
చిటపట చినుకులను ఆనందించాలి. తడవకుండా మెరిసిపోవాలి. కొత్తగా ఉండాలి. స్టయిల్‌గా కనిపించాలి. మబ్బు పట్టిన సమయమైనా ముసురు పట్టిన రోజులైనా డ్రెస్‌కు అడ్రెస్‌గా ఉంటూ టెన్షన్ ఫ్రీగా గడిపేయాలనుకునేవారికి డిజైనర్ వాటర్ ప్రూఫ్ పాంచోస్ రెడీ టూ వేర్ గా ఆకట్టుకుంటున్నాయి.
వానల్లో తడవకుండా ఉండటానికి గొడుగు లేదా లాంగ్ జాకెట్స్ మనకు వెంటనే గుర్తుకువస్తాయి. అంతకు మించి వానకాలంలో స్టయిల్‌గా కనిపించాలనుకుంటే ఇంకేమీ లేవా అనుకునేవారికి వాటర్ ప్రూఫ్ పాంచోస్ మేమున్నామని గుర్తు చేస్తున్నాయి. సహజంగా వేసవి కాలాన్ని సౌకర్యంగా మురిపించిన సిల్క్ అండ్ కాటన్ పాంచోస్ ఇప్పుడు వానకాలాన్ని వాటర్‌ప్రూఫ్‌తో ముస్తాబు చేసుకొని వచ్చాయి.
పోల్కా డాట్స్, త్రీడీ ప్రింట్స్, లైన్స్, ఫ్లోరల్స్, యానిమల్ ప్రింట్స్‌తో ఆకట్టుకునే ఈ పాంచోస్ ఒక్కోరోజును ఒక్కో రంగుతో ఎంపిక చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్‌లైన్‌లోనూ అందుబాటులో ఉన్న ఈ పాంచోని డ్రెస్ కలర్‌ని బట్టి కూడా సెలక్ట్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment