
కోస్తాంధ్ర, తెలంగాణలకు వర్షసూచన
విశాఖపట్నం: ఉత్తర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రెండు ఉపరితల ఆవర్తనాలు ఏర్పడ్డాయి. ఇవి నేడు అల్పపీడనంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆవర్తనాల ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణలో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు సైతం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.