సంగారెడ్డి మున్సిపాలిటి: పారిశుద్ధ్యంపై దృష్టి సారించకుంటే వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.. ఇప్పటికైన అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తేగాని సమస్య పరిష్కారం కాదని మున్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మి పేర్కొన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండి పారిశుద్ధ్య చర్యలు వెంటనే చేపట్టాలని సూచించారు. సర్వసభ్య సమావేశం శనివారం స్థానిక పురపాలక సంఘం కార్యాలయంలో జరిగింది. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు
. కాగా వార్డుల అభివృద్ధి కోసం నిధులను కేటాయించడంలో పాలకవర్గ సభ్యులు పక్షపాతం చూపుతున్నారని ప్రతిపక్ష బీజేపీ సభ్యులు అరోపించారు. వార్డు కౌన్సిలర్లు బిపాష, మల్లేశం, జహెనాథ్‌బేగం, యాకూబ్‌అలీ, ఆరీఫ్‌లు పారిశుద్ధ్య సమస్యపై తీవ్రంగా స్పదించారు. అధికారులు ప్రతి రోజు వివిధ వార్డులను పరిశీలించాలని, వార్డుకు ముగ్గురు చొప్పున పారిశుద్ధ్య కార్మికులను కేటాయించాలని సభ్యులు సూచించారు. ఈ విషయమై ఇన్‌చార్జి కమిషనర్ స్పందిస్తూ తాను ఇప్పటికే పారిశుద్ధ్య సమస్యపై దృష్టి పెట్టినట్లు తెలతిపారు. అగస్టు1 నుంచి 14 వరకు స్పెషల్ డ్రైవ్ చేపడుతామని తెలిపారు
. 20వ వార్డు కౌన్సిలర్ ప్రదీప్ కరెంట్ ఆఫీస్ వెనుకవైపున రోడ్డు గుంతలు పడినందున వాటిని పూడ్చి వేయాలని సూచించారు. 19వ వార్డు కౌన్సిలర్ పద్మ కల్వకుంటలో బోర్‌వేసి 8 నెలలైనా ఇప్పటి వరకు మోటర్‌ను బిగించడం లేదన్నారు. తన వార్డులో ఎప్పుడు డ్రైనేజీలను క్లీన్ చేయడం లేదని, కార్మికులను అడిగితే మాత్రం తమకు రెండు నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్న పట్టించుకోరా? అంటూ తమనే నిలదీస్తున్నారని తెలిపారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మొదట ఆఎస్‌ఐకి బకాయిపడిన డబ్బులను చెల్లించామని, అందువల్లే వేతనాలు చేల్లించడంతో జాప్యం జరిగిందని కమిషనర్ వివరణ ఇచ్చారు.
పట్టణంలో దోమలు బెడద అధికంగా ఉందని మొదటి నుంచి ఫిర్యాదులు చేస్తున్న పట్టించుకోవడం లేదని వార్డు కౌన్సిలర్లు అధికారులను నిలదిశారు. ఇప్పటికే వర్షాకాలం ప్రారంభమైనందున దోమల నివారణ కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. 15వ వార్డు కౌన్సిలర్ జహినబ్‌బేగం తన వార్డు అభివృద్ధిపై పక్షపాతం చూపుతున్నారని అరోపించారు. కనీసం మీడియా అయిన తమ వార్డు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకోచ్చి పరిష్కరించేలా చూడాలని కోరారు. టౌన్‌ప్లానింగ్ విభాగంలో దరఖాస్తులు పెరిగిపోతున్నాయని అందుకు వివాదాలు లేని వాటికి అనుమతులు ఇవ్వాలని కౌన్సిలర్లు కోరగా తాను నిబంధనల ప్రకారం అనుమతులు పొందిన లేఅవుట్లలో వచ్చిన దరఖాస్తులకు మాత్రం అనుమతులు ఇస్తున్నామని కమీషనర్ వివరణ ఇచ్చారు.
జనరల్ ఫండ్‌లో కేవలం 15 వార్డులకు మాత్రమే నిధులు పెట్టారు మిగతా వాటికి ఎందుకు పెట్టలేదని 30వ వార్డు కౌన్సిలర్ సునీల్ అధికారులను ప్రశ్నించారు. ప్రతి వార్డుకు రెండు లక్షల చొప్పున జనరల్ ఫండ్ నుంచి వివిధ అవసరాల కోసం కేటాయించడం జరుగుతుందని చెర్‌పర్సన్ తెలిపారు. ఇప్పటికే రూ.7.50 కోట్లకు సంబంధించిన టెండర్ల పక్రియ పూర్తి చేసి వర్క్ అర్డర్లు ఇచ్చామన్నారు.
త్వరలోనే పనులు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. కాగా పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చి వారికి వచ్చిన పనులను రద్దు చేయాలని సభ్యులు తెలుపగా డిప్యూటి ఇంజనీర్ పర్యవేక్షణలో కాంట్రాక్టర్‌లతో సమావేశం నిర్వహించి చర్యలు తీసుకుంటామన్నారు. రంజాన్ పర్వదినం సందర్బంగా ఈద్గా వద్ద భారీ ఏర్పాట్లు చేసినందుకు గాను ఎంఐఎం కౌన్సిలర్లు మున్సిపల్ చెర్‌పర్సన్ విజయలక్ష్మి, ఇన్‌చార్జి కమిషనర్ వేంకటేశ్వర్లను, డిప్యూటి ఇంజనీర్, ఎఈలను ఈసందర్బంగా సన్మానించారు.