చల్లదనంలో... తెల్లదనం..!
వర్షాకాలంలో చల్లదనం పెరిగేకొద్దీ చర్మం నల్లబడుతూ ఉంటుంది. కాళ్లూచేతుల విషయంలో ఈ సమస్య ఇంకా ఎక్కువ. దీన్నుంచి బయటపడాలంటే...
♦ పచ్చిపాలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి పాలలో దూదిని ముంచి, దాంతో కాళ్లూ చేతులూ బాగా రుద్దుకుని. ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. వారానికి రెండు మూడు సార్లు ఇలా చేస్తే చర్మం నల్లగా అవ్వదు.
♦ నారింజ తొక్కలను ఎండబెట్టి పొడి చేయాలి. దీనిలో పాలు కలిపి పేస్ట్‌లా చేయాలి. దీన్ని కాళ్లు, చేతులకు పట్టించి... ఆరిన తర్వాత కడిగేసుకోవాలి.
♦ ఓ చెంచాడు గంధపు పొడిలో చెంచాడు టొమాటో గుజ్జు, చెంచాడు నిమ్మరసం, చెంచాడు కీరాదోస రసం కలిపి కాళ్లు, చేతులకు రాసుకుని... పదిహేను నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.
♦ నాలుగైదు బాదం గింజలను రాత్రి నీటిలో నానబెట్టాలి. ఉదయం తొక్క తీసేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఇందులో కొద్దిగా పాలు, కొన్ని చుక్కల నిమ్మరసం, చెంచాడు శెనగపిండి కలపాలి. ఈ మిశ్రమంతో కాళ్లనూ చేతులనూ బాగా తోముకుని తర్వాత స్నానం చేస్తే ఫలితముంటుంది.