సహజమైన మార్పు
బ్యూటిప్స్
వర్షాకాలం చర్మం త్వరగా పొడిబారినట్టు, కాసేపటిగా జిడ్డుగా మారినట్టుగా అనిపించడం సహజం ఇలాంటప్పుడు చర్మసంరక్షణకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
మాయిశ్చరైజర్: పొడిబారిన చర్మానికి సహజసిద్ధమైన మాయిశ్చరైజర్ లభించాలంటే అరటిపండు, తేనె, అవకాడో, కొబ్బరి పాలు, పెరుగు, ఓట్‌మిల్, ఆలివ్ ఆయిల్‌లు బాగా ఉపయోగపడతాయి. వీటిలో ఏదైనా ఒకదానితో చర్మానికి ప్యాక్ వేసుకొని, మృదువుగా మర్దనా చేసి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి.
జిడ్డు తగ్గడానికి బ్లీచ్: జిడ్డు చర్మం గలవారికి ఈ కాలం దుమ్ము, ధూళి కణాలు చేరి చిరాకుగా ఉంటుంది. ఈ సమస్యకు విరుగుడుగా నారింజ, నిమ్మ, పైనాపిల్, దోస, రసాలలో ఏదైనా ఒకదానిని ఎంచుకొని, రాసి, పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి.
నిగారింపుకి: జిడ్డు చర్మానికి గుడ్డులోని తెల్లసొన, పొడి చర్మానికి గుడ్డులోని పసుపు సొనలతో ప్యాక్ వేసుకొని ఆరాక కడిగేయాలి. అలాగే బాదంలను నానబెట్టి పొడి చేసి ప్యాక్ వేసుకోవాలి. రోజూ 10 గ్లాసుల నీళ్లు, తాజా ఆకుకూరలు కూరగాయలతో చేసే సమతుల ఆహారం చర్మ నిగారింపును పెంచుతుంది.