రోజూ తలస్నానం...
బ్యూటిప్స్
వానా కాలం శిరోజాలంకరణ మాత్రమే కాదు వాటి సంరక్షణ కూడా ఇబ్బందిగానే ఉంటుంది. నూనె పెడితే వర్షానికి తడిసి మరింత జిడ్డుగా మారుతుందని భయం. నూనె పెట్టకపోతే పొడిబారి వెంట్రుక లు చిట్లే అవకాశం ఉందని బాధ. ఈ కాలం శిరోజాల సౌందర్యం కాపాడుకోవాలంటే కొన్ని కనీస జాగ్రత్తలు పాటించాలి.
ఈ కాలం రోజూ షాంపూ వాడచ్చా? అని చాలా మందికి సందేహంగా ఉంటుంది. గాఢ రసాయనాలు లేని హెర్బల్ షాంపూలను తలస్నానానికి రోజూ ఉపయోగించవచ్చు. తలస్నానం చేయడానికి రెండు గంటల ముందు సహజసిద్ధమైన నూనెను గోరువెచ్చగా చేసి వెంట్రుకల కుదుళ్లకు పట్టించి, మృదువుగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల కురులు మృదుత్వాన్ని కోల్పోవు.
కాఫీ, టీ లలో ఉండే కెఫిన్ పదార్థాం వెంట్రుకలు రాలడం దోహదం చేస్తుంది. కాఫీ, టీలకు బదులుగా పండ్లరసాలు, పాలు, హెర్బల్ టీ... వంటి కెఫెన్ లేని ద్రవపదార్థాలను తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు వర్షాకాలంలో ఎదురయ్యే శిరోజాల సమస్యలను దూరం చేస్తాయి.