రోజూ చూస్తూనే ఉన్నాం.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ అని.. ఇంతకీ వాటి అర్థం ఏంటో మీకు తెలుసా? పదండి తెలుసుకుందాం.
గ్రీన్ అలర్ట్
ఏదైనా ప్రాంతంలో 24 గంటల వ్యవధిలో 6.4 సెం.మీ. కన్నా తక్కువ వర్షం కురిసే అవకాశం ఉంటే వాతావరణ అధికారులు ఈ అలర్ట్ జారీ చేస్తారు. వాతావరణ పరిస్థితుల్లో రాబోయే మార్పుల గురించి గ్రీన్ అలర్ట్ తెలియజేస్తుంది. అయితే ఈ అలర్ట్ కింద ప్రజలకు ప్రత్యేకంగా హెచ్చరికలు జారీ చేయాల్సిన అవసరం ఉండదు.
ఎల్లో అలర్ట్
ఒక నిరీ్ణత ప్రదేశంలో 6.45 సెం.మీ. నుంచి 11.55 సెం.మీ. మధ్య వర్షం కురిసే అవకాశం ఉందన్న అంచనాతో దీన్ని జారీ చేస్తారు. ఈ అలర్ట్ జారీ చేశారంటే ప్రస్తుత వాతావరణం కాస్త ప్రతికూలంగా మారుతుందని అర్థం. 30–40 కి.మీ. వేగంతో గాలులు వీచే పరిస్థితి ఉంటే ఎల్లో అలర్ట్ ఇస్తారు. అంటే ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని.. పరిస్థితిని జాగ్రత్తగా గమనించాలని అధికార యంత్రాంగానికి సూచిస్తారు.
ఆరెంజ్ అలర్ట్
24 గంటల వ్యవధిలో 11.56 సెం.మీ. నుంచి 20.44 సెం.మీ. మధ్య వర్షం కురవొచ్చన్న అంచనాతో ఆరెంజ్‌అలర్ట్‌ను ఐఎండీ జారీ చేస్తుంది. 40 నుంచి 60 కి.మీ. వేగంతో గాలులు వీస్తూ తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నప్పుడు ప్రభుత్వ యంత్రాంగం లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఈ అలర్ట్‌ను విడుదల చేస్తుంది. ఆరెంజ్ అలర్ట్ జారీ అయిందంటే రవాణా సరీ్వసులపై ప్రతికూల వాతావరణం ప్రభావం చూపే అవకాశం ఉంటుందని అర్థం.
రెడ్ అలర్ట్
24 గంటల వ్యవధిలో ఒక ప్రాంతంలో 20.45 సెం.మీ.కుపైగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటే రెడ్ అలర్ట్ జారీ చేస్తారు. అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులను రెడ్ అలర్ట్ సూచిస్తుంది. రవాణా, విద్యుత్ సేవలకు అవాంతరాలు ఎదురవడంతోపాటు ప్రాణనష్టం కూడా సంభవించే అవకాశం ఉన్నప్పుడు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. రెడ్ అలర్ట్ ఇస్తే.. విపత్తు నిర్వహణ దళాలు, పోలీసులు, మున్సిపల్, రెవెన్యూ ఇతర శాఖల సిబ్బంది సహాయ చర్యలకు సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. గరిష్టంగా ఐదు రోజులపాటు ఆయా అలర్ట్‌లకు సంబంధించిన హెచ్చరికలు అమల్లో ఉంటాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. –సాక్షి, సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment