Rainy
-
భారతీయులకు ఏ సీజన్ అంటే ఇష్టం?
భారతదేశంలోని ప్రజలు ఒక ఏడాదిలో వివిధ రుతువులలోని వాతావరణాలను చవిచూస్తారు. చలి, వేడి, వర్షం మొదలైనవి మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తాయి. అటువంటప్పుడు భారతీయులు ఏ సీజన్లో అత్యధిక సంతోషంతో ఉంటారనే ప్రశ్న అందరిలో మెదులుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.వాతావరణం మన మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. సూర్యకాంతి, వర్షం, వేడి, చలి, ఇవన్నీ మన మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. చలికాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల చాలా మంది ఇబ్బంది పడతారు. అలాగే వేసవిలో అధిక వేడి అందరికీ చికాకు కలిగిస్తుంది.వాతావరణం మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. సూర్యరశ్మి, ఉష్ణోగ్రత మొదలైనవి మన మానసిక స్థితి, శక్తి స్థాయిలు, నిద్రను ప్రభావితం చేస్తాయి. శీతాకాలంలో పగలు తక్కువగా ఉంటుంది. సూర్యరశ్మి కూడా తక్కువగానే ఉంటుంది. ఇది సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ (సాడ్) తరహా సమస్యలను కలిగిస్తుంది. మరోవైపు శీతాకాలం పండుగ సీజన్ కూడా కావడంతో జనం కొంతమేరకు సంతోషంతో ఉంటారు.వేసవి కాలంలో అత్యధిక సూర్యకాంతి కారణంగా జనం త్వరగా అలసిపోతారు. చికాకుగా అనిపిస్తుంటుంది. అయితే వేసవి సెలవులు రావడం, దీనికితోడు ప్రయాణాల సీజన్ కావడంతో జనం సంతోషంతో ఉంటారు. వర్షాకాలంలో ఏర్పడే పచ్చని ప్రకృతి మన మనసును ప్రశాంతపరుస్తుంది. భారతదేశంలో వాతావరణం- సంతోషం మధ్య సంబంధాన్ని తేల్చిచెప్పడం చాలా క్లిష్టమైనదని నిపుణులు అంటుంటారు. ప్రజల ఆనందం అనేక కారణాలపై ఆధారపడి ఉంటుంది.మరోవైపు దేశంలోని వివిధ ప్రాంతాలలోని వాతావరణం భిన్నంగా ఉంటుంది. ఉత్తర భారతదేశంలో శీతాకాలం చాలా చల్లగా ఉంటుంది. అయితే దక్షిణ భారతదేశంలో వేసవిలో ఎండలు మండిపోతుంటాయి. కాగా భారతీయ సంస్కృతిలో వాతావరణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. పలు పండుగలు, ఆచారాలు సీజన్‌తో ముడిపడి ఉన్నాయి. ఉదాహరణకు హోలీ పండుగ వసంతకాలంలో జరుపుకుంటారు. దీపావళిని శరదృతువులో జరుపుకుంటారు. వాతావరణం విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. కొందరికి శీతాకాలం, మరికొందరికి వేసవి కాలం అంటే ఇష్టం ఉంటుంది. ఇది కూడా చదవండి: మనవరాలి పెళ్లి సంగీత్‌లో.. మల్లారెడ్డి ఊర మాస్ డ్యాన్స్ -
ప్రమాదకరంగా మారనున్న జలపాతాలు
ఉత్తరాఖండ్... దేశంలోనే అత్యంత అందమైన రాష్ట్రంగా పేరొందింది. ఇక్కడి ప్రకృతి రమణీయత ఎవరినైనా ఇట్టే కట్టిపడేస్తుంది. ఇక్కడి జలపాతాలు పర్యాటకుల మదిని పులకింపజేస్తాయి. వేసవిలో ఇక్కడికి వచ్చి, జలపాతాల్లో జలకాలాటలు ఆడినవారు వర్షాకాలంలో వాటికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రుతుపవనాలు ఉత్తరాఖండ్‌ను తాకాయి. వేసవిలో ఎండ వేడిమి నుండి తప్పించుకునేందుకు ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్, దాని పరిసర ప్రాంతాలకు వచ్చి, ఇక్కడి జలపాతాలలో స్నానం చేసినవారు ఇకపై ఈ జలపాతాలకు దూరంగా ఉండాలి. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రమాదాల బారిన పడే అవకాశాలున్నాయి.ఉత్తరాఖండ్‌లోని ధోకనే జలపాతం నైనిటాల్‌కు 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. వారు ఇక్కడ స్నానాలు చేస్తుంటారు. అయితే వర్షాకాలంలో ఇక్కడ నీరు అత్యధిక స్థాయిలో జాలువారుతుంది. అలాంటప్పుడు ఇక్కడ స్నానం చేయకూడదు. ఒడ్డున కూర్చుని స్నానం చేయడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.ఉడ్‌ల్యాండ్ జలపాతం నైనిటాల్-కలాధుంగి రోడ్డులో ఉంది. స్థానికులు దీనిని మిల్కీ వాటర్ ఫాల్ అని కూడా అంటారు. వర్షాకాలంలో ఇక్కడ నీటి ప్రవాహం వేగంగా ఉంటుంది. ఈ జలపాతం ఒక వాలులో ఉన్నందున పర్యాటకులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. జలపాతం కిందకు వెళ్లడం అత్యంత ప్రమాదకరమని స్థానికులు చెబుతుంటారు.జిమ్ కార్బెట్ జలపాతం కలదుంగి-రామ్‌నగర్ రహదారిలో ఉంది. ఈ జలపాతం ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇక్కడ స్నానం చేయడం నిషిద్ధం. వర్షాకాలంలో ఇక్కడ నీటి పరిమాణం మరింతగా పెరుగుతుంది. జలపాతం సమీపంలోకి వెళ్లడం ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లే అవుతుంది.భాలుగాడ్ జలపాతం నైనిటాల్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. పచ్చని అడవుల మధ్య అందమైన పర్వత మార్గాల్లో ట్రెక్కింగ్ ద్వారా ఈ జలపాతాన్ని చేరుకోవచ్చు. వేసవిలో ఇక్కడ పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే వర్షాకాలంలో ఈ జలపాతం ఎంత అందంగా కనిపిస్తుందో అంతే ప్రమాదకరంగా మారుతుంది. వర్షాకాలంలో ఈ జలపాతంలో నీటి మట్టం గణనీయంగా పెరుగుతుంది. ఈ జలపాతంలో స్నానానికి దూరంగా ఉండటం ఉత్తమం.దట్టమైన అడవుల మధ్య హిడెన్ జలపాతం ఉంది. వేసవిలో ఇక్కడికి పర్యాటకులు తరలివస్తుంటారు. వర్షాకాలంలో ఈ జలపాతం అసాధారణ నీటిమట్టంతో ప్రమాదకరంగా మారుతుందని స్థానికులు చెబుతున్నారు. అందుకే వర్షాకాలంలో ఇటువైపు రాకపోవడమే ఉత్తమమని వారు సూచిస్తున్నారు. -
రోడ్లు.. వానపాలు
సాక్షి నెట్వర్క్: భారీ వర్షాలు రాష్ట్రంలోని పలు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షం భీభత్సం సృష్టించింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ నగర్, రామ్‌నగర్ కాలనీలు నీట మునగడంతో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. నిర్మల్ జిల్లాలో 30 వేల ఎకరాల్లో పంట నీట మునిగిందని అంచనా వేశారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పలుచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. నిజామాబాద్ జిల్లాలో 24,035 మంది రైతులకు చెందిన 33,429 ఎకరాల్లో వరి, సోయా, మొక్కజొన్న, పసుపు పంటలు దెబ్బతిన్నాయి.7 మండలాల్లోని 16 చెరువుల కట్టలు తెగిపోయాయి. బోధన్ మండలం సాలూర శివారులోని మంజీర నది పాత వంతెన పైనుంచి ప్రవహించడంతో తెలంగాణ – మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచి పోయాయి. ఖమ్మం జిల్లా కేంద్రాన్ని గురువారం అతలాకుతలం చేసిన మున్నేరు వరద శుక్రవారం ఉదయం నుంచి తగ్గుతూ వస్తోంది. గురువారం రాత్రి 10గంటలకు 30 అడుగులుగా ఉన్న నీటి మట్టం శుక్రవారం రాత్రి ఏడు గంటలకు 18.30 అడుగులకు పడిపోయింది. దీంతో పునరావాస కేంద్రాల నుంచి ప్రజలు ఇళ్లకు చేరుకుంటున్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మున్నేరును పరిశీలించి సహాయక చర్యలపై అధికారులకు సూచ నలు చేశారు. ఖమ్మంలో మున్నేటి వరద, ముంపు ప్రాంతాలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ప్రచార కమిటీ కోచైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించి బాధితులతో మాట్లాడారు. -
పది లక్షల ఎకరాలు మునక
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలతో వానాకాలం పంటలు వరద ముంపునకు గురయ్యాయి. మొలక దశలో ఉన్న వివిధ పంటలు దెబ్బతిన్నాయి. 10.76లక్షల ఎకరాల్లో నేరుగా నీటి ముంపునకు గురికాగా, మరో 4 లక్షల ఎకరాలు అధిక వర్షాల తాకిడితో మొలక స్థాయిలో ఉన్న పంటలు, వరి నార్లకు నష్టం జరిగింది. ఇలా 16 లక్షలకు పైగా ఎకరాలపై వర్షాల ప్రభావం పడిందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నాట్లు వేసిన నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ,ములుగు, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో వరి పొలాలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి.ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ సమీప ప్రాంతాల్లో గత 20 రోజుల క్రితం వేసిన వరి నాట్లు నీటమునిగాయి. సూర్యాపేట జిల్లా కిష్టాపురం, మౌగిలాయకోట, శాంతినగర్, లక్కవరం, గోండ్రియాల, కొత్తగూడెం తదితర గ్రామాల్లో కూడా వరి నాట్లు ముంపునకు గురయ్యాయి. ఖమ్మం జిల్లాలోని జక్కపల్లి, సిద్దెపల్లి, రామచంద్రపురం, పైనంపల్లి, బుద్దారం తదితర గ్రామాల్లో పంటలపై కూడా వరద ప్రభావం పడింది. ఆదిలాబాద్ , ఆసిఫాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలతో పాటు భద్రాద్రి జిల్లా చర్ల, వాజేడు, వెంకటాపురం తదితర ప్రాంతాల్లో పంటలకు తీవ్రంగా నష్టం జరిగింది. గోదావరి నది రెండు వైపులా ఉప్పొంగి కిలోమీటరు నుంచి రెండు కిలోమీటర్ల మేర పంటలను ముంచెత్తుకుంటూ పారింది. అనేక ప్రాంతాల్లో ఒక్క పంట కూడా పనికి వచ్చే పరిస్థితి లేదని క్షేత్రస్థాయి అధికారులు అంటున్నారు. పత్తిపై అధిక ప్రభావం ఈ సీజన్లో ఇప్పటివరకు 40.73లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యింది. కాగా వర్షాల ప్రభావం ఎక్కువగా ఈ పంటపైనే పడినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఆదిలాబాద్, మంచిర్యా ల, కరీంనగర్, హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పత్తి పంటపై తీవ్ర ప్రభావం పడింది. తాజాగా వేసి న పత్తి విత్తనాలు వర్షాలకు మొలకెత్త కుండానే భూమిలోనే మురిగిపోయాయి. ఇక మొలక స్థాయి లో ఉన్న పత్తి నీటిలో మునిగి దెబ్బతింది. వరినాట్లు కూడా నీట మునిగాయి. ఇప్పటివరకు 15.63లక్షల ఎకరాల్లో వరినాట్లు పడగా.. వీటిలో 5లక్షలకు పైగా ఎకరాల్లో నీరు చేరిందని అధికా రులు చెబుతున్నారు. వరి నార్లు మొత్తం దెబ్బతిన్నాయని, మళ్లీ నార్లు పోసుకోవాల్సిందేనని రైతు లు అంటున్నారు. ఇక సోయాబీన్ సాగు ఇప్పటివరకు 4.14లక్షల ఎకరాల్లో సాగు చేయగా.. ఆదిలా బాద్ జిల్లాలో ఈ పంటపై ఎక్కువ ప్రభావం పడినట్లు తెలుస్తోంది. పొలాలను ముంచేసిన గుర్రపుడెక్క భూదాన్‌పోచంపల్లి: భారీ వర్షాలతో యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లి చెరువు నిండి అలుగుపోస్తోంది. ఈ చెరువులోని గుర్రపు డెక్క కూడా కొట్టుకువచ్చి వరి పొలాలను కమ్మేసింది. దీనితో పోచంపల్లిలో 30ఎకరాలు, పిలాయిపల్లిలో 2ఎకరాల వరికి నష్టం జరిగింది. -
ఫ్యాషన్ టాక్: వానలో తడవకుండా స్టయిల్‌గా కనిపించాలా? పాంచోస్ బెస్ట్
చిటపట చినుకులను ఆనందించాలి. తడవకుండా మెరిసిపోవాలి. కొత్తగా ఉండాలి. స్టయిల్‌గా కనిపించాలి. మబ్బు పట్టిన సమయమైనా ముసురు పట్టిన రోజులైనా డ్రెస్‌కు అడ్రెస్‌గా ఉంటూ టెన్షన్ ఫ్రీగా గడిపేయాలనుకునేవారికి డిజైనర్ వాటర్ ప్రూఫ్ పాంచోస్ రెడీ టూ వేర్ గా ఆకట్టుకుంటున్నాయి. వానల్లో తడవకుండా ఉండటానికి గొడుగు లేదా లాంగ్ జాకెట్స్ మనకు వెంటనే గుర్తుకువస్తాయి. అంతకు మించి వానకాలంలో స్టయిల్‌గా కనిపించాలనుకుంటే ఇంకేమీ లేవా అనుకునేవారికి వాటర్ ప్రూఫ్ పాంచోస్ మేమున్నామని గుర్తు చేస్తున్నాయి. సహజంగా వేసవి కాలాన్ని సౌకర్యంగా మురిపించిన సిల్క్ అండ్ కాటన్ పాంచోస్ ఇప్పుడు వానకాలాన్ని వాటర్‌ప్రూఫ్‌తో ముస్తాబు చేసుకొని వచ్చాయి. పోల్కా డాట్స్, త్రీడీ ప్రింట్స్, లైన్స్, ఫ్లోరల్స్, యానిమల్ ప్రింట్స్‌తో ఆకట్టుకునే ఈ పాంచోస్ ఒక్కోరోజును ఒక్కో రంగుతో ఎంపిక చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్లైన్లోనూ అందుబాటులో ఉన్న ఈ పాంచోని డ్రెస్ కలర్‌ని బట్టి కూడా సెలక్ట్ చేసుకోవచ్చు. -
కోస్తాంధ్ర, తెలంగాణలకు వర్షసూచన.
-
కోస్తాంధ్ర, తెలంగాణలకు వర్షసూచన
-
కోస్తాంధ్ర, తెలంగాణలకు వర్షసూచన
విశాఖపట్నం: ఉత్తర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రెండు ఉపరితల ఆవర్తనాలు ఏర్పడ్డాయి. ఇవి నేడు అల్పపీడనంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆవర్తనాల ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణలో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు సైతం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. -
పారిశుధ్యంపై స్పెషల్ డ్రైవ్
సంగారెడ్డి మున్సిపాలిటి: పారిశుద్ధ్యంపై దృష్టి సారించకుంటే వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.. ఇప్పటికైన అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తేగాని సమస్య పరిష్కారం కాదని మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి పేర్కొన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండి పారిశుద్ధ్య చర్యలు వెంటనే చేపట్టాలని సూచించారు. సర్వసభ్య సమావేశం శనివారం స్థానిక పురపాలక సంఘం కార్యాలయంలో జరిగింది. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు . కాగా వార్డుల అభివృద్ధి కోసం నిధులను కేటాయించడంలో పాలకవర్గ సభ్యులు పక్షపాతం చూపుతున్నారని ప్రతిపక్ష బీజేపీ సభ్యులు అరోపించారు. వార్డు కౌన్సిలర్లు బిపాష, మల్లేశం, జహెనాథ్బేగం, యాకూబ్అలీ, ఆరీఫ్‌లు పారిశుద్ధ్య సమస్యపై తీవ్రంగా స్పదించారు. అధికారులు ప్రతి రోజు వివిధ వార్డులను పరిశీలించాలని, వార్డుకు ముగ్గురు చొప్పున పారిశుద్ధ్య కార్మికులను కేటాయించాలని సభ్యులు సూచించారు. ఈ విషయమై ఇన్చార్జి కమిషనర్ స్పందిస్తూ తాను ఇప్పటికే పారిశుద్ధ్య సమస్యపై దృష్టి పెట్టినట్లు తెలతిపారు. అగస్టు1 నుంచి 14 వరకు స్పెషల్ డ్రైవ్ చేపడుతామని తెలిపారు . 20వ వార్డు కౌన్సిలర్ ప్రదీప్ కరెంట్ ఆఫీస్ వెనుకవైపున రోడ్డు గుంతలు పడినందున వాటిని పూడ్చి వేయాలని సూచించారు. 19వ వార్డు కౌన్సిలర్ పద్మ కల్వకుంటలో బోర్‌వేసి 8 నెలలైనా ఇప్పటి వరకు మోటర్‌ను బిగించడం లేదన్నారు. తన వార్డులో ఎప్పుడు డ్రైనేజీలను క్లీన్ చేయడం లేదని, కార్మికులను అడిగితే మాత్రం తమకు రెండు నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్న పట్టించుకోరా? అంటూ తమనే నిలదీస్తున్నారని తెలిపారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మొదట ఆఎస్ఐకి బకాయిపడిన డబ్బులను చెల్లించామని, అందువల్లే వేతనాలు చేల్లించడంతో జాప్యం జరిగిందని కమిషనర్ వివరణ ఇచ్చారు. పట్టణంలో దోమలు బెడద అధికంగా ఉందని మొదటి నుంచి ఫిర్యాదులు చేస్తున్న పట్టించుకోవడం లేదని వార్డు కౌన్సిలర్లు అధికారులను నిలదిశారు. ఇప్పటికే వర్షాకాలం ప్రారంభమైనందున దోమల నివారణ కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. 15వ వార్డు కౌన్సిలర్ జహినబ్బేగం తన వార్డు అభివృద్ధిపై పక్షపాతం చూపుతున్నారని అరోపించారు. కనీసం మీడియా అయిన తమ వార్డు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకోచ్చి పరిష్కరించేలా చూడాలని కోరారు. టౌన్‌ప్లానింగ్ విభాగంలో దరఖాస్తులు పెరిగిపోతున్నాయని అందుకు వివాదాలు లేని వాటికి అనుమతులు ఇవ్వాలని కౌన్సిలర్లు కోరగా తాను నిబంధనల ప్రకారం అనుమతులు పొందిన లేఅవుట్లలో వచ్చిన దరఖాస్తులకు మాత్రం అనుమతులు ఇస్తున్నామని కమీషనర్ వివరణ ఇచ్చారు. జనరల్ ఫండ్‌లో కేవలం 15 వార్డులకు మాత్రమే నిధులు పెట్టారు మిగతా వాటికి ఎందుకు పెట్టలేదని 30వ వార్డు కౌన్సిలర్ సునీల్ అధికారులను ప్రశ్నించారు. ప్రతి వార్డుకు రెండు లక్షల చొప్పున జనరల్ ఫండ్ నుంచి వివిధ అవసరాల కోసం కేటాయించడం జరుగుతుందని చెర్‌పర్సన్ తెలిపారు. ఇప్పటికే రూ.7.50 కోట్లకు సంబంధించిన టెండర్ల పక్రియ పూర్తి చేసి వర్క్ అర్డర్లు ఇచ్చామన్నారు. త్వరలోనే పనులు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. కాగా పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చి వారికి వచ్చిన పనులను రద్దు చేయాలని సభ్యులు తెలుపగా డిప్యూటి ఇంజనీర్ పర్యవేక్షణలో కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించి చర్యలు తీసుకుంటామన్నారు. రంజాన్ పర్వదినం సందర్బంగా ఈద్గా వద్ద భారీ ఏర్పాట్లు చేసినందుకు గాను ఎంఐఎం కౌన్సిలర్లు మున్సిపల్ చెర్‌పర్సన్ విజయలక్ష్మి, ఇన్చార్జి కమిషనర్ వేంకటేశ్వర్లను, డిప్యూటి ఇంజనీర్, ఎఈలను ఈసందర్బంగా సన్మానించారు. -
రుచుల గొడుగు
వానాకాలం వచ్చింది. నల్ల గొడుగులు విచ్చాయి... తెల్ల గొడుగులు విరిశాయి. రుచుల గొడుగు కిందకు రండి. వేడివేడిగా, ఆవురావురుమంటూ మష్రుమ్స్ని ఎంజాయ్ చెయ్యండి. మష్రుమ్ సూప్ కావలసినవి: మష్రుమ్- 100 గ్రా (సన్నగా తరగాలి) కొత్తిమీర- ఒక కట్ట; ఉప్పు - తగినంత దాల్చిన చెక్క- చిన్న ముక్క మిరియాల పొడి - పావుటీ స్పూన్ వెన్న లేదా నూనె- ఒక టేబుల్ స్పూన్ మైదా- 50 గ్రా; వెల్లుల్లి రేకలు- నాలుగు తయారీ: ఒక గిన్నెలో పావు లీటరు నీరు పోసి అందులో కొత్తిమీర (సగం), దాల్చిన చెక్క, మిరియాలపొడి, ఉప్పు వేసి ఉడికించాలి. పెనంలో వెన్న వేసి మష్రుమ్స్ ముక్కలు వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి. ఇప్పుడు అదే పెనంలో వెల్లుల్లి రేకలు, మైదా వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న మిశ్రమాన్ని పోసి బాగా మరిగిన తర్వాత వడకట్టాలి. వడపోసిన మిశ్రమంలో మష్రుమ్ వేసి కొత్తిమీర, మిరియాల పొడి చల్లి సర్వ్ చేయాలి. మష్రుమ్ ఖీర్ కావలసినవి: పుట్ట గొడుగుల తురుము- ఒక కప్పు సోంపు- ఒక టీ స్పూన్; పాలు- అర లీటరు సొంఠి పొడి- అర టీ స్పూన్ పంచదార లేదా తేనె- తగినంత నెయ్యి- 50గ్రా; డ్రై ఫ్రూట్స్- 100 గ్రా తయారీ: ఒక పెనంలో నెయ్యి వేసి డ్రైఫ్రూట్స్‌ని వేయించి పక్కన పెట్టాలి. అదే పెనంలో పుట్టగొడుగుల తురుము వేసి సన్న మంట మీద మగ్గనివ్వాలి. తర్వాత పాలు పోసి దగ్గరయ్యే వరకు ఉడకనివ్వాలి. తర్వాత సోంపు, శొంఠిపొడి, తేనె వేసి కలపాలి. డ్రైఫూట్స్ వేసి వడ్డించాలి. కబోలి - మష్రుమ్ పులావ్ కావలసినవి: పుట్ట గొడుగులు - 50 గ్రా శనగలు - 50 గ్రా; ఉప్పు - తగినంత కొత్తిమీర - ఒక కట్ట (సన్నగా తరగాలి) పుదీన- ఒక కట్ట (ఆకులు ఒలిచి పెట్టుకోవాలి) ఉల్లిపాయ ముక్కలు- ఒక కప్పు పచ్చిమిర్చి ముక్కలు- ఒక టీ స్పూన్ (కారానికి తగినంత మార్చుకోవచ్చు) బియ్యం - 200 గ్రా; దాల్చిన చెక్క - 10 గ్రా అల్లం వెల్లుల్లి పేస్ట్- ఒక టీ స్పూన్ జీలకర్ర- టీ స్పూన్ కరివేపాకు- రెండు రెమ్మలు తయారీ: బియ్యాన్ని కడిగి నానబెట్టాలి. ఒక గిన్నెలో నూనె వేసి తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా వేగిన తర్వాత దాల్చిన చెక్క, ఉప్పు, పుదీన, కొత్తిమీర , శనగలు, పుట్టగొడుగులు వేసి తగినంత నీటిని పోయాలి. ఈ మిశ్రమం వేడెక్కి ఉడకగం మొదలైన తర్వాత బియ్యం వేసి కలిపి ఉడకనివ్వాలి. బియ్యం ఒక మోస్తరుగా ఉడికిన తర్వాత మంట తగ్గించి సన్నమంట మీద పూర్తిగా నీరు ఆవిరయ్యే వరకు ఉంచి దించాలి. మష్రుమ్ మిల్క్ షేక్ కావలసినవి: పుట్ట గొడుగులు- 50 గ్రా పంచదార- ఒక కప్పు; పాలు- అర లీటరు వెనిలా ఎసెన్స్- రెండు చుక్కలు ఏలకులు- రెండు; కిస్మిస్ - పది బాదం- ఎనిమిది (నాలుగింటిని పొడి చేయాలి, నాలుగింటిని సన్నగా తరగాలి); నెయ్యి- ఒక టీ స్పూన్ తయారీ: ఏలకులు, బాదం, పంచదారను కలిపి మిక్సీలో పొడి చేసుకోవాలి. ఆ పొడిని పాలలో వేసి మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత చల్లార్చి ఫ్రిజ్‌లో పెట్టాలి. పుట్ట గొడుగులను నేతిలో దోరగా వేయించి చల్లారిన తరవాత మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేయాలి. ఫ్రిజ్‌లో చల్లబడిన పాలలో ఈ మిశ్రమాన్ని, వెనిలా ఎసెన్స్ కలిపి కిస్మిస్, తరిగిన బాదం పలుకులు వేసి సర్వ్ చేయాలి. చింత చిగురు పుట్టగొడుగుల వేపుడు కావలసినవి: పుట్ట గొడుగులు- 200 గ్రా చింత చిగురు- 100 గ్రా; ధనియాల పొడి- ఒక టీ స్పూన్ పచ్చిమిర్చి- ఆరు; పసుపు- పావు టీ స్పూన్ ఉప్పు- తగినంత; నూనె- రెండు టేబుల్ స్పూన్లు ఉల్లిపాయలు- రెండు (తరగాలి) జీలకర్ర- ఒక టీ స్పూన్ వెల్లుల్లి రేకలు- ఒక టీ స్పూన్ తయారీ: చింతచిగురు, ఉల్లిపాయ ముక్కలు సగం, జీలకర్ర సగం మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. ఒక పెనంలో నూనె వేసి పచ్చిమిర్చి, వెల్లుల్లి రేకలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. తర్వాత పుట్టగొడుగులు, పసుపు, ధనియాల పొడి, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు చింతచిగురు ముద్ద వేసి బాగా కలిపి కొంచెం మగ్గనిచ్చి దించాలి. వేడివేడిగా వడ్డించాలి. ఇది చపాతీల్లోకి, అన్నం లోకి కూడా బాగుంటుంది. కోనసీమ మష్రుమ్ వేపుడు కావలసినవి: పుట్టగొడుగులు- 200 గ్రా ఉల్లిపాయల పేస్టు- కప్పు; ఉప్పు- తగినంత కారం- తగినంత; నూనె- రెండు టేబుల్ స్పూన్లు అల్లంవెల్లుల్లి పేస్టు- ఒక టీ స్పూన్ కరివేపాకు- రెండు రెమ్మలు; పసుపు- ఒక టీ స్పూన్ కొత్తిమీర- ఒక కట్ట (తరగాలి) గరం మసాలా పొడి- అర టీ స్పూన్ ధనియాల పొడి - ఒక టీ స్పూన్ తయారీ: పుట్ట గొడుగులను ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఒక పెనంలో నూనె వేసి అందులో అల్లంవెల్లుల్లి పేస్టు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్టు వేసి మగ్గనివ్వాలి. ఇప్పుడు పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి మరికొంత సేపు వేగనివ్వాలి. ఇప్పుడు మష్రుమ్ ముక్కలు, గరం మసాలా పొడి, కరివేపాకు, కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టాలి. దీనికి నీరు పోయాల్సిన అవసరం లేదు. ఆవిరి మీదనే మష్రుమ్ ఉడుకుతుంది. ఇది సూప్‌లోకి స్నాక్‌గా బాగుంటుంది. మునగాకు మష్రుమ్ ఇగురు కావలసినవి: పుట్ట గొడుగులు- 200 గ్రా మునగ ఆకు- ఒక కప్పు ఉల్లిపాయ - ఒకటి (తరగాలి) ధనియాల పొడి- ఒక టీ స్పూన్ కారం- ఒక టీ స్పూన్; ఉప్పు- తగినంత నూనె- రెండు టేబుల్ స్పూన్లు కరివేపాకు- రెండు రెమ్మలు; కొత్తిమీర- ఒక కట్ట పచ్చిమిర్చి- నాలుగు (నిలువుగా చీరాలి) తయారీ: మునగ ఆకు, ఉల్లిపాయ, కొత్తిమీరలను కలిపి మిక్సీలో గ్రైండ్ చేయాలి. ఒక పెనంలో నూనె వేసి పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి. తర్వాత మిక్సీలో వేసిన మిశ్రమాన్ని వేసి కలపాలి. కొంచెం వేగిన తర్వాత పుట్ట గొడుగు ముక్కలు, ఉప్పు, కారం, ధనియాల పొడి, కొద్దిగా నీటిని వేసి బాగా కలిపి ఇగురుగా అయ్యాక దించాలి. -
చల్లదనంలో... తెల్లదనం..!
వర్షాకాలంలో చల్లదనం పెరిగేకొద్దీ చర్మం నల్లబడుతూ ఉంటుంది. కాళ్లూచేతుల విషయంలో ఈ సమస్య ఇంకా ఎక్కువ. దీన్నుంచి బయటపడాలంటే... ♦ పచ్చిపాలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి పాలలో దూదిని ముంచి, దాంతో కాళ్లూ చేతులూ బాగా రుద్దుకుని. ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. వారానికి రెండు మూడు సార్లు ఇలా చేస్తే చర్మం నల్లగా అవ్వదు. ♦ నారింజ తొక్కలను ఎండబెట్టి పొడి చేయాలి. దీనిలో పాలు కలిపి పేస్ట్‌లా చేయాలి. దీన్ని కాళ్లు, చేతులకు పట్టించి... ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ♦ ఓ చెంచాడు గంధపు పొడిలో చెంచాడు టొమాటో గుజ్జు, చెంచాడు నిమ్మరసం, చెంచాడు కీరాదోస రసం కలిపి కాళ్లు, చేతులకు రాసుకుని... పదిహేను నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ♦ నాలుగైదు బాదం గింజలను రాత్రి నీటిలో నానబెట్టాలి. ఉదయం తొక్క తీసేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఇందులో కొద్దిగా పాలు, కొన్ని చుక్కల నిమ్మరసం, చెంచాడు శెనగపిండి కలపాలి. ఈ మిశ్రమంతో కాళ్లనూ చేతులనూ బాగా తోముకుని తర్వాత స్నానం చేస్తే ఫలితముంటుంది. -
రోజూ తలస్నానం...
బ్యూటిప్స్ వానా కాలం శిరోజాలంకరణ మాత్రమే కాదు వాటి సంరక్షణ కూడా ఇబ్బందిగానే ఉంటుంది. నూనె పెడితే వర్షానికి తడిసి మరింత జిడ్డుగా మారుతుందని భయం. నూనె పెట్టకపోతే పొడిబారి వెంట్రుక లు చిట్లే అవకాశం ఉందని బాధ. ఈ కాలం శిరోజాల సౌందర్యం కాపాడుకోవాలంటే కొన్ని కనీస జాగ్రత్తలు పాటించాలి. ఈ కాలం రోజూ షాంపూ వాడచ్చా? అని చాలా మందికి సందేహంగా ఉంటుంది. గాఢ రసాయనాలు లేని హెర్బల్ షాంపూలను తలస్నానానికి రోజూ ఉపయోగించవచ్చు. తలస్నానం చేయడానికి రెండు గంటల ముందు సహజసిద్ధమైన నూనెను గోరువెచ్చగా చేసి వెంట్రుకల కుదుళ్లకు పట్టించి, మృదువుగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల కురులు మృదుత్వాన్ని కోల్పోవు. కాఫీ, టీ లలో ఉండే కెఫిన్ పదార్థాం వెంట్రుకలు రాలడం దోహదం చేస్తుంది. కాఫీ, టీలకు బదులుగా పండ్లరసాలు, పాలు, హెర్బల్ టీ... వంటి కెఫెన్ లేని ద్రవపదార్థాలను తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు వర్షాకాలంలో ఎదురయ్యే శిరోజాల సమస్యలను దూరం చేస్తాయి. -
పిట్ట గూడు.. దాని అందం చూడు
వానా కాలం వచ్చేసింది... వర్షం కురిస్తే మానవులు తడవని ప్రాంతానికి వెళ్లి తలదాచుకుంటారు... మరి పక్షులు ఏం చేస్తాయి అంటే... ఇప్పటి పిల్లలు, పట్టణ, నగర ప్రాంతాల్లో పెరిగిన పెద్దలూ టకీమని సమాధానం చెప్పడం కొంత కష్టమే... ఈ చిత్రాలను చూస్తే అర్థమవుతోంది కదూ.. పక్షులు గూళ్లు పెట్టుకుంటున్నాయని.. ఇవే వాటికి ఇళ్లు... వర్షం వస్తే వీటిలోకి వెళ్తాయి... ఇదంతా ఒక కోణం అయితే, మరో కోణంలో పక్షుల గూళ్లు అందంగా ఉంటాయి... చూడ ముచ్చటగా ఉంటాయి... ఇవి పల్లె ప్రాంతాలు, చెట్లు ఎక్కువ ఉన్న చోట్ల విరివిగా ఉంటాయి... సిద్దవటం మండలంలోని మాచుపల్లె పొలాల్లో పిచ్చుకలు గూళ్లు పెట్టుకుంటూ కనిపించాయి... ఈ అపు‘రూప’ దృశ్యాలను ‘సాక్షి’ తన కెమెరాలో గురువారం బంధించింది. - ఫొటోలు : - రమేష్ తీట్ల, సాక్షి, ఫొటో గ్రాఫర్ -
చి‘వరి’కి చుక్కెదురు!
♦ నల్లవాగు ప్రాజెక్టు కాల్వలు, తూములు అధ్వానం ♦ చివరి ఆయకట్టుకు నీటి సరఫరా ప్రశ్నార్థకం ♦ ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్న రైతన్నలు కల్హేర్: జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టు నల్లవాగు కింది ఆయకట్టు రైతన్నలకు కన్నీటి కష్టాలు తప్పేట్టు లేదు. కాల్వలు శిథిలస్థితికి చేరినా పట్టించుకునేవారు కరువయ్యారు. ఫలితంగా ప్రాజెక్టు చివరి ఆయకట్టుకు సాగునీరు అందని ద్రాక్షగా మారుతోంది. తుంది. ప్రస్తుతం వర్షకాలం ప్రారంభం కావడంతో రైతులకు ఖరీఫ్ బెంగ పట్టుకుంది. ప్రాజెక్టుపై ఆశలు వదులుకున్న రైతులు బోర్ల ద్వారా సాగు చేసే పరిస్థితి నెలకొంది. గతంలో కాల్వల మరమ్మతుల పేరిట నిధులు ఖర్చు చేసిన అధికారులు, కాంట్రాక్టర్లు స్వలాభం చూసుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రూ.14 కోట్లతో ప్రాజెక్టు కాల్వల సీసీ లైనింగ్ చేపట్టినా నాణ్యత లేకపోవడంతో శిథిలమయ్యాయి. పోచాపూర్, బీబీపేట, మార్డి, కృష్ణపూర్, అంతర్గాం తదితర చోట్ల కాల్వలు ధ్వంసమయ్యాయి. ఫలితంగా చివరి ఆయకట్టు పరిధిలోని కల్హేర్, మార్డి, ఇందిరానగర్, కృష్ణపూర్ గ్రామాల వరకు సాగు నీరు అందని పరిస్థితి నెలకొంది. నల్లవాగు ప్రాజెక్టును పూర్తిగా ఆధునికరిస్తామని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు గతంలో హామీ ఇచ్చారు. వర్షకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఇక ఇప్పట్లో పనులు జరిగే అవకాశమే లేదు. ప్రాజెక్టు నేపథ్యం నల్లవాగు ప్రాజెక్టు 1965లో రూ.90 లక్షలతో నిర్మాణం జరిగింది. అప్పటి సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి శీలం సిద్దారెడ్డి ప్రారంభించారు. పూర్తిస్థాయి నీటిమట్టం 1,493 ఫీట్లు. ప్రాజెక్టు కూడి కాల్వ పరిధిలోని సుల్తానాబాద్, గోసాయిపల్లి, పోచాపూర్, బీబీపేట, ఖానాపూర్(కె), కృష్ణపూర్, మార్డి, ఇందిరానగర్, కల్హేర్‌లో 4,100 ఎకరాల వరకు ఆయకట్టు ఉంది. ప్రాజెక్టు ఎమర్జెన్సీ కెనాల్ కింద 60 ఎకరాలు ఆయకట్టు ఉంది. ఎడమ కాల్వ పరిధిలోని బొక్కస్‌గాం, అంతర్గాం, నిజామాబాద్ జిల్లా మార్దండ, తిమ్మనగర్ గ్రామాల్లో 1,230 ఎకరాల వరకు ఆయకట్టు ఉంది. ప్రాజెక్టు కాల్వలకు చెందిన తూములు, సైఫాన్లు దెబ్బతిన్నాయి. కట్టపై పలుచోట్ల పగుళ్లు ఏర్పడమే కాకుండా ప్రాజెక్టులో పూడిక నిండింది. పూడిక కోసం అధికారులు హైడ్రాలికల్ సర్వే చేపట్టినా పూడికతీత జరగకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
'ఏపీలో 330 మండలాల్లో వర్షపాతం తక్కువ'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో 330 మండలాల్లో వర్షపాతం చాలా తక్కువగా ఉందని ఆ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కోస్తా జిల్లాలో వర్షపాతం మెరుగ్గా ఉందని, రాయలసీమలో తక్కువగా ఉందన్నారు. కోస్తాలో వరి పండించే రైతులు 1001, 1010 రకాల విత్తనాలు వేసుకోవాలని సూచించారు. వచ్చే నెల 5 నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు భరోసా యాత్ర చేపట్టనున్నారని చెప్పారు. అదేవిధంగా గ్రామాల్లో రుణమాఫీ జాబితా ప్రకటన వెల్లడిస్తారని మంత్రి ప్రత్తిపాటి పుల్లరావు పేర్కొన్నారు. -
హైదరాబాద్‌లో ఓ మోస్తరు వర్షం
హైదరాబాద్ సిటీ: నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారంరాత్రి 8 గంటల సమయంలో ఓ మోస్తరు నుంచి తేలిక వర్షం కురిసింది. వ నస్థలిపురం, దిల్సుఖ్నగర్, మలక్‌పేట, ఎల్బీనగర్ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. బంజారాహిల్స్, అమీర్‌పేట్, పంజాగుట్ట ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. -
ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అకాల వర్షం
సాక్షి న్యూస్‌నెట్‌వర్క్: ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో సోమవారం అకాల వర్షం కురిసింది. ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం సగటున 4 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలోని సిర్పూర్(యు)లో అత్యధికంగా 60 మిల్లీమీటర్లు, బజార్హత్నూర్లో అత్యల్పంగా 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బెల్లంపల్లి, తాండూరులో వర్షానికి మామిడి కాయలు రాలాయి. సుమారు 10 వేల ఎకరాల్లో నష్టం జరిగిందని అంచనా వేశారు. సిర్పూర్(టి) బెంగాలి క్యాంపులో సుమారు వంద ఎకరాల్లో ఉల్లి, కూరగాయల సాగు దెబ్బతింది. కౌటాలలో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంట తడిసింది. ఆసిఫాబాద్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో కురిసిన వర్షానికి జొన్న పంట తడిసింది. ఉదయం పూట వర్షం కురవడంతో పదో తరగతి పరీక్ష రాయడానికి వెళ్లే విద్యార్థులు ఇబ్బందులుపడ్డారు. కరీంనగర్ జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. మెట్పల్లి మార్కెట్ యూర్డులో రైతులు, అడ్తిదారులు ఆరబోసిన పసుపు తడిసిపోయింది. మండలంలో సుమారు ఎనిమిది వందల ఎకరాల్లో మామిడి పిందెలు రాలిపోయాయి. మండలంలో 16.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, సారంగాపూర్, రాయికల్, కథలాపూర్ మండలాల్లో కురిసిన వర్షానికి ఉడకబెట్టి ఆరబోసిన పసుపు తడిసిపోగా, వరి, నువ్వు పంటలు దెబ్బతిన్నాయి. వందలాది ఎకరాల్లో మామిడి పిందెలు నేలరాలాయి. జగిత్యాల మండలంలో దాదాపు లక్ష క్వింటాళ్ల వరకు ఉడుకబెట్టిన పసుపు తడిసినట్లు సమాచారం. మార్కెట్‌కు తీసుకువచ్చిన మొక్కజొన్న తడవడంతో వ్యాపారులు కొనుగోలు చేయలేదు. -
చైతన్యం ఇలా..
ఓ మహిళ చేతిలో కెమెరా ఉంటే... ఊళ్లోకి నీళ్లొస్తాయి. ఓ మహిళ రేడియో మైకు ముందు నిలబడితే... బడి మానేసిన పిల్లలు బడిబాట పడతారు. ఓ మహిళ చేతిలో కాగితం, కలం ఉంటే... నాలుగ్గోడల మధ్య నలిగే మహిళ కడగండ్లకు ఊరట కలుగుతుంది. ఇది నిజమా! అంటే... నిజంగా నిజమేనని ఆధారాలు చూపిస్తారు గుజరాత్ మహిళలు. అది గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ నగరానికి ముప్ఫై కిలోమీటర్ల దూరాన ఉన్న మణిపూర్ గ్రామం. అక్కడ ‘రుడి నో రేడియో’ అనే కమ్యూనిటీ రేడియో కేంద్రం ఉంది. వర్ష, జైమిని, విద్య, జల్పలతోపాటు అనేక మంది మహిళలు అక్కడ తమ తమ విధుల్లో నిమగ్నమై ఉన్నారు. వర్ష ఆ రేడియో ప్రసారాలకు వ్యాఖ్యాత. జల్ప స్థానిక జానపదాలను గానం చేసే గాయని. విద్య ఈ కార్యక్రమాలను రూపొందిస్తారు. జైమిని ఈ ప్రసారాలకు కావల్సిన సాంకేతిక సహకారాన్ని అందిస్తారు. వీరందరి కంటే ఎక్కువగా చూపరుల దృష్టిని ఆకర్షిస్తున్న మహిళ దమయంతి. ఆమె జాతీయ మహిళా పాత్రికేయుల సదస్సును (ఎన్డబ్ల్యుఎమ్ఐ) వీడియో కెమెరాలో చిత్రీకరిస్తున్నారు. ఒక జాతీయస్థాయి కార్యక్రమాన్ని సామాన్య గ్రామీణ మహిళ అధునాతనమైన కెమెరాతో సమర్థవంతంగా చిత్రీకరిస్తున్నారు. వీడియో కూర్పులో కూడా ఆమె నేర్పరి. అందరూ మహిళలే! ‘రుడి నో రేడియో’ కార్యక్రమాల రూపకల్పన, నిర్వహణ అంతా మహిళలే చూసుకుంటారు. అయితే... అసలు విషయం ఇది మాత్రమే కాదు. ఈ మహిళల్లో ఎవరూ పెద్ద చదువులు చదవలేదు. ఇంటి పనులు, వ్యవసాయ పనులను యథావిధిగా కొనసాగిస్తూ, రేడియో కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం వారెంచుకున్న మాధ్యమే ఈ కమ్యూనిటీ రేడియో, వీడియో కార్యక్రమాలు. ‘పది వాక్యాల్లో చెప్పలేని ఓ విషయాన్ని ఒక్క బొమ్మ ఇట్టే వివరిస్తుంది’- అంటున్నారు. శక్తిమంతమైన మాధ్యమం! మణిపూర్ గ్రామంతోపాటు పరిసరాల్లోని అనేక గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించింది ఈ కెమెరానే అంటారు కెమెరా ఉమన్ దమయంతి. ‘‘ ఊరి చివరన ఉన్న వ్యవసాయ బావుల నుంచి తాగునీటిని మోయాల్సి వచ్చేది. నీటి సౌకర్యం కల్పించమని గ్రామపెద్దను కోరాం. అతడు ఎంతకీ స్పందించకపోవడంతో ఒక రోజు నా కెమెరాకు పని చెప్పాను. అంతే! మా గ్రామానికి కుళాయిలు వచ్చేశాయి’’ అన్నారామె నవ్వుతూ. ఇంతకీ వారు ఏం చేశారంటే... తెల్లవారు జాము నుంచి మహిళలు నీటిని మోయడాన్ని చిత్రీకరించి స్థానిక కేబుల్ ద్వారా ప్రసారం చేశారు. ఆ ప్రసారాలు ప్రభుత్వ అధికారుల దృష్టికి చేరడంతో సమస్య తీరింది. సంఘటితంగా పని చేస్తే... ఇలా భట్ అనే సామాజిక సంస్కర్త ‘సేవ’ అనే వేదిక ద్వారా ఇచ్చిన ఆసరాతో ఈ మహిళలు చైతన్యవంతమయ్యారు. ఆ ఆసరాతో తమ జీవితాలకు ఒక రూపు తెచ్చుకుంటున్నారు. ‘ఇలా’ సేవకు గుర్తింపు! పద్మభూషణ్ (1986), పద్మశ్రీ(1985) రైట్ టు లైవ్లీ హుడ్ అవార్డు(1984) పార్లమెంట్ సభ్యురాలు (1986 - 1989) హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి డాక్టరేట్, ఇందిరా గాంధీ పీస్ ప్రైజ్ ( 2001) కుటుంబం... భర్త రమేశ్‌భట్, అమ్మాయి అమిమాయి, అబ్బాయి మిహిర్. అహ్మదాబాద్‌లో నివాసం .ఆమె రాసిన పుస్తకం...‘వియ్ ఆర్ పూర్ బట్ సో మెనీ...’. ఇది సేవా సంస్థలో స్వయంసాధికారత సాధించిన మహిళల జీవితాల ఆధారంగా సాగిన కథనం. -
వానమ్మా.. వానమ్మా..ఒక్కసారన్నా...వచ్చిపోవమ్మా...
నల్లగొండ అగ్రికల్చర్ :జిల్లాలో రోజురోజుకూ వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. చినుకు జాడ కనిపించకపోగా, కరువు తరుముకొస్తోంది. వానాకాలంలో కూడా ఎండాకాలాన్ని తలపించే విధంగా వాతావరణంలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వానలు లేక బోరుబావులలో నీరు ఇంకిపోతున్నది. విద్యుత్ కోతల కారణంగా వేసిన కొద్దిపాటి వరితోపాటు, పత్తిచేలు ఎండిపోయే పరిస్థితి దాపురించింది. పెట్టిన పెట్టుబడులు వస్తాయో రావోనన్న ఆందోళనలో రైతులు ఉన్నారు. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌లో సాధారణ వర్షపాతం 752.6 మిల్లీమీటర్లు కాగా, గత ఖరీఫ్‌లో 1073.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈసారి ఇప్పటివరకు కేవలం 42.6 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. దీంతో భూగర్భజలాలు పాతాళానికి పడిపోయాయి. అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణాన్ని బట్టి చూస్తే కనుచూపు మేరల్లో వర్షాలు కురిసే అవకాశాలు కనిపించడం లేదు. వరిచేలల్లో నెర్రెలు పారగా, పత్తి చేలు వాడిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. రోజూ అన్నదాతలు ఆకాశంవైపు చూస్తూ ఎండుతున్న పంటలను చూసి గుండెలు బాదుకుంటున్నారు. జిల్లాలో ఖరీఫ్సాగు విస్తీర్ణం 4,83,452 హెక్టార్లు కాగా, గత ఖరీఫ్‌లో రికార్డుస్థాయిలో 6,02,799 హెక్టార్లు సాగు అయ్యింది. అయితే ప్రస్తుత కరువు కారణంగా జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు కేవలం 2,92,000 హెక్టార్లలో రైతులు వివిధపంటలను సాగుచేశారు. అంటే కేవలం 61 శాతం మాత్రమే సాగైంది. వరి 46,639 హెక్టార్లు కాగా, పత్తి 2,22,000 హెక్టార్లలో సాగైంది. మిగతా వివిధ పంటలు సాగుచేశారు. నాన్‌ఆయకట్టు ప్రాంతాలలో సాగుచేసిన వరిపంటలో వర్షాభావ పరిస్థితులకు తోడు విద్యుత్ కోతల కారణంగా సగానికి సగం వరి చేలు నై వారి ఎండిపోతున్నాయి. పత్తి పంటలు కూడా సగానికి పైగా వాడిపోయి ఎర్రబారుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. సాగైన పంటలు కూడా చేతికి వచ్చే అవకాశాలు కనిపించకపోవడంతో అన్నదాతలలో ఆశలు సన్నగిల్లుతున్నాయి. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీరే పరిస్థితులు కానరాకపోవడంతో తీవ్ర ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. ఏది ఏమైనా వరుణుడు కరుణించి వర్షాలు కురిస్తే తప్ప పంటలు చేతికొచ్చే అవకాశమే లేదు.