
వైరల్: తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమీ వాడు గిట్టనేమి.. ఈ భూమ్మీద తల్లిదండ్రులను మించిన రక్షణ మరొకటి లేదు. కానీ, తల్లిదండ్రులంటే అపార గౌరవం, ప్రేమ.. అన్నింటికి మించి వాళ్ల ఆలనా పాలనా చూసుకునే అపర శ్రవణ కుమారులు ఈ కాలంలో అరుదైపోయారు. అలాంటిది.. తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలకు కనువిప్పు కలిగించే ఘటన ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఆ చిన్నారిది తోటి స్నేహితులతో ఆడిపాడే వయసు. కానీ, ఆ తల్లిదండ్రులిద్దరికీ చూపు లేదు. అందుకే వాళ్లకు కంటి పాప అయ్యింది. బడికి పోయే టైం తప్పించి.. మిగతా సమయంలో వాళ్ల వెంటే ఉంటూ నడిపిస్తోంది. సాయంత్రం పూట వాళ్లతో కలిసి.. చిరు తిండి తింటూ గడిపింది. ఆపై వాళ్లను అక్కడి నుంచి తీసుకెళ్లింది. ఆ వీడియోనే సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది.
యూనిఫామ్‌లో ఉన్న ఓ చిన్నారి వాళ్లకు చిరు తిండి అందిస్తూ కనిపిస్తోంది. ముంబైపై వీడియోలు తీసే మిత్ ఇందుల్కర్ అనే ఇన్‌ఫ్లెన్సర్.. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి పోస్ట్ అయిన ఈ వీడియో.. వ్యూయర్స్ దృష్టిని ఆకట్టుకుంది. ముంబై జాంగిద్, మీరా రోడ్‌లో రోడ్డు పక్కనే ఉన్న ఓ స్టాల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment