caring
-
అమెరికా : రిటైర్మెంట్ హోమ్స్.. మంచికా.? చెడుకా?
పిల్లలు బయటి దేశాలకు వెళ్లి ఉద్యోగం / వ్యాపారం వంటి రంగాల్లో స్థిరపడితే ఎక్కడున్నా ముందుగా సంతోషించేవారు వారి తల్లిదండ్రులే. వీరు ఇక్కడ స్వదేశంలో ఎన్ని అవస్థలైనా పడుతూ బయటున్న పిల్లల ఫోన్ పలకరింపులకే మహదానందపడే మనస్తత్వం కలవారు. అక్కడ కూతురో, కోడలో గర్భవతి, ఆమె ప్రసవ తేది దగ్గర పడుతుందని తెలిస్తే చాలు, వాళ్ళ కన్నా ముందు ఇండియాలో నున్న వారి తల్లులకు నొప్పులు వస్తున్న రోజులువి. వద్దమ్మా ఎందుకు శ్రమపడతారు , మేము ఏదోలా మేనేజ్ చేసుకుంటామని అక్కడున్న పిల్లలు అన్నా కూడా ఈ ఇండియా తల్లులు ఊరుకోరాయే. ప్రసవం లేదా చంటిపిల్లల పెంపకం వంటి ఏవో అవసరాలకు ఇక్కడి నుంచి పేరెంట్స్ అటు, మోకాలు నొప్పులు కూడా మరిచిపోయి పరుగులు తీయడం, విమానం రెక్కలైనా పట్టుకొని తమ పిల్లల దగ్గర వాలిపోవడం ఇప్పుడు మామూలు విషయం అయిపోయింది. అమెరికా ఫాల్సమ్ ( కాలిఫోర్నియా ) లో మార్నింగ్ వాక్‌లో నేను చూసిన ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ప్రవేశద్వారం దగ్గర పై సూక్తి నా కంటబడింది. ‘Respect the old when you are young , help the weak when you are strong , confess the fault when you are wrong because one day in life you will be old , weak and wrong ! ‘ డిమోన్షియా వ్యాధిగ్రస్తులు..ఆ హోమ్ లోని ఇన్‌మేట్స్ ఎవరూ , ఎప్పుడూ బయటకు రారేమిటని ఆరా తీస్తే తెలిసిన విషయం వాళ్లంతా అల్జీమర్స్ వ్యాధి బాధితులని. ఇలాంటివారు తీవ్రమైన మతిమరుపువల్ల బయటకు వెళితే తాము ఉంటున్న చిరునామానే కాదు ఒకోసారి స్వంత పేరు కూడా చెప్పలేరట. తెలిసినవారిని కూడా అయోమయంగా చూడడం, మాటల్లో పదాలు దొరకక తడబడడం, వర్తమానాన్ని మరిచి గతంలోకి వెళ్లిపోవడం, ఇంకా ఏదో ఆఫీసులో పనిచేస్తున్నట్లు తయారై బ్యాగ్ పట్టుకొని బయలుదేరడం వంటి పనులు చేయడం ఈ డిమెన్షియా రకం వ్యాధిగ్రస్తుల లక్షణాలుగా చెప్పారు. వీరికి ఆలోచన ఉండదు, కొత్తగా ఏదీ నేర్చుకోలేరు, దేన్నీ గుర్తుపెట్టుకోలేరని , వీళ్ళను జాగ్రత్తగా చూడాలని అక్కడున్నవారు చెప్పగా విన్న విషయం.స్థాయిని అనుసరించి ఏదో ఒక హోమ్అయితే వీళ్లకు, వీళ్ళేకాదు అంగవికలాంగులు, 65 సంవత్సరాలు అంతకు పైబడిన ఆ దేశ సీనియర్ సిటిజన్స్‌కు, లీగల్ ఇమ్మిగ్రాంట్స్‌కు కూడా వాళ్ళవాళ్ళ ఆదాయాన్ని బట్టి యూఎస్ సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ ఎస్ఎస్ఏ) నుంచి ప్రభుత్వపరంగా ఆర్థిక సహాయం అందుతుందని చెప్పారు. 65 అంతకు మించిన వయస్సు వారు అమెరికాలో 58 మిలియన్లు ( 2022 ) అనగా ఆ దేశ జనాభాలో దాదాపు 17 శాతం ఉంటారట. వీరిలో చాలామంది ముందుగానే పొదుపు చేసిన సొమ్ముతో తమ స్థాయిని బట్టి ఏదో ఒక రిటైర్మెంట్ హోంలో చేరక తప్పని పరిస్థితులు అక్కడున్నాయి. ఇలాంటి హోమ్స్‌లో భోజన, వసతి సౌకర్యాలే కాకుండా పెద్దవాళ్లకు కావలసిన సహాయ సిబ్బంది 24 గంటలు అందుబాటులో వుండడం, అత్యవసర సమయాల్లో శిక్షణ పొందిన మెడికల్ స్టాఫ్ వారిని దగ్గరున్న ఆస్పత్రులకు చేర్చడం జరుగుతుంది. డబ్బు ఉంటే ఎవరికి బరువు కాకుండా..అక్కడ వాకింగ్ స్పేస్, ఎక్సర్ సైజ్, మసాజ్ రూమ్స్, స్విమ్మింగ్ పూల్స్, కాలక్షేపానికి టీవీలు, పత్రికలు, పుస్తకాల వంటివి ఉండడమే కాకుండా మాటాముచ్చటకు తమలాంటి వాళ్ళ కొరత లేకపోవడం వల్ల చాలామంది వృద్దులు అమెరికాలో ఈ రిటైర్మెంట్ హో మ్స్నే ఇష్టపడుతున్నారట, అంత ప్రేముంటే పిల్లలు అప్పుడప్పుడైనా అథితుల్లా వాళ్ళే వచ్చి పలకరించకపోతారా అన్న ధీమాతో. ఇప్పుడు బయటిగాలి తగిలి మన దేశంలో కూడా స్టార్ హోటల్ వసతులతో పోటీపడే పెద్దవాళ్ళ విశ్రాంత గృహాల సంస్కృతి పెరిగిపోతుంది వాస్తవం. అయితే చేతిలో డబ్బుండాలి , ఎవరికీ బరువు కాకుండా ఉండడానికి ఎన్నో మార్గాలు ఈ రోజుల్లో, కష్టాలన్నీ వృద్ధాప్యంతో పాటు ఆర్థిక ఇబ్బందులున్న పేదవర్గాలవారివే కావడం. అందుకే వయసులో ఉన్నప్పుడు పెద్దల బాగోగులు చూడడం, ధనికులు పేదలను ఆదుకోవడం, తప్పు జరిగితే ఒప్పుకోవడం అవసరం. ఎందుకంటే భవిష్యత్తులో ఎవరికైనా ఎప్పుడో ఒకప్పుడు తప్పనివే ఇవన్నీ అని జ్ఞాపకం చేస్తున్న పై సూక్తి అందరికీ సదా స్మరామి ! వేముల ప్రభాకర్(చదవండి: ఏడుగురు భారత సంతతి విద్యార్థులకు ప్రతిష్టాత్మక స్కాలర్షిప్లు!) -
ప్రత్యేక ప్రతిభావంతులైన పిల్లలకు అండగా ప్రభుత్వం
-
బాలల సంరక్షణకు భారత్ చర్యలు భేష్
ఐక్యరాజ్య సమితి: అంతర్జాతీయంగా భారత్‌కు మరో శుభపరిణామమిది. చిన్న పిల్లలు సాయుధ పోరాటాల వైపు వెళ్లకుండా కట్టడి చేసినందుకు గాను ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ (యూఎన్ఎస్జీ) వార్షిక నివేదిక నుంచి భారత్ పేరును తొలగించినట్టుగా యూఎన్ సెకట్రరీ జనరల్ ఆంటోనియా గుటెరెస్ తెలిపారు. సాయుధ ఘర్షణల ప్రభావం పడకుండా చిన్నారుల మెరుగైన సంరక్షణ కోసం భారత్ తీసుకున్న చర్యల్ని గుటెరెస్ స్వాగతించారు. 2010 నుంచి భారత్ పేరు ఈ నివేదికలో ఉంటూ వస్తోంది. కశ్మీర్లో ఉగ్రసంస్థలు బాలలను నియమించడం, భద్రత పేరుతో సైనికులు తిరిగి అదుపులోకి తీసుకోవడం వంటివాటితో భారత్ పేరు ఆ నివేదికలో ఉంటూ వస్తోంది. భారత్‌తో పాటు బుర్కినా ఫాసో, కేమరూన్, నైజీరియా, పాకిస్తాన్, ఫిలిఫ్పీన్స్లోనూ చిన్నారులు ఉగ్రముఠాల్లో చేరుతున్నట్టు యూఎన్ నివేదికలు చెబుతున్నాయి. బాలల హక్కుల పరిరక్షణకు కశ్మీర్లో ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయడంపై గుటెరెస్ హర్షం వ్యక్తం చేశారు. బాలల సంక్షేమం కోసం చేపట్టిన చర్యలతో ఛత్తీస్‌గఢ్, అసోం, జార్ఖండ్, ఒడిశా, జమ్ముకశ్మీర్‌లలో బాలల సంరక్షణ మెరుగైందని ఆ నివేదిక వెల్లడించింది. -
హ్యాపీ జర్నీ
సంక్రాంతి సెలవులు పూర్తయ్యాయి. స్కూళ్లు తిరిగి మొదలయ్యాయి. వేసవి సెలవుల కోసం ఎదురు చూపులూ మొదలయ్యాయి. పరీక్షలు పూర్తవడమే తరువాయి, ఓ వారమైనా ఎటైనా వెళ్లి వస్తే తప్ప మనసు రీచార్జ్ కాదు. కొత్త ఏడాదికి సిద్ధం కాదు. ఇదిలా ఉంటే కరోనా వచ్చింది, వెళ్లింది, మళ్లీ వచ్చింది, వెళ్లింది. వేవ్‌ల నంబరు పెరుగుతోంది. మరో వేవ్‌కి సిద్ధంగా ఉండమనే సూచనలు షురూ అవుతున్నాయి. ఇలాంటప్పుడు ‘క్షేమంగా వెళ్లి, సంతోషంగా రావాలి’ అంటే ఏం చేయాలి? దేశవిదేశాల్లో విస్తృతంగా పర్యటించిన హైదరాబాద్, సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్ నీలిమ... కరోనా జాగ్రత్తల గురించి సాక్షితో పంచుకున్న వివరాలివి. వర్క్ ఫ్రమ్ వెకేషన్! ‘‘కరోనా నా ట్రావెల్ లైఫ్‌ను పెద్ద మలుపు తిప్పింది. నేను 2015 నుంచి కరోనా లాక్డౌన్ వరకు 60 దేశాల్లో పర్యటించాను. ఇండియా టూర్ వార్ధక్యం వచ్చిన తర్వాత అనుకునేదాన్ని. లాంగ్ వీకెండ్ వస్తే ఏదో ఒక దేశానికి వెళ్లిపోయేదాన్ని. కరోనాతో విదేశాలకు విమాన సర్వీసులు నిలిపి వేయడంతో మనదేశంలో పర్యటించడం మొదలుపెట్టాను. ఈశాన్య రాష్ట్రాలు, రాజస్థాన్ మినహా ఇండియాని దాదాపుగా చూసేశాను. ఈ సంక్రాంతికి కూడా ఓ వారం అనుకుని వెళ్లిన పాండిచ్చేరి వెకేషన్‌ని నెలకు పొడిగించుకున్నాను. వర్క్ ఫ్రమ్ హోమ్‌ని వర్క్ ఫ్రమ్ వెకేషన్‌గా మార్చుకున్నాను. నేను చూసినంత వరకు జనంలో కరోనా భయం దాదాపుగా పోయిందనే చెప్పాలి. దేశంలో 99 శాతం వ్యాక్సిన్ వేయించుకున్నారు. కో మార్బిడ్ కండిషన్ ఉన్న వాళ్లు డాక్టర్ సలహా తీసుకుని బూస్టర్ డోస్ కూడా వేయించుకున్న తర్వాత మాత్రమే టూర్లు ప్లాన్ చేసుకోవడం మంచిది. ఈ సమస్యలు లేని వాళ్లయితే ఏ మాత్రం సందేహం లేకుండా పర్యటనలు చేస్తున్నారు. అనేక పర్యాటక ప్రదేశాల్లో మాస్క్ లేకపోతే ప్రవేశం లేదనే బోర్డులున్నాయి, కానీ మాస్క్ నిబంధన మీద పట్టింపుగా కనిపించలేదు. అలాగని నిర్లక్ష్యం చేయకుండా రద్దీ ఉన్న చోట్ల తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందే. ప్రకృతి పిలుస్తోంది! కరోనా భయం ఓ పక్క వెంటాడుతూనే ఉంది, కాబట్టి పర్యటనలకు ప్రకృతి ఒడినే ట్రావెల్ డెస్టినేషన్‌గా మార్చుకోవడం మంచిది. జలపాతాలు, సముద్ర తీరాలు, నదీతీరాలు, ట్రెకింగ్, స్కీయింగ్ జోన్లను ఎంచుకోవాలి. ఈ ప్రదేశాల్లో మనుషుల రద్దీ తక్కువగా ఉంటుంది. మాస్కు లేకుండా హాయిగా విహరించగలిగిన ప్రదేశాలివి. హిమాలయాల్లో ట్రెకింగ్‌కి మంచి లొకేషన్లున్నాయి. స్పితి వ్యాలీ, త్రియుండ్ కుండ్, కీర్‌గంగ, రూప్‌కుండ్, బ్రిబ్లింగ్, థషర్ మషర్ ట్రెక్, బ్రమ్‌తాల్, పిన్ పార్వతి, హమ్తా పాస్ ట్రెక్‌లను దాదాపుగా అందరూ చేయవచ్చు. యూత్‌కి హిమాలయాల్లో పన్నెండు రోజులపాటు సాగే సర్పాస్ ట్రెక్ మంచి థ్రిల్‌నిస్తుంది. నేను కశ్మీర్– గుల్మార్గ్, ఉత్తరాఖండ్– ఔలిలలో ఐస్‌స్కీయింగ్, ఆరోవిల్లెలో సర్ఫింగ్ కరోనా విరామాల్లోనే చేశాను. చార్‌థామ్ యాత్రలో నాకు ఎలాంటి అసౌకర్యం కలగలేదు, కానీ యాత్ర ముగించుకుని ఫ్లయిట్ ఎక్కిన తర్వాత భయం వేసింది. ఆ టూర్ అంతటిలో తుమ్ములు, దగ్గులు వినిపించింది ఫ్లయిట్లోనే. శాంతియాత్ర లాక్డౌన్ విరమించిన తర్వాత నా ట్రావెల్ లిస్ట్‌లో ఈజిప్టు, టర్కీ దేశాలు చేరాయి. పాండిచ్చేరి బీచ్‌లో సర్ఫింగ్, ఆరోవిల్లెలో మెడిటేషన్ నాకు అత్యంత సంతోషాన్నిచ్చాయి. జీవితంలో శాంతికంటే మరేదీ ముఖ్యంకాదని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అందుకే అరోవిల్లెకి మరో లాంగ్ వెకేషన్ ప్లాన్ చేస్తున్నాను. ఆ తర్వాత యూఎస్‌కి వెళ్లి నా వందదేశాల టార్గెట్‌ని పూర్తి చేయాలనేది కోరిక’’ అని చెప్పారు గమనంలోనే గమ్యాన్ని వెతుక్కుంటున్న నీలిమ. వర్క్ చేస్తూ వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తున్నారామె. ఇలాంటి పర్యాటక ప్రియుల వల్లనే ‘వర్కేషన్’ అనే పదం పుట్టింది. కేర్‌ఫుల్‌గా వెళ్లిరండి! కరోనా జాగ్రత్తలు పాటిస్తూ చేతులను తరచు శానిటైజర్‌తో శుభ్రం చేసుకుంటూ, ఆహారపానీయాల పరిశుభ్రత పాటిస్తూ హాయిగా పర్యటించవచ్చనేది నా అభిప్రాయం. అయితే పర్యాటక ప్రదేశాల్లో షాపింగ్ కోసం మార్కెట్లలో ఎక్కువ సేపు గడపకపోవడమే శ్రేయస్కరం. నేను గమనించిన ఆసక్తికరమైన సంగతి ఏమిటంటే... కాశీ అనగానే అది అరవై దాటిన తర్వాత వెళ్లే ప్రదేశం అనుకునే దాన్ని, ఇటీవల అది యూత్ ట్రావెల్ డెస్టినేషన్ అయింది. అక్కడ డిఫరెంట్ వైబ్స్ ఉన్నాయి. – పొనుగోటి నీలిమారెడ్డి, ట్రావెలర్ – వాకా మంజులారెడ్డి -
Jaipur Literature Festival 2023: త్రీలు– పని: నా డబ్బులు తీసుకో అనొద్దు
