వాయుగుండం ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు | IMD forecasts heavy rains in Telangana As low pressure bay of bengal | Sakshi
Sakshi News home page

బలపడుతున్న వాయుగుండం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు

Published Fri, Jul 19 2024 3:47 PM | Last Updated on Fri, Jul 19 2024 5:52 PM

IMD forecasts heavy rains in Telangana As low pressure bay of bengal

సాక్షి, హైదరాబాద్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. రాగల 24 గంటల్లో ఒడిశాలో తీరం దాటే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని హైదరాబాద్‌లోని వాతారణ కేంద్రం తెలిపింది. వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని, తెలంగాణపై దీని ప్రభావం నేడు, రేపు ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. హైదరాబాదులో సాయంత్రం మోస్తారు నుంచి తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఈ తీవ్ర వాయుగుండం కారణంగా తెలంగాణలో భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ  వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు శుక్రవారం రోజు అయిదు జిల్లాలు(కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం) జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలతోపాటు అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

రెడ్ అలెర్ట్ ప్రకటించిన జిల్లాల్లో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఇక భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలున్న కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అదే విధంగా ఆదిలాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ (భారీ వర్షాలు)జారీ చేసింది. మరోవైపు హైదరాబాద్‌ నగరంలో నేటి సాయంత్రం(శుక్రవారం)మోస్తారు నుంచి తేలికపాటి వర్షం కురిసే అకవాశం ఉందని పేర్కొంది.

మరోవైపు వాయుగుండగా బలపడిన అల్పపీడనం రేపు ఒడిశా తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఏపీలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు పడనున్నాయని పేర్కొంది. ఈ మేరకు కొస్తా జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, కృష్ణ, గుంటూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు..కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. తీరం వెంబడి అత్యధికంగా గంటకు 65 కిమీ వేగంతో గాలులు స్తుండటంతో వేటకు వెళ్ళారాదని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేసింది.

ఉత్తర కోస్తాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రమాదస్థాయిలో ఏలూరు జిల్లా వేలేరుపాడు జలాశయం ప్రవహిస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. 

TS రెడ్ అలర్ట్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement