాస్క్ పది మిల్లీలీటర్ల తేనెలో ఒక కోడిగుడ్డు సొన, ఐదు గ్రాముల పాలపొడి కాని ఒక టేబుల్ స్పూన్ తాజా పాలు కాని తీసుకోవాలి. వీటన్నింటినీ ఒక పాత్రలో వేసి బాగా చిలికి ఆ మిశ్రమాన్ని ఫేషియల్ బ్రష్‌తో కళ్ల చుట్టూ, పెదవులను మినహాయించి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. కోడిగుడ్డుసొన చర్మానికి పోషణనిస్తుంది. తేనె చక్కని నిగారింపునిస్తుంది. ఈ ప్యాక్ వేయడం వల్ల చర్మం బాల్యపు సుకుమారాన్ని సంతరించుకుంటుంది. ఇది నాచురల్ స్కిన్‌కూ పొడిచర్మానికీ కూడా చక్కగా పని చేస్తుంది.ఆయిలీ స్కిన్ అయితే పది మిల్లీలీటర్ల తేనెలో ఒక కోడిగుడ్డులోని తెల్లసొన, ఐదు మిల్లీలీటర్ల నిమ్మరసం, ఐదు గ్రాముల ఈస్ట్ పౌడర్ లేదా పుల్లటి పెరుగు కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. నిమ్మరసం చర్మగ్రంథుల నుంచి విడుదలైన అదనపు జిడ్డును తొలగిస్తుంది. తెల్లసొన డీప్ క్లెన్సర్‌గా పని చేసి చర్మాన్ని బాగా శుభ్రపరుస్తుంది. వీటికి తేనె తెచ్చే నిగారింపు కలిసి ముఖం తాజాగా, కాంతివంతంగా మారుతుంది. మెరిసే కేశాలకోసం.. తలస్నానం పూర్తయ్యాక చివరగా ఒక లీటరునీటిలో ఒక నిమ్మకాయను పిండి, రెండు టీ స్పూన్ల తేనె కలిపి జుట్టంతా తడిసేలా పోసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తల మీద పోసి కనీసం రెండు నిమిషాల సేపు అలాగే ఉంచిన తర్వాత చన్నీటిని పోసి శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల కేశాలు నిగనిగలాడతాయి.అరకప్పు తేనె తీసుకుని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు సమంగా పట్టించి జుట్టును ముడి చుట్టేసి క్యాప్ పెట్టేయాలి. అరగంట సేపు అలాగే ఉంచి తర్వాత షాంపూతో లేదా షీకాయలతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల కేశాలు మెరుస్తూ, గాలికి అలల్లా ఎగిరిపడతాయి. జుట్టు పొడవుగా, ఒత్తుగా ఉంటే అవసరాన్ని బట్టి తేనె మోతాదును పెంచుకోవచ్చు.తేనె, ఆలివ్ ఆయిల్ కాంబినేషన్ కేశాలను ఆరోగ్యంగా ఉంచి మెరుపులీనేటట్లు చేస్తుంది. పావు కప్పు తేనెలో అంతే మోతాదు ఆలివ్ ఆయిల్ కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇది డీప్ కండిషనర్‌గా పనిచేసి పోషణ లేక నిర్జీవంగా, పాలిపోయినట్లున్న జుట్టును అందంగా, ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా మారుస్తుంది. -
ఫ్రూటీ బ్యూటీ
ఆయిలీ స్కిన్... ►నిమ్మరసం సహజమైన క్లెన్సర్. చర్మాన్ని శుభ్రం చేస్తుంది. చర్మంలో అదనపు జిడ్డను తొలగిస్తుంది. ద్రాక్షరసం మృదుత్వాన్నిస్తుంది, కోడిగుడ్డు తెల్లసొన చర్మాన్ని వదులు కానివ్వదు. పదిద్రాక్షపండ్లు, ఒక నిమ్మకాయ, ఒక కోడిగుడ్డులోని తెల్లసొనను బాగా కలిపి ముఖానికి, మెడకు పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. ఇది ఆయిలీ స్కిన్‌కు చక్కటి ఫేస్ ప్యాక్. ►రకరకాల పండ్లను, సౌందర్యసాధనాలను కలిపి ప్యాక్ తయారు చేసుకునే సమయం లేనప్పుడు నిమ్మకాయను సగానికి కోసి ఒక చెక్కతో ముఖాన్నంతటినీ రుద్ది పదిహేను నిమిషాల సేపు అలాగే ఉంచి తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. డ్రైస్కిన్ అయితే... ►టీ స్పూన్ తేనె, టీ స్పూన్ నిమ్మరసం, టీ స్పూన్ వెజిటబుల్ ఆయిల్ కలిపి ముఖానికి, మెడకు రాసి పది నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. కొబ్బరి, వేరుశనగ, నువ్వులు, సన్‌ఫ్లవర్... ఆయిల్ వాడవచ్చు. ►ఒక టీ స్పూన్ తేనెలో టీ స్పూన్ పాలు కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాల సేపటికి కడగాలి. రెండు రోజులకొకసారి ఇలా చేస్తుంటే చర్మం కాంతివంతంగా ఉంటుంది. నార్మల్ స్కిన్‌కి... ►ఒక కప్పు గుమ్మడికాయ గుజ్జు ఒక కçప్పులో కోడిగుడ్డు వేసి(పచ్చసొనతో సహా) బ్లెండ్ చేసి సగం మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఐదు నిమిషాల సేపు మర్దన చేయాలి. మసాజ్ తర్వాత మిగిలిన సగం మిశ్రమాన్ని ప్యాక్ వేసి అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో కడగాలి. ఇది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. ఫలితం వెంటనే çకనిపిస్తుంది. దీనిని నార్మల్ స్కిన్‌తోపాటు అన్నిరకాల చర్మానికీ వేయవచ్చు. ►ముఖం మీద నల్లటి మచ్చలుంటే ప్రతిరోజూ క్యారట్ రసం రాస్తుండాలి. వారం రోజులకే మంచి ఫలితం ఉంటుంది. మచ్చలు మాసిపోవడంతోపాటు చర్మం కాంతిమంతమవుతుంది. -
ముల్తానీ మిట్టీ ప్యాక్
ఒక టీ స్పూను పెరుగు, ఒక టీ స్పూను వుుల్తానీ మిట్టీ, ఒక టీ స్పూను పుదీనా పొడి తీసుకుని అన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రవూన్ని వుుఖానికి ప్యాక్ వేసుకుని 15 నిమిషాలపాటు ఉంచాలి. తర్వాత వుుఖాన్ని గోరు వెచ్చని నీటితో కడిగి, వెంటనే చన్నీటితో కడగాలి. ఇది జిడ్డు చర్మం వారికి వుంచి ప్యాక్. పొడి చర్మానికి ఈ ప్యాక్ సరిపడదు ∙వుుల్తానీ మిట్టీ ప్యాక్ రక్త ప్రసరణను మెరుగుపరిచి చర్మాన్ని మెరిపిస్తుంది. చర్మంపై ఉన్న వుృతకణాలను తొలగిస్తుంది ∙పొడి చర్మం గలవాళ్ళు దీనిని ఉపయోగించాలనుకుంటే నీటికి బదులుగా, రోజ్ వాటర్‌ని ఉపయోగించాలి. వుుఖానికి ప్యాక్ వేసుకుని 2–3 నిమిషాలకంటే ఎక్కువసేపు ఉంచుకోకూడదు. ప్యాక్‌ను గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి ∙మెుటివుల వల్ల ఏర్పడ్డ వుచ్చలు మివ్ముల్ని బాధపెడుతున్నాయా? అయితే ఈ ప్యాక్ మీకోసమే... వుూడు వేప ఆకులను మెత్తగా నూరి, దానిలో ఒక టీ స్పూను వుుల్తానీ మిట్టీని కలుపుకోవాలి. వుుఖాన్ని శుభ్రం చేసుకుని ఈ మిశ్రవూన్ని ప్యాక్ వేసుకుని 15 నిమిషాల తర్వాత నీటితో కడిగేయాలి. -
బ్యూటిప్స్
ఉసిరికాయ రసం సహజసిద్ధమైన ఆస్ట్రింజెంట్. ఈ రసంలో దూది అద్ది ముఖాన్ని తుడిస్తే కాలుష్యం, జిడ్డు వదిలి చక్కగా శుభ్రపడుతుంది. ఉసిరిని ఎండబెట్టి పొడి చేసుకుని తలకు పట్టించవచ్చు. ఇనుప పాత్రలో ఉసిరికాయ పొడి, తగినంత నీరు పోసి ఒక గంట నాననివ్వాలి. దీంతో తలరుద్దుకుంటే షాంపూగానూ, కండిషనర్‌గానూ, తెల్లజుట్టును బ్రౌన్‌గా మార్చే హెయిర్ డై గానూ మూడు ప్రయోజనాలు చేకూరుతాయి. జుట్టురాలడం, తెల్లబడడం, పొడిబారడం, చిట్లిపోవడం వంటి సమస్యలకు, చుండ్రునివారణకు హెన్నాలో ఆమ్లపౌడర్ కలిపి తలకు పట్టించాలి. ఆమ్లపౌడర్ కోసం సౌందర్యసాధనాల మార్కెట్లో దొరుకుతుంది. అది సాధ్యం కానప్పుడు ఉసిరి కాయలను గింజలు తీసి మెత్తగా గ్రైండ్ చేసి హెన్నాలో కలుపుకోవచ్చు. -
ఇంటిప్
దుస్తులకంటిన నూనెజిడ్డు, గ్రీజ్ వంటివి వదలాలంటే... మరక మీద టాల్కం పౌడర్ చల్లి రుద్దాలి. జిడ్డును పౌడర్ పీల్చుకుంటుంది. తర్వాత పౌడర్ రాలిపోయేటట్లు దులపాలి. -
బ్యూటిప్స్
► సోంపు ఆకులను నీటిలో మరిగించి ఆ నీటితో తలస్నానం చేస్తే కేశాలు బాగా పెరుగుతాయి, మృదుత్వాన్ని సంతరించుకుంటాయి. రెండు లీటర్ల నీటిలో రెండు గుప్పెళ్ల సోంఫు ఆకులను వేసి మరిగించి దించాక కొంచెం సేపు కదిలించకుండా అలాగే ఉంచాలి. నీరు ఆకులలోని సుగుణాలను ఇముడ్చుకుంటుంది. ఈ నీటిలో ఒక టేబుల్ స్పూన్ వెనిగర్‌ను కలిపి తలస్నానం పూర్తయ్యాక జుట్టుకంతటికీ పట్టేటట్లు పోయాలి. ►చర్మం మీద నల్లటి మచ్చలుంటే బీర ఆకులను మెత్తగా పేస్టు చేసి అప్లయ్ చేయాలి. రోజుకు నాలుగైదు సార్లు చేస్తుంటే వారం రోజుల్లో మచ్చలు మాయమవుతాయి. ► చెమట వాసన శరీరం నుంచి దుర్గంధం వస్తుంటే బిల్వ ఆకులను మెత్తగా నూరి ఒంటికి పట్టించి అరగంట తర్వాత స్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే దుర్వాసన సమస్య తగ్గుతుంది. ► లెట్యూస్ ఆకులను(క్యాబేజీ లాగా ఉంటుంది, ఆకులు మరింత పలుచగా ఉంటాయి) గ్రైండ్ చేసి అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి పదిహేను నిమిషాల తర్వాత నీటితో కడగాలి. ఇది అదనపు జిడ్డును తొలగించి చర్మాన్ని తాజాగా ఉంచడంలో చక్కగా పని చేస్తుంది. -
సహజమైన మార్పు
బ్యూటిప్స్ వర్షాకాలం చర్మం త్వరగా పొడిబారినట్టు, కాసేపటిగా జిడ్డుగా మారినట్టుగా అనిపించడం సహజం ఇలాంటప్పుడు చర్మసంరక్షణకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. మాయిశ్చరైజర్: పొడిబారిన చర్మానికి సహజసిద్ధమైన మాయిశ్చరైజర్ లభించాలంటే అరటిపండు, తేనె, అవకాడో, కొబ్బరి పాలు, పెరుగు, ఓట్మిల్, ఆలివ్ ఆయిల్లు బాగా ఉపయోగపడతాయి. వీటిలో ఏదైనా ఒకదానితో చర్మానికి ప్యాక్ వేసుకొని, మృదువుగా మర్దనా చేసి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. జిడ్డు తగ్గడానికి బ్లీచ్: జిడ్డు చర్మం గలవారికి ఈ కాలం దుమ్ము, ధూళి కణాలు చేరి చిరాకుగా ఉంటుంది. ఈ సమస్యకు విరుగుడుగా నారింజ, నిమ్మ, పైనాపిల్, దోస, రసాలలో ఏదైనా ఒకదానిని ఎంచుకొని, రాసి, పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి. నిగారింపుకి: జిడ్డు చర్మానికి గుడ్డులోని తెల్లసొన, పొడి చర్మానికి గుడ్డులోని పసుపు సొనలతో ప్యాక్ వేసుకొని ఆరాక కడిగేయాలి. అలాగే బాదంలను నానబెట్టి పొడి చేసి ప్యాక్ వేసుకోవాలి. రోజూ 10 గ్లాసుల నీళ్లు, తాజా ఆకుకూరలు కూరగాయలతో చేసే సమతుల ఆహారం చర్మ నిగారింపును పెంచుతుంది. -
ఇక ఆయిలీతో నో ప్రాబ్లమ్..
బ్యూటిప్స్ జిడ్డు చర్మం వారు ఏ కాలాన్నీ ఎక్కువగా ఇష్టపడరు. ఎందుకంటే ముఖం కడుక్కున్న రెండు నిమిషాలకే చర్మం ఆయిలీగా మారుతుంది. ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తగ్గట్టుగా అలాంటి వారు కొన్ని సూచనలు, చిట్కాలు పాటించక తప్పదు.. నిమ్మకాయ మంచి బ్లీచింగ్ ఏజెంట్. కాబట్టి రోజూ నిమ్మరసంతో కానీ నేరుగా నిమ్మకాయ ముక్కలతో ముఖాన్ని మర్దనా చేయాలి. 15 నిమిషాల తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేసి ముఖాన్ని క్లీన్ చేసుకుంటే జిడ్డుతనం తగ్గుతుంది. ఇంట్లోనే ఫేస్ స్ప్రే తయారు చేసుకొని వాడటం మేలు. ఒక కప్పు నీళ్లలో రెండు టీ స్పూన్ల రోజ్ వాటర్ కలిపి ఏదైన చిన్న బాటిల్లో నింపుకోవాలి. ఇంట్లో ఉన్నా లేక ఆఫీసులో రెండు నిమిషాలకోసారి ముఖంపై చల్లుకోవాలి. ఇలా శుభ్రం చేసుకుంటూ ఉంటే చర్మం ఎప్పుడూ తాజాగా ఉంటుంది. ఎండలో నడిచేటప్పుడు కచ్చితంగా గొడుగును వాడటం మర్చిపోకండి. అది వాన నుంచే కాదు మనల్ని ఎండ నుంచీ కాపాడుతుంది. కాబట్టి బయటికి వెళ్లే ముందు బ్యాగ్‌లో గొడుగును తీసుకెళ్లండి.సన్‌స్క్రీన్ లోషన్ లేదా మాయిశ్చరైజర్‌ను ప్రతి రోజూ చర్మానికి రాసుకోవాలి. అది చెమట కారణంగా అయ్యే డీహైడ్రేషన్‌ను నియంత్రిస్తుంది. -
పూవులాంటి మోముకు...
బ్యూటిప్స్ ముఖారవిందానికి ఎన్నోరకాల ఫేస్‌ప్యాక్స్ వేసుకుంటుంటారు. పండ్లనీ, కాయలనీ ఇంకా ఏవేవో క్రీములతో ప్యాక్స్ వేసుకోవడం విన్నాం. కానీ ఈ కింది ప్యాక్స్ వాడి చూడండి. జిడ్డుతనం, మొటిమలు, మచ్చలు లాంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం పొందుతారు. జిడ్డు చర్మం కారణంగానే మొటిమల సమస్య ఎక్కువగా ఉంటుంది. దానికి చక్కటి పరిష్కారం బంతిపూల ప్యాక్. రెండు పెద్ద బంతిపూలను పూర్తిగా తుంచేసి మిక్సీలో వేసి కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. అందులో ఒక టీస్పూన్ ఉసిరి పొడి, ఒక టీస్పూన్ పెరుగు, రెండు టీ స్పూన్ల నిమ్మరసం వేసి బాగా కలపాలి. తర్వాత ఆ మిశ్రమంతో రోజూ ఉదయం ఫేస్‌ప్యాక్ వేసుకొని ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా రెండు వారాలు చేస్తే జిడ్డుతనం తగ్గి ముఖంలో నిగారింపు వస్తుంది. చలికాలంలో ముఖంపై పగుళ్లు, గీతలు కనిపిస్తుంటాయి. ఎన్ని మాయిశ్చరైజర్లు రాసుకున్నా అది కొద్దిసేపటికే ఇంకిపోతుంటుంది. రోజంతా ముఖం మృదువుగా ఉండాలంటే చేమంతి ప్యాక్ వేసుకుంటే సరి. అందుకు రెండు చేమంతి పూలను నీళ్లలో ఉడకబెట్టాలి. ఆ నీటిలో కాస్త తేనె, పాలు పోసి కలుపుకోవాలి. రోజూ ఉదయం బయటికి వెళ్లేటప్పుడు ఈ మిశ్రమంతో ముఖంపై బాగా మర్దన చేసుకొని రెండు నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తే రోజంతా ముఖం తాజాగా, అందంగా ఉంటుంది. {yై స్కిన్ వారికి మల్లెలు ఎంతో మేలు చేస్తాయి. వారు 5-6 మల్లెపూలను పేస్ట్‌లా చేసుకొని, అందులో కొద్దిగా పెరుగు వేసి కలుపుకోవాలి. దాంతో రోజూ ఉదయం లేచిన వెంటనే ముఖానికి ప్యాక్ వేసుకుంటే మంచి రంగుతేలడంతో పాటు పొడితనం కూడా తగ్గుతుంది. సమయం అంతగా కేటాయించలేని వారు మల్లెపూలను ఉడకబెట్టి, ఆ నీళ్లలో ఏదైనా ఫెయిర్‌నెస్ క్రీం కలిపి ముఖంపై ఓ నిమిషం మర్దన చేసుకొని వెంటనే గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే చాలు కోమలమైన చర్మం మీ సొంతం. తామరపూలలో లినోనిక్ యాసిడ్‌తో పాటు అనేక రకాల మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అవి ముఖాన్ని తెల్లగా చేయటమే కాకుండా నల్లమచ్చలను పోగొడ్తాయి కూడా! అందుకు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. ఒక పెద్ద తామరపువ్వును బాగా కడిగి రేకులను వేరుచేసి నీళ్లలో ఉడకబెట్టాలి. ఆ నీరు చల్లారాక అందులో కొద్దిగా రోజ్ వాటర్ కలపాలి. తర్వాత వాటిని ఓ సీసాలో తీసుకొని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే సరి. రోజూ ముఖం కడుక్కోవడానికి ఆ నీటిని ఉపయోగించుకుంటే సరి!