‘ఉద్యోగం ఎందుకు చేయాలనుకుంటున్నావు?’ ‘ఇప్పుడు ఏం అవసరం వచ్చింది?’ ‘డబ్బులు కావాలా?’ ఈ ప్రశ్నలు స్త్రీలను పురుషులు అడుగుతారు. ‘డబ్బులు కావాలంటే నా డబ్బులు తీసుకో’ అని భార్యతో భర్త, కూతురితో తండ్రి, తల్లితో కొడుకు, చెల్లితో అన్న అంటారు. ‘నేను సంపాదించుకున్న నా డబ్బులు నాకు కావాలి’ అని స్త్రీలు చెప్తే వీరు తెల్లముఖం వేస్తారు. స్త్రీల ఇంటి పని (కేర్ వర్క్)కి విలువ ఇవ్వక, స్త్రీలు బయట పని చేస్తామంటే పట్టించుకోక పోవడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా స్త్రీ, పురుషుల మధ్య ఆర్థిక తారతమ్యాలు తొలగడానికి ఐక్యరాజ్య సమితి అధ్యయనం ప్రకారం 120 ఏళ్లు పట్టనుందని శనివారం ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో పాల్గొన్న రచయిత్రులు అన్నారు. భవిష్యత్తులో ‘కేర్ వర్క్’ పెద్ద ఉపాధి రంగం కానుందని తెలిపారు. ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఒక అధ్యయనం చేసింది. రాబోయే రోజుల్లో ఎటువంటి పనులు గిరాకీ కోల్పోయి ఎటువంటి పనులు గిరాకీలోకి వచ్చి ఉపాధిని ఏర్పరుస్తాయి అనేదే ఆ అధ్యయనం. అందులో దినదిన ప్రవర్థమానమయ్యే పని రంగంగా సంరక్షణా రంగం (కేర్ వర్క్) వచ్చింది. ఇంటి సంరక్షణ, పిల్లల సంరక్షణ, వృద్ధుల సంరక్షణ, ఇంటి శుభ్రత, ఇంటి ఆరోగ్యం... ఇవన్నీ కేర్ వర్క్ కింద వస్తాయి. ఈ కేర్ వర్క్ తరాలుగా స్త్రీలు చేస్తున్నారు. అసంఘటిత రంగంలో ఉన్న స్త్రీల చేత లెక్కా జమా లేని అతి తక్కువ వేతనాలకు చేయిస్తున్నారు. ఇంటిలో పని చేసే గృహిణుల కేర్ వర్క్‌కు విలువ కట్టడం లేదు. కేర్ వర్క్‌ను ప్రభుత్వ, ప్రయివేటు రంగాలు ఒక ఉపాధి రంగంగా అభివృద్ధి చేస్తే తప్ప కేర్ ఎకానమీ స్వరూపం, ఉనికి, ఉపయోగం అర్థం కాదు. మగవాడు ఇంటి బయట జీతానికి చేసే పని ఒక్కటే పని కాదు. ఇంటి లోపల జీతం లేకుండా స్త్రీలు చేసే పని కూడా పనే’ అని జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో శనివారం జరిగిన ‘విమెన్ అండ్ వర్క్’ అనే సెషన్లో పాల్గొన్న రచయిత్రులు అన్నారు. వీరిలో ‘సిస్టర్హుడ్ ఎకానమి’ పుస్తకం రాసిన శైలి చోప్రా, ఇస్రో మహిళా శాస్త్రవేత్తల మీద ‘దోజ్ మేగ్నిఫీషియెంట్ విమెన్ అండ్ దెయిర్ ఫ్లయింగ్ మెషిన్స్’ పుస్తకం రాసిన మిన్ని వైద్, ఐక్యరాజ్యసమితి మాజీ అసిస్టెంట్ సెక్రెటరీ జనరల్ లక్ష్మి పురి ఉన్నారు. ‘స్త్రీలు ఉండదగ్గ చోటు ఇల్లు అనడమే పెద్ద అవరోధం. అన్ని చోట్లు స్త్రీలు ఉండదగ్గ చోట్లే. కాని ఇంట్లో ఉండటం వల్ల, బిడ్డను కనే శారీరక ధర్మం ఆమెకే ఉండటం వల్ల ప్రేమ, బాధ్యత అనే మాటల్లో ఆమెను పెట్టి ఇంటి పని చేయిస్తున్నారు. అంతులేని ఈ ఇంటి చాకిరికి విలువ ఉంటుందని స్త్రీ ఎప్పుడూ అనుకోదు. విలువ సంగతి అటుంచితే... అంత పని స్త్రీ నెత్తిన ఉండటం గురించి కూడా మాట్లాడరు. గ్లోబల్‌గా చూస్తే పురుషుల కంటే స్త్రీలు 2.9 శాతం ఎక్కువ పని చేస్తున్నారు. భారతదేశంలో ఇది పది శాతమైనా ఉంటుంది. స్త్రీ, పురుషుల శరీర నిర్మాణంలో భేదం ఉంది. కాని ఈ భేదం భేదభావంగా వివక్షగా మారడం ఏ మాత్రం సరి కాదు’ అని లక్ష్మి పురి అన్నారు. ‘స్త్రీలు పని చేస్తామంటే పురుషులు అడ్డంకులు వేస్తూనే ఉంటారు. ఎందుకు పని చేయడమంటే అది స్త్రీల లక్ష్యం కావచ్చు. ఎంపిక కావచ్చు. ఇష్టం కావచ్చు. ఆర్థిక స్వావలంబన కోసం కావచ్చు. నా డబ్బు తీసుకో ఉంది కదా అని భర్త, తండ్రి, కొడుకు అంటూ ఉంటారు. ఎందుకు తీసుకోవాలి. తాము సంపాదించుకున్న డబ్బు కావాలి అనుకోవచ్చు స్త్రీలు. భారతదేశంలో స్త్రీల జనాభా జపాన్ దేశపు జనాభాకు ఎనిమిది అంతలు ఉంటుంది. అంతటి జనాభా ఉన్నప్పటికీ మన దేశ స్త్రీల అభిప్రాయాలను, భావాలను పరిగణనలోకి తీసుకోరు. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి’ అని శైలి చోప్రా అన్నారు. ‘మగవారి మధ్య బ్రదర్హుడ్ ఉంటుంది. స్త్రీల మధ్య సిస్టర్హుడ్ బలపడితే అన్నింటిని మార్చగలం. అందుకే నా పుస్తకానికి సిస్టర్హుడ్ ఎకానమీ అని పేరు పెట్టాను’ అన్నారామె. ‘ఇస్రో మహిళా శాస్త్రవేత్తల మీద నేను పుస్తకం రాశాను. వాళ్ల నుంచి విన్న మొదటి మాట మహిళా అనొద్దు... మేమూ శాస్త్రవేత్తలమే... ప్రత్యేకంగా ఎంచడం వల్ల ఏదో ప్రోత్సహిస్తున్న భావన వస్తుంది అంటారు. చాలా బాగుంది. కాని ఇస్రోలో ఇప్పటికీ 16 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారు. ఇప్పటి వరకు ఇస్రోకు మహిళా శాస్త్రవేత్త డైరెక్టర్ కాలేదు. ఎప్పటికి అవుతారో తెలియదు. మంగళయాన్ వంటి మిషన్‌ను స్త్రీలు విజయవంతం చేసినా... నా కుటుంబం సపోర్ట్ చేయడం వల్లే చేశాను... నా భర్త సపోర్ట్ చేయడం వల్లే చేశాను... వారు చేయనివ్వడం వల్ల చేశాను అని చెప్పుకోవాల్సి వస్తోంది. ‘చేయనివ్వడం’ అనేది స్త్రీల విషయంలోనే జరుగుతుంది. ఎంత చదివినా, ఎంత పెద్ద ఉద్యోగంలో ఉన్నా భర్తో/కుటుంబమో వారిని ‘చేయనివ్వాలి’... ఈ స్థితి మహిళలకు ఎలాంటి మానసిక అవస్థను కలిగిస్తుందో మగవాళ్లకు తెలియదు. ఉద్యోగం చేస్తున్న స్త్రీ తారసపడితే ఆఫీసు, ఇల్లు ఎలా బేలెన్స్ చేసుకుంటున్నావు అని అడుగుతారు. మగవాడిని ఎందుకనో ఈ ప్రశ్న అడగరు’ అన్నారు మిన్ని వైద్. ‘కుటుంబ పరమైన, సామాజిక వొత్తిళ్ల వల్ల పిల్లలు కనే వయసులోని స్త్రీలు తమ వృత్తి, ఉపాధి నుంచి దూరమయ్యి పని చేయడం మానేస్తున్నారు. వారు తమ కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే పని చేసే, చేయగలిగే వాతావరణం పూర్తి స్థాయి ఏర్పడాలంటే మగవాళ్లు ఇంకా మారాల్సి ఉంది’ అని ఈ వక్తలు అభిప్రాయ పడ్డారు. – జైపూర్ నుంచి సాక్షి ప్రతినిధి -
బంగారు తల్లి.. చూపులేని తల్లిదండ్రుల కోసం..
