చలి... మరింత మృదువుగా!
బ్యూటిప్స్
చలి వల్ల గాల్లో తేమ తగ్గి పొడి చర్మం ఇంకా పొడిబారుతుంది. సరైన పోషణ లేకపోతే చర్మం వయసుకు మించి ముడతులు పడే అవకాశం ఉంది. ఈ సమస్యకు విరుగుడుగా...
గుడ్డులోని పచ్చ సొన
కోడిగుడ్డుపై పెంకు కొద్దిగా తొలగించి తెల్ల సొన ఒక పాత్రలో, పసుపు సొన మరో పాత్రలో వేయాలి. పసుపుసొనలో టీ స్పూన్ తేనె, టీ స్పూన్ పాల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, కనీసం 15 నిమిషాలైన ఉంచాలి. తర్వాత నీళ్లతో శుభ్రపరుచుకోవాలి,
రోజ్ వాటర్
ఒక చిన్న పాత్రలో రోజ్‌వాటర్ టీ స్పూన్, అంతే పరిమాణంలో తేనె కలిపి ముఖానికి రాసి, మృదువుగా మసాజ్ చేసి, తర్వాత శుభ్రపరచాలి. ఇది పొడి చర్మానికి సరైన చికిత్స. చర్మం త్వరగా శుభ్రపడుతుంది. కాంతి పెరుగుతుంది.
నూనెతో మర్దన!
కొబ్బరి నూనె, వంటనూనె, మర్దనా నూనెలలు చాలా వరకు ఇళ్లలో ఉంటాయి. ఈ మధ్యలో ఆలివ్ , ఆల్మండ్ ఆయిల్స కూడా ఆరోగ్యానికి, అందానికి ఉపయోగిస్తున్నారు. స్నానానికి ముందు ఏదైనా నూనెతో చర్మానికి పట్టించి, మర్దనా చేసుకోవాలి. గోళ్లకు కూడా మర్దనా చే సి, పది-పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. చర్మానికి తగినంత మాయిశ్చరైజర్ లభించి, ముందు పొడిగా ఉన్న చర్మం తర్వాత మృదువుగా మారిపోతుంది.
పండ్లు
బొప్పాయి, అరటిపండును గుజ్జు చేసి, ఈ రెంటిని కలపాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి పట్టించాలి. మృదువుగా మసాజ్ చేయాలి. తర్వాత శుభ్రపరుచుకోవాలి. పొడిబారిన చర్మాన్ని ఈ ప్యాక్ మృదువుగా మారుస్తుంది.