వైరల్: తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమీ వాడు గిట్టనేమి.. ఈ భూమ్మీద తల్లిదండ్రులను మించిన రక్షణ మరొకటి లేదు. కానీ, తల్లిదండ్రులంటే అపార గౌరవం, ప్రేమ.. అన్నింటికి మించి వాళ్ల ఆలనా పాలనా చూసుకునే అపర శ్రవణ కుమారులు ఈ కాలంలో అరుదైపోయారు. అలాంటిది.. తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలకు కనువిప్పు కలిగించే ఘటన ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆ చిన్నారిది తోటి స్నేహితులతో ఆడిపాడే వయసు. కానీ, ఆ తల్లిదండ్రులిద్దరికీ చూపు లేదు. అందుకే వాళ్లకు కంటి పాప అయ్యింది. బడికి పోయే టైం తప్పించి.. మిగతా సమయంలో వాళ్ల వెంటే ఉంటూ నడిపిస్తోంది. సాయంత్రం పూట వాళ్లతో కలిసి.. చిరు తిండి తింటూ గడిపింది. ఆపై వాళ్లను అక్కడి నుంచి తీసుకెళ్లింది. ఆ వీడియోనే సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. యూనిఫామ్‌లో ఉన్న ఓ చిన్నారి వాళ్లకు చిరు తిండి అందిస్తూ కనిపిస్తోంది. ముంబైపై వీడియోలు తీసే మిత్ ఇందుల్కర్ అనే ఇన్ఫ్లెన్సర్.. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి పోస్ట్ అయిన ఈ వీడియో.. వ్యూయర్స్ దృష్టిని ఆకట్టుకుంది. ముంబై జాంగిద్, మీరా రోడ్లో రోడ్డు పక్కనే ఉన్న ఓ స్టాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. View this post on Instagram A post shared by Mith Indulkar (@mith_mumbaikar) -
అంతిమ దశలో ఆత్మీయ ‘స్పర్శ’
అంత్యదశలో ఏ బాధా లేకుండా ప్రశాంతంగా నిష్క్రమించాలనేది ప్రతి మనిషి ఆశ. కానీ చావు పుట్టుకల మధ్యలో పుట్టుకొస్తున్న రోగాలు మరణానికి ముందే నరకాన్ని చూపెడుతున్నాయి. అలా కాకుండా... చివరి దశలో ఉన్న రోగుల ముఖాలకు చిరునవ్వులు అద్దుతోంది నగరంలోని స్పర్శ్ హోస్పైస్. దశాబ్దకాలంగా ఉచిత పాలియేటివ్ కేర్ (చివరి రోజుల్లో ఉన్న మనిషికి అందించే సేవ)కు చిరునామాగా నిలుస్తోంది. సాక్షి, హైదరాబాద్: తీవ్రవ్యాధులతో చావుబతుకులమధ్య ఉన్న నిరుపేద రోగుల పట్ల సమాజమూ నిర్దయగానే ప్రవర్తిస్తుంటుంది. ఈ పరిస్థితిని గమనించే ఈ ప్రత్యేక సేవల్ని ప్రారంభించామంటున్నారు స్పర్శ్ నిర్వాహకులు. రోటరీ క్లబ్ బంజారాహిల్స్ శాఖ నిర్వహిస్తున్న ఈ స్వచ్ఛంద సేవ.. ప్రభుత్వం, దాతల సహకారంతో ఎప్పటికప్పుడు అత్యాధునిక హంగులతో రోగులకు అద్భుత సేవలందిస్తోంది. మరిన్ని కొత్త సేవలతో ఇటీవలే కొత్త ప్రాంగణంలోకి మారింది. ఈ సందర్భంగా స్పర్శ్ ట్రస్టీలు డా.సుబ్రహ్మణ్యం, ఎన్.సురేష్‌రెడ్డి, రోటరీ క్లబ్ బంజారాహిల్స్ ప్రెసిడెంట్ ప్రభాకర్, సెంటర్ హెడ్ శశిధర్లు సాక్షితో ప్రత్యేకంగా సంభాషించారు. ఆ సేవల వివరాలు వారి మాటల్లోనే.. ‘చికిత్స కన్నా చిరునవ్వులే మిన్న... ఆసుపత్రుల్లో మెడికల్ కేర్ ఎక్కువ ఉంటుంది. అయితే అవసాన దశలో ఉన్న రోగుల కోసమే స్పర్శ్ ఏర్పాటైంది కాబట్టి.. ఇక్కడ మెడికల్ కేర్ 25 శాతం మాత్రమే. రోగులకు మానసిక, సాంఘిక, ఆధ్యాత్మికపరమైన ఆలంబన అందుతుంది. నెలకు 50 నుంచి 100 మంది అవుట్ పేషెంట్స్ వస్తుంటారు. ఇక్కడ 82 బెడ్స్ ఉన్నాయి. మహిళలకు, పురుషులకు వేర్వేరు విభాగాలున్నాయి. రోగులకు ఆహ్లాదాన్ని పంచేందుకు పచ్చిక, చెట్లు పెంచుతున్నాం. పిల్లల కోసం మరొక వార్డ్ సిద్ధమవుతోంది. వాళ్ల ఆటపాటలకోసం ప్లే ఏరియానూ ఏర్పాటు చేస్తున్నాం. రోగులకు సహాయంగా మరొకరు ఉండేందుకు ఉచిత వసతి అందిస్తాం. చివరిరోజుల్లో ఉన్నవారు ఏవైనా ప్రత్యేకంగా తినాలనుకుంటే వండి వడ్డించేందుకు వంటగది ఏర్పాటు చేశాం. మినీ లైబ్రరీ ఉంది. సినిమా స్క్రీనింగ్, పండుగ, పుట్టినరోజు వేడుకలు, సాంస్కృతిక ప్రదర్శనలను విశాలమైన యాంఫీ థియేటర్లో నిర్వహిస్తాం. చివరినిమిషం వరకూ ఉల్లాసంగా ఉంచేందుకే ఈ తపన. అత్యాధునిక వసతులతో మార్చురీ ఉంది. అంతిమ సంస్కారాలకూ సహకారమందిస్తాం. ఇంట్లో ముఖ్యమైన వ్యక్తి మరణిస్తే.. ఆ కుటుంబానికి అండగా నిలబడతాం. హోమ్ విజిట్స్ కోసం వ్యాన్లు అంతిమ ఘడియల్ని అయినవారి మధ్యే గడపాలనుకునే రోగుల ఇళ్లకు వెళ్లి హోమ్ కేర్‌కోసం 6 వ్యాన్లు ఏర్పాటు చేశాం. రోగిని తీసుకురాలేని పరిస్థితి ఉంటే మనవాళ్లు వెళతారు. ప్రతీ వ్యాన్‌కీ నర్స్, సోషల్ వర్కర్, ఫిజీషియన్, అసిస్టెంట్ ఉంటారు. ఈ వ్యాన్స్‌తో గత నెల 696 విజిట్స్ జరిగాయి. రోగి పరిస్థితిని బట్టి వారానికి ఒక్కసారి, రెండుసార్లు వారి ఇంటికెళ్లి చూస్తాం. ఒక్కో రోగి దగ్గర పావుగంట నుంచి రెండు, మూడు గంటలవరకూ ఉంటారు. నగరం నుంచి 80కి.మీ. పరిధిలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు సేవలుంటాయి. చిరునవ్వు నడిపిస్తోంది.. స్పర్శ్ నిర్వహణలో ఎన్ని వ్యయ ప్రయాసలున్నా రోగుల ముఖాల్లోని చిరునవ్వు అన్నింటినీ మరిపిస్తోంది. మమ్మల్ని నడిపిస్తోంది. నెలకు రూ.40లక్షల వ్యయమవుతుంది. ఎస్బీఐ, పలు కార్పొరేట్ సంస్థల నుంచి, వ్యక్తుల నుంచి విరాళాలు అందుతున్నాయి. ప్రాంగణంలోని కొంత భాగాన్ని ప్రభుత్వ అనుమతితో అద్దెకివ్వడం వల్ల కొంత ఆదాయం వస్తోంది. ఏటా ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాం. -
250 కుక్కలకు చికెన్ బిర్యానీ; నెలకు రూ.60 వేల ఖర్చు
సాక్షి, హైదరాబాద్: సామాజికసేవ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ యానిమల్ సర్వీస్ చేసేవాళ్ళు కొద్ది మంది మాత్రమే ఉంటారు. వారిలో ఒకరు హైదరాబాద్‌కు చెందిన ప్రసాద్. సౌదీ అరేబియాలో జాబ్ చేసిన ఇతను భారత్‌కు తిరిగి వచ్చాక సమాజసేవ చెయ్యాలనుకున్నాడు. దీంతో ఘటకేసర్లో ఆర్ఫనేజ్ మొదలు పెట్టాడు. అయితే ల్యాండ్ సమస్య వల్ల అది మూసివేయాల్సి వచ్చింది. గత 12 సంవత్సరాల నుంచి మాత్రం ఈయన డాగ్ లవర్‌గా మారిపోయారు. ఎల్లారెడ్డిగూడ నుంచి ఎస్ఆర్నగర్ వరకు రోజూ 200 నుంచి 250 వీధి కుక్కలకు ఈయన భోజనం పెడుతుంటాడు. వివిధ ప్రమాదాల నుంచి కాపాడిన కుక్కలు కూడా ఈయన దగ్గర 10 వరకు ఉన్నాయి. రోజూ ఉదయం 4 గంటలకు లేచి కుక్కలకోసం వంట వండడం స్టార్ట్ చేస్తారు. ఉదయం దాదాపు 70 కుక్కలకు, సాయంత్రం 200 నుంచి 250 కుక్కలవరకు పోషిస్తున్నాడు. పైగా చికెన్ బిర్యానీ లాంటివి కూడా వండి పెడుతుంటాడు. వీటికి నెలకు 60 వేలు ఖర్చవుతుంది. అయినా కూడా ఈయన ఆ పని చేస్తూనే ఉన్నాడు. స్నేహితులు, చుట్టాలు, యానిమల్ లవర్స్ సహాయంతో దీనిని నేటికి కొనసాగిస్తున్నాడు. ఆయన చేస్తున్న ఈ పనికి తన కుటుంబం కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. -
మార్జాల వైభోగం
అదో పిల్లుల డే కేర్ సెంటర్. కేవలం డే కేర్ మాత్రమే కాదు... బోర్డింగ్ కూడా ఉంది. బోర్డింగ్ హోమ్‌లతో పాటు వాటికి ప్రత్యేక డిష్‌లతో విందు చేసే కేఫ్‌లు, జలకాలాడించే స్పాలు ఎట్సెట్రాలున్నాయి. వీటికి తోడు బర్త్‌డే పార్టీలూ, రిటర్న్ గిఫ్ట్‌లు. అక్కడ వాటి వైభోగం చెప్పనలవి కాదు. కాబట్టి ఓసారి చూసొద్దాం రండి. శ్రేయ.. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. యానిమల్ అండ్ బర్డ్స్ లవర్ అయిన ఆమెకు సోలో ట్రావెలింగ్ హాబీ. జాబ్ షెడ్యూల్లో ఏ కొంచెం సమయం దొరికినా వెంటనే ప్రయాణానికి ప్లాన్ చేసుకుంటుంది. కాని చిక్కంతా తను పెంచుకుంటున్న చిన్ని పిల్లి ‘బర్ఫీ’ దగ్గరే. దాన్నెక్కడ పెట్టాలి? డాగ్ స్టే హోమ్స్‌లా .. పిల్లికీ బోర్డింగ్ హోమ్స్ ఉంటాయా అని వెదికింది. దొరికింది. చక్కగా పిల్లిని తీసుకెళ్లి ఆ ఇంట్లో పెట్టి నిశ్చింతగా ట్రైన్ ఎక్కింది. ఆమె వెళ్లిన దగ్గర్నుంచి బర్ఫీ అల్లరి, ఆగడాలు, సరదా, సంతోషాలు కొత్త పిల్లులతో స్నేహాలు.. శ్రేయకు వాట్సప్‌లో అప్డేట్ అవుతూనే ఉన్నాయి. పిల్లికింత వైభోగమా? పిల్లలకన్నా ఎక్కువ గారం అందుతున్నట్టుందే అంటూ విచిత్రపడకపోయినా విడ్డురమైతే చెంది ఉంటారు. పెంపుడు కుక్కల రాజసం పరిపాటే కాని పిల్లికైతే కొత్త. అదీగాక మన పనుల గురించి, మన షెడ్యూల్ గురించి ఇసుమంతైనా ఇన్ఫర్మేషన్ లేని ఆ అమాయక జీవి తనమానాన తాను వెళుతూ మన కంటపడితే అపశకునంగా లేబుల్ వేస్తాం. అలాంటి పిల్లిని కావాలని పెంచుకుంటారా? యెస్.. పెంచుకుంటున్నారు. పిల్లి ఎదురుపడితే అరిష్టమనే మూఢత్వాన్ని పటాపంచలు చేస్తూ శ్రేయనే కాదు అలాంటి యూత్ ఎందరో కుక్కలతోపాటు పిల్లుల్నీ పెంచుకుంటున్నారు. వాటి కోసం కేర్సెంటర్స్ వెలిశాయంటేనే అర్థం చేసుకోవచ్చు! ఎక్కడో ఢిల్లీ, ముంబైలాంటి మెట్రో నగరాల్లో కాదు.. అచ్చంగా హైదరాబాద్‌లోనే. పిల్లల కంటే ఎక్కువ.. హైదరాబాద్‌లోని క్యాట్ స్టే కేంద్రాల్లో ’బెంజి క్యాట్ బోర్డింగ్’ ఒకటి. దాన్ని నిర్వహిస్తున్నది మహిళే. పేరు అశ్విని. స్వస్థలం పాలక్కాడ్. మాస్ కమ్యూనికేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన అశ్వినికి మొదటి నుంచీ జంతువులన్నా, పక్షులన్నా, ప్రకృతి అన్నా ప్రాణం. తన పెళ్లి చూపులప్పుడు కూడా చెప్పింది తనను చూడ్డానికి వచ్చిన అబ్బాయితో... తనకు యానిమల్స్ అంటే ఇష్టమని, పిల్లల కన్నా వీటినే ఎక్కువ ఇష్టపడ్తానని, పిల్లల్నీ వద్దనుకుంటున్నానని... అంతగా కావలనిపిస్తే అనాథ పిల్లను దత్తత తీసుకోవాలనుకుంటున్నాని.. ఇవన్నీ నచ్చితేనే ఓకే చెప్పమని. ఆమెతోపాటు ఆమె జీవకారుణ్యమూ నచ్చి ఓకే చెప్పాడు. ఆమెకు మాటిచ్చినట్టుగానే పెళ్లయ్యాక ఆమె ఇష్టాలకెప్పుడూ అడ్డుచెప్పలేదట భర్త. ‘‘నిజానికి మా ఆయనా యానిమల్ లవరే. ఇక్కడికి (హైదరాబాద్) రాకముందు చెన్నైలో ఉండేవాళ్లం. అక్కడే నేనొక డిజిటల్ యాడ్ ఏజెన్సీలో పనిచేసేదాన్ని. కొన్నాళ్లకు మానేసి నిర్మిత, ప్రసన్న అనే ఇద్దరు మహిళలు రన్ చేస్తున్న బెంజి క్యాట్ బోర్డింగ్‌లో వాళ్లకు అవసరమున్నప్పుడు హెల్ప్ చేసేదాన్ని. ఆ తర్వాత మా ఆయనకి హైదరాబాద్‌లో మంచి ఆపర్చునిటీ రావడంతో ఇక్కడికి మకాం మార్చాం. ఇక్కడా పిల్లుల్ని పెంచుకునేవాళ్లుండడం, వాటికి కేర్ సెంటర్స్ పెద్దగా లేకపోవడంతో ఇక్కడ క్యాట్ బోర్డింగ్ స్టార్ట్ చేశాను. అల్కపురి టౌన్షిప్లో.. రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో ఇంకా చెప్పాలంటే మేము ఉండే ఫ్లాట్‌లోనే క్యాట్ బోర్డింగ్ పెట్టా. చుట్టుపక్కల వాళ్ల నుంచి నాకెలాంటి ఇబ్బంది లేదు. రావట్లేదు. దీన్ని బిజినెస్‌లా చేయట్లేదు. హాబీగా రన్ చేస్తున్నా. నాకు సొంతంగా ఓ పిల్లి, కుక్క, చిలక ఉన్నాయి. వాటిని పిల్లలకంటే ఎక్కువగా ప్రేమిస్తా. ‘‘పెట్స్ సరే పిల్లల్నెప్పుడు కంటారు?’’ అంటూ మా పేరెంట్స్, అత్తమామల కన్నా చుట్టాలే అడుగుతుంటారు! పెళ్లికిముందే మా అమ్మకూ చెప్పాను .. దేశంలో ఇంతమంది అనాథలున్నారు. వాళ్లలో ఒకర్ని చూసుకుంటా. పిల్లల్ని కనను అని. అదే విషయం మా ఆయనకూ చెప్పాను. మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు. కాబట్టి ఇంకెవరికో ఆన్సర్ చేయాలనుకోను’’ అంటోంది అశ్విని. కేఫ్‌లు... హ్యాంగవుట్స్ కేర్ సెంటర్లు, బోర్డింగ్స్ సరే.. పెట్ యానిమల్స్ కోసం కేఫ్లూ ఉన్నాయి హైదరాబాద్‌లో. ఇందులో వాటికోసం కుకీస్, కేక్స్, పఫ్స్, కేక్స్ వగైరా దొరుకుతాయి. గచ్చిబౌలిలోని ‘కేఫ్ డి లోకో’ను ఓ సాఫ్ట్వేర్ కంపెనీ యజమాని హేమంత్ నిర్వహిస్తున్నారు. ‘‘మా కేఫ్‌లో మనుషులకు, పెట్ యానిమల్స్‌కు వేరువేరు కిచెన్స్ ఉన్నాయి. ఈ కేఫ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని వీథి కుక్కల ఆరోగ్యం, సంరక్షణ మీద ఖర్చు పెడ్తున్నాం. వీథి కుక్కల దత్తత బాధత్యనూ చేపట్టాం. అర్థం చేసుకుని, బిడ్డల్లా పెంచుకునే ఓపిక, ప్రేమ ఉన్నవాళ్లకు వాటిని దత్తతకిస్తున్నాం. ఈ కుక్కపిల్లలకు బర్త్‌డే పార్టీలు అరేంజ్ చేస్తాం. కుక్కపిల్లలకు రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇస్తాం. పిల్లలకూ పర్యావరణం, జంతువులు, పక్షులు, ప్రకృతి మీద ప్రేమా పెరుగుతోంది. వాటిని కాపాడుకోవాలనే బాధ్యతా తెలుస్తోంది. అన్నిటికీ మించి మనం అనే భావన కలుగుతోంది’’ అంటారు హేమంత్. కొందరికి తమ జీవనశైలి చుట్టూ ఉన్న పరిసరాలపట్ల ఎంత స్పృహ లేకుండా ఉందోమరికొందరికి అంతే స్పృహ ఉందనడానికి ఇదే నిదర్శనమేమో! -
ఉష్ణం..ఉగ్రరూపం
సూర్యుడి చూపులు కాకపుట్టిస్తున్నాయి. చెమటలు చికాకు తెప్పిస్తున్నాయి. వేడిగాలులు వెక్కిరిస్తున్నాయి. గొంతు తడారిపోతోంది. శరీరంలోని శక్తి మొత్తం పోతోంది. వేసవి సమీపించిన తరుణంలోబయటకు వెళ్లిన వారి పరిస్థితి ఇది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్‌కు చేరాయి. ఈ దశలో రకరకాల చర్మ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా గాలిసోకని టైట్ దుస్తుల వల్ల ఫంగల్ ఇన్ ఫెక్షన్ లు, ఎండలో ప్రయాణాలు చేయడం వలన సన్ బర్న్స్, రాష్ వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. – తగరపువలస (భీమిలి) సన్ బర్స్న్(చర్మం కాలిపోవటం) ఎండలో ఎక్కువగా తిరగే వారు సన్ బర్న్స్‌కు గురవుతుంటారు. చర్మం అంతాకాలినట్లు అయిపోయి, మచ్చలు ఏర్పడతాయి. దీనిని నిర్లక్ష్యం చేస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటోంది. ఈ సమస్యతలెత్తినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించడం మేలు. అదేవిధంగా అధికంగా నీరు, పానీయాలుతీసుకోవాలి. రాష్ (చెమట కాయలు) వేసవిలో అధికంగా చెమట పట్టిన వారికి ఎక్కువగా రాష్ వస్తుంది.అదే విధంగా గాలి సోకని మందమైన దుస్తులు, సిల్క్ దుస్తులు ధరించడం వల్ల సమస్య తలెత్తుతోంది. ఎండలో బయటకు వెళ్లే సమయంలో సన్ స్కిన్ లోష వాడటం మంచింది. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బిగుతుగా వుండే వస్త్రాలు ధరించేవారికి, స్నానం చేసిన తర్వాత చర్మాన్ని సరిగ్గాతుడుచుకోకుండా వస్త్రాలు ధరించే వారికి ఫంగల్ ఇన్ ఫెక్షన్స్ వస్తుంటాయి. తొడలమధ్య తామర సోకడం, దురద ఎక్కువగావస్తుంది. దీని బాధితులు గోరు వెచ్చని నీటితో స్నానం చేయడంతో పాటు, అనంతరంతేమ లేకుండా చర్మాన్ని శుభ్రంగా తుడుచుకుని, సంబంధిత కొలనైన్ లోషన్స్ రాయడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. చికున్ ఫాక్స్ (అమ్మవారు) వేసవిలో వైరల్ ఇన్ ఫెక్షన్ తో చికున్ ఫాక్స్ ఎక్కువగా వస్తాయి. మనందీనిని అమ్మవారు పూసింది అంటాం. చికున్ ఫాక్స్ వచ్చినట్లు గుర్తించిన వెంటనే సకాలంలో మందులు వాడటం ద్వారా దాని ప్రభావం చర్మంపై పడకుండా జాగ్రత్త పడవచ్చు. మూఢ నమ్మకాలకు పోకుండా సకాలంలో మందులు వాడితే చర్మంపై ప్రభావం తగ్గుతుంది. వైద్యుని సలహా మేరకు నడుచుకోవాలి. సన్ ఎలర్జీ.. ఎండలో ఎక్కువగా తిరిగే వారికి సన్ ఎలర్జీ సోకుతుంది. దీంతోచర్మంపై దద్దుర్లు రావడం, దురదలు పుట్టడం, రాత్రి సమయాల్లో నిద్రకూడ సరిగా పట్టకుండా ఇబ్బంది పెడుతోంది. ఈ జాగ్రత్తలు పాటిస్తే మేలు వేసవిలో శరీరానికి నూనె వంటి పదార్థాలు, సన్ స్క్రీన్ లోషన్స్‌ను రాసుకోవాలి ఎండలో వెళ్లేటప్పుడు గొడుగు, తలకు టోపీ ఉండాలి. ముఖ్యంగా లూజు దుస్తులు, అవి కూడా కాటన్ దుస్తులను వాడాలి. సీజనల్ ఫ్రూట్స్‌తో తీసుకోవడంతో పాటు, నీరు ఎక్కువగా తాగాలి. ఫంగల్ ఇన్ ఫెక్షన్స్ సోకిన వారు వాడేటవల్స్ మరొకరు వాడితే వారికి సోకే అవకాశం వుంది. వాటిని వేడి నీటిలో నానబెట్టి వాష్చేస్తే మంచిది. -
సహజమైన మార్పు
బ్యూటిప్స్ వర్షాకాలం చర్మం త్వరగా పొడిబారినట్టు, కాసేపటిగా జిడ్డుగా మారినట్టుగా అనిపించడం సహజం ఇలాంటప్పుడు చర్మసంరక్షణకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. మాయిశ్చరైజర్: పొడిబారిన చర్మానికి సహజసిద్ధమైన మాయిశ్చరైజర్ లభించాలంటే అరటిపండు, తేనె, అవకాడో, కొబ్బరి పాలు, పెరుగు, ఓట్మిల్, ఆలివ్ ఆయిల్లు బాగా ఉపయోగపడతాయి. వీటిలో ఏదైనా ఒకదానితో చర్మానికి ప్యాక్ వేసుకొని, మృదువుగా మర్దనా చేసి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. జిడ్డు తగ్గడానికి బ్లీచ్: జిడ్డు చర్మం గలవారికి ఈ కాలం దుమ్ము, ధూళి కణాలు చేరి చిరాకుగా ఉంటుంది. ఈ సమస్యకు విరుగుడుగా నారింజ, నిమ్మ, పైనాపిల్, దోస, రసాలలో ఏదైనా ఒకదానిని ఎంచుకొని, రాసి, పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి. నిగారింపుకి: జిడ్డు చర్మానికి గుడ్డులోని తెల్లసొన, పొడి చర్మానికి గుడ్డులోని పసుపు సొనలతో ప్యాక్ వేసుకొని ఆరాక కడిగేయాలి. అలాగే బాదంలను నానబెట్టి పొడి చేసి ప్యాక్ వేసుకోవాలి. రోజూ 10 గ్లాసుల నీళ్లు, తాజా ఆకుకూరలు కూరగాయలతో చేసే సమతుల ఆహారం చర్మ నిగారింపును పెంచుతుంది. -
రోజూ తలస్నానం...
బ్యూటిప్స్ వానా కాలం శిరోజాలంకరణ మాత్రమే కాదు వాటి సంరక్షణ కూడా ఇబ్బందిగానే ఉంటుంది. నూనె పెడితే వర్షానికి తడిసి మరింత జిడ్డుగా మారుతుందని భయం. నూనె పెట్టకపోతే పొడిబారి వెంట్రుక లు చిట్లే అవకాశం ఉందని బాధ. ఈ కాలం శిరోజాల సౌందర్యం కాపాడుకోవాలంటే కొన్ని కనీస జాగ్రత్తలు పాటించాలి. ఈ కాలం రోజూ షాంపూ వాడచ్చా? అని చాలా మందికి సందేహంగా ఉంటుంది. గాఢ రసాయనాలు లేని హెర్బల్ షాంపూలను తలస్నానానికి రోజూ ఉపయోగించవచ్చు. తలస్నానం చేయడానికి రెండు గంటల ముందు సహజసిద్ధమైన నూనెను గోరువెచ్చగా చేసి వెంట్రుకల కుదుళ్లకు పట్టించి, మృదువుగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల కురులు మృదుత్వాన్ని కోల్పోవు. కాఫీ, టీ లలో ఉండే కెఫిన్ పదార్థాం వెంట్రుకలు రాలడం దోహదం చేస్తుంది. కాఫీ, టీలకు బదులుగా పండ్లరసాలు, పాలు, హెర్బల్ టీ... వంటి కెఫెన్ లేని ద్రవపదార్థాలను తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు వర్షాకాలంలో ఎదురయ్యే శిరోజాల సమస్యలను దూరం చేస్తాయి. -
ఐసీడీఎస్ శిశుగృహ సంరక్షణలో చిన్నారులు
కాకినాడ సిటీ : కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో ఈ నెల ఏడున వదిలివేసిన మగశిశువు, 13న రాయుడుపాలెం అంగన్వాడీ పరిధిలో వదిలిన ఆడ శిశువును ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్థానిక శ్రీరామ్‌నగర్‌లోని శిశుగృహ సంరక్షణలో ఉంచారు. శిశువులకు సంబంధించిన తల్లిదండ్రులు కానీ, రక్త సంబంధీకులు కానీ నెల రోజుల్లో తగిన ఆధారాలతో జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఇన్చార్జి పీడీ టి.ప్రవీణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎవరూ రాకపోతే శిశువులను చట్టబద్ధంగా దత్తత ఇస్తారని చెప్పారు. -
ప్రకృతి ప్రేమికుడు
♦ దేశ, విదేశాల నుంచి మొక్కలు, చెట్ల సేకరణ ♦ వంద ఎకరాల్లో పెంపకం, సంరక్షణ ♦ బొటానికల్ గార్డెన్ ఏర్పాటే లక్ష్యంగా సాగుతున్న రాందేవ్ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఆయనకు చిన్ననాటి నుంచి మొక్కలంటే ప్రాణం. అటవీశాఖలో కాంట్రాక్టర్‌గా పనిచేసే తండ్రి వెంట అడవుల్లో తిరుగుతూ మొక్కలు, చెట్లపై మరింత ఆసక్తిని పెంచుకున్నారు. పెద్దయ్యాక వ్యాపారంలో స్థిరపడినా.. వాటిపై మక్కువ మాత్రం వదలలేదు. దేశంలోనే అతిపెద్దదైన బొటానికల్ గార్డెన్ ఏర్పాటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఆయనే వరంగల్ జిల్లా నెక్కొండ గ్రామానికి చెందిన రాందేవ్. 25 ఏళ్ల క్రితం వ్యాపారంలో అడుగుపెట్టి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఒకవైపు వ్యాపారాన్ని చూసుకుంటూనే మరోవైపు తనకు ఆసక్తి ఉన్న మొక్కలు, చెట్ల పెంపకంపై దృష్టి సారించారు. ఈ ప్రకృతి ప్రేమికుడి కథనమే ఆదివారం ప్రత్యేకం.. - మొయినాబాద్ శంకర్పల్లి మండలం పొద్దటూరు, మొయినాబాద్ మండలం మేడిపల్లి గ్రామాల సరిహద్దుల్లో భూమి కొనుగోలు చేసి వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేశారు రాందేవ్. వంద ఎకరాలకు విస్తరించిన క్షేత్రంలో దేశ, విదేశాల నుంచి తెచ్చిన వేల మొక్కలు, చెట్లు పెంచుతు న్నారు. ప్రస్తుతం ఇక్కడ ఇటలీ నుంచి తెచ్చిన ఆలీవ్, వియాత్నం నుంచి తెచ్చిన ఫైకస్, ఇండోనేషియా నుంచి తెచ్చిన రెగెస్టోమియా వంటి సుమారు వెయ్యి రకాల చెట్లు ఉన్నాయి. 1,200 ఏళ్ల నాటి ఆలివ్ చెట్టు, 2008 ఒలింపిక్స్ సందర్భంగా చైనాలో ప్రత్యేకంగా పెంచిన చెట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రోడ్డు విస్తరణలో తొలగిస్తున్న చెట్లను చూసి.. 2006-07లో హైదరాబాద్-బీజాపూర్ రహదారి విస్తరణ సందర్భంగా రోడ్డుకు ఇరువైపుల ఉన్న పెద్ద పెద్ద మర్రి వృక్షాలను నరికేస్తున్నారనే విషయం తెలుసుకున్న రాందేవ్ వాటిని రక్షించేందుకు ముందుకొచ్చారు. అధికారులతో మాట్లాడి 200 చెట్లకు పునర్జన్మనిచ్చారు. భారీ క్రేన్ల సాయంతో వేళ్లతో సహా పెకిలించి వాటిని భారీ వాహనాల్లో తన వ్యవసాయ క్షేత్రానికి తరలించారు. వేళ్లు పాడవకుండా రసాయ ప్రక్రియ చేసి చెట్లను క్రేన్ల సాయంతో నాటారు. ఇలా మొత్తం చెట్లు తరలించేందుకు సుమారు రూ.37 లక్షలు ఖర్చు చూశారు. నాటిన చెట్లను రక్షించేందుకు సిబ్బందిని ఏర్పాటు చేశారు. బొటానికల్ గార్డెన్ ఏర్పాటే లక్ష్యం మన దేశంలో బొటానికల్ గార్డెన్లు చాలా తక్కువగా ఉన్నా యి. ఈ విష యమై పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశాను. పలువురు ముఖ్యమం త్రులను కలిసి వివరించాను. ఉత్తర ప్రదేశ్ సీఎం అఖిలేష్‌యాదవ్ స్పందించారు. ఆ రాష్ట్రంలో త్వరలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేయడమే నా లక్ష్యం. దీనికోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధం. - రాందేవ్ 1,500 ఏళ్ల నాటి చెట్టు.. ఇటీవల మహేశ్వరం మండలం మన్సాన్పల్లిలో రియల్ వ్యాపారులు ఓ భారీ చెట్టును నరికేయడానికి సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న రాందేవ్ అక్కడికి వెళ్లి పరిశీలించారు. అది ఆఫ్రికన్ జాతికి చెందిన అడెన్సోనియా డిజిటాటా అనే 1,500 ఏళ్ల నాటి వృక్షమని తెలుసుకున్నారు. దాన్ని రూ.14 వేలకు కొనుగోలు చేసి జేసీబీల సాయంతో కూకటి వేళ్లతో తొలగించారు. 45 అడుగుల చుట్టుకొలత, 70 అడుగుల ఎత్తున్న ఈ భారీ వృక్షాన్ని తరలించేందుకు ముంబై నుంచి ప్రత్యేకంగా భారీ వాహనాన్ని తెప్పించారు. రెండు భారీ క్రేన్ల సహాయంతో వృక్షాన్ని భారీ వాహనంలోకి ఎక్కించి తన వ్యవసాయ క్షేత్రానికి తరలించారు. ఆ చెట్టు వేర్లకు రసాయన ప్రక్రియ చేపట్టి భారీ క్రేన్ల సహాయంతో నాటారు. వృక్షాన్ని తరలించేందుకు రూ.10 లక్షలకు పైగా ఖర్చుచేశాడు. -
పరోపకారార్థం... మన హైదరాబాదీ!
పరోపకారం చేయడం అంటే సగటు హైదరాబాదీకి ఎంతో ఇష్టం. రోజులో ఏదో మంచి కార్యం చేయనిదే అతడికి పొద్దు గడవదు. సాధారణంగా మోటారు సైకిళ్లను అందరూ నడపటం కోసం, ఒకచోటి నుంచి మరో చోటికి వెళ్లడం కోసం ఉపయోగిస్తారు. కానీ హైదరాబాదీ యూత్ మాత్రం పరోపకారం కోసం యూజ్ చేస్తారు. ఆరోజున ఇద్దరు యువకులు కూర్చున్న మోటార్ బైక్స్ కట్స్ కొడుతూ చకచకా టర్నింగ్స్లో పడుతూ లేస్తూ రివ్వున దూసుకువస్తోంది. ఆ స్పీడ్ మీద స్కిడ్ అయితే ఎందరెందర్ని పడేస్తాడో అని నా ఆందోళన. కానీ అంత వేగంగా వచ్చిన ఆ కుర్రాళ్లు వెనక కూర్చున్న అమ్మాయి చున్నీ ప్రమాదానికి అంచున ఉందని హెచ్చరిస్తారు. చక్రంలో ఇరుక్కోకుండా తన ‘హెచ్చరిక చక్రం’ అడ్డేస్తాడు. అలా దంపతుల్ని రక్షించాక థ్యాంక్స్ కూడా ఆశించకుండా వేగంగా వెళ్లిపోతాడు. బావ కళ్లలో ఆనందం చూడటమే వాళ్ల లక్ష్యమని మనకు తెలిశాక మన యూత్‌పై ఎంతో గౌరవం పెరుగుతుంది మనకు. మనం వేగంగా ఏదో పని మీద బైక్‌పై పరధ్యానంగా వెళ్తుంటాం. దారిన పోయేవారు విచిత్రంగా మనల్ని ఏదో కామెంట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ‘ఛీ... ఈ పోకిరీలకు పనీపాటా ఏమీ లేదు’ అనుకునే లోపే... ఇంగ్లిష్ థ్రిల్లర్‌లోని ఛేజింగ్ సీన్లా మరో ఇద్దరు కుర్రాళ్లు వచ్చేసి ‘సైడ్ స్టాండ్’ అంటూ మనల్ని హెచ్చరించి సైడైపోతారు. దాంతో దారి పొడవునా పరోపకార బుద్ధితో మనల్ని హెచ్చరిస్తుండగా, మనం వాళ్లను అపార్థం చేసుకున్నందుకు ఎంతో విచారిస్తాం. అలా సైడ్‌స్టాండ్ వల్ల పడిపోవడం నుంచి కాపాడబడి పశ్చాత్తపం వైపు పడిపోతాం మనం. బస్ ఎక్కి చంకలో విలువైన ఫైళ్లతో మనం నిలబడతాం. కానీ మనకు సీటు దొరకలేదు. కానీ పైన రాడ్ పట్టుకుని పడకుండా స్థిరంగా ఉండాలంటే చేయి ఎత్తాలి. అలా ఎత్తితే ఫైళ్లు పడిపోతాయి, ఎత్తకపోతే మనం పడిపోతాం. ఆ కష్టకాలంలో సీటులో కూర్చున్న పాపన్నలు... చొరవగా మన ఫైలందుకుని మనల్ని నిటారుగా నిలబెడతారు. ఎప్పట్నుంచో నాదో కోరిక. ఎంతో మంది పెద్దపెద్దవాళ్ల ఫొటోలను ఫ్లెక్సీలుగా మార్చి పెడుతుంటారు వాళ్ల అనుచరులు. కానీ నేను సామాన్యుడిని కదా, అనుచరులెవ్వరూ లేనివాణ్ణి కదా అన్నదే నా విచారం. కానీ ఈ బాధ లేకుండా నాలోనూ ఒక విశ్వాసాన్ని పాదుకొల్పింది నగర యువత. మా వీధిలో ఎవరో చనిపోతే వాళ్ల ఫొటో ఒకటి తీసుకుని, దాన్ని పదో, పన్నెండో జిరాక్స్ తీయించి, వెదురు బద్దకు అతికించి... అతడి ఇంటి పరిసరాల్లోని నాలుగు రోడ్ల ప్రతి కూడలిలోనూ అమర్చారు. అతడి మరణానికి నివాళి అర్పిస్తూ అరటి పండ్ల స్టాండుకు అగరొత్తులు వెలిగించారు. అప్పుడు నా మనసుకెంతో తృప్తి కలిగింది. రేపు నేను పోయినా ఫ్లెక్సీ కాకపోతేమానె... కనీసం కలర్ జిరాక్సుతో చౌరస్తాలో వెదురు బద్దకు వేలాడుతామన్న తృప్తి కలిగింది నాకు. సామాన్యుణ్ణి సైతం సెలబ్రిటీలా చూసుకునే పరోపకారి హైదరాబాదీ... జిందాబాద్! -
నిగ్గు తేల్చే పరీక్ష
సందేశం హిందూ మతం ఔన్నత్యాన్ని పాశ్చాత్య దేశాలకు పరిచయం చేయడానికి స్వామి వివేకానంద తొలిసారిగా విదేశీయానానికి బయలుదేరినప్పటి సంగతి ఇది. చేపట్టిన ఆ బృహత్ కార్యానికి స్వామి వివేకానంద అన్ని విధాలా సరిపోయినవాడా, కాదా అన్నది తెలుసుకోవాలని ఆయన తల్లి భువనేశ్వరీ దేవి భావించింది. ఆ సంగతి తెలుసుకొనేందుకు ఆయనను రాత్రి విందుకు పిలిచింది. గుండెలోని ప్రేమను రంగరించి మరీ తల్లి చేసిన వంటకాలను స్వామీజీ తృప్తిగా తిన్నారు. భోజనం పూర్తి అయిన తరువాత ఓ గిన్నె నిండా పండ్లు పెట్టి, వాటిని కోసుకొని తినేందుకు ఓ చాకు ఇచ్చిందా తల్లి. వివేకానంద ఓ పండును కోసుకొని, తినసాగారు. అప్పుడు ఆమె, ‘‘నాయనా... నాకు కొద్దిగా పని ఉంది. ఆ కత్తి ఇస్తావా?’’ అని అడిగింది. వివేకానంద వెంటనే ఆ చాకును తల్లికి ఇచ్చారు. వెంటనే ఆమె మరోమాట లేకుండా, ‘‘నాయనా... నువ్వు నా పరీక్షలో నెగ్గావు. దిగ్విజయంగా విదేశీయాత్ర జరుపుకొని రా... ఇవే నా ఆశీస్సులు’’ అంది. దాంతో వివేకానంద ఆశ్చర్యంతో ‘‘అమ్మా.. నన్నెలా పరీక్షించావు? నాకు అర్థం కాలేదు’’ అన్నారు. అప్పుడు ఆమె ఇలా చెప్పింది... ‘‘నాయనా... కత్తి ఇవ్వమని అడిగినప్పుడు నువ్వు ఆ కత్తి మొనను పుచ్చుకొని, చెక్క పిడి ఉన్న వైపును నాకు అందించావు. అలా కత్తిని పట్టుకొనేటప్పుడు నాకు హాని కలగకుండా, దెబ్బ తగలకుండా ఉండేలా జాగ్రత్తపడ్డావు. అలా నా సంరక్షణ బాధ్యత తీసుకున్నావు. ఎవరైతే తమ స్వార్థం గురించి ఆలోచించుకోకుండా, ఇలా ఇతరుల సంక్షేమం గురించి తపిస్తారో వారే ప్రపంచానికి బోధలు చేయడానికి అర్హులు. ఆ హక్కు వారికే ఉంటుంది. అదే నేను నీకు పెట్టిన పరీక్ష. నువ్వు నా పరీక్షలో నెగ్గావు. నీకు నా ఆశీస్సులు. దిగ్విజయోస్తు.’’ స్వార్థం మానుకొని, పొరుగువారి సంక్షేమానికి తోడ్పడాలన్న ఈ కీలకమైన సందేశాన్ని ఆ తరువాత స్వామి వివేకానంద తన జీవితకాలంలో కలిసిన లక్షల మంది హృదయాల్లో నాటుకొనేలా చేశారు. ఓ మామూలు మనిషికీ, అసాధారణ వ్యక్తికీ లక్షణాల్లో ఉండే ప్రధానమైన తేడా ఈ సంక్షేమ భావనే. నిత్యజీవితంలో కూడా ఇతరుల ఆనందం గురించి ఆలోచించేవాడే అసలు సిసలు గొప్పవాడు. - రెంటాల జయదేవ