ఐసీడీఎస్ శిశుగృహ సంరక్షణలో చిన్నారులు
కాకినాడ సిటీ : కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో ఈ నెల ఏడున వదిలివేసిన మగశిశువు, 13న రాయుడుపాలెం అంగన్‌వాడీ పరిధిలో వదిలిన ఆడ శిశువును ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్థానిక శ్రీరామ్‌నగర్‌లోని శిశుగృహ సంరక్షణలో ఉంచారు. శిశువులకు సంబంధించిన తల్లిదండ్రులు కానీ, రక్త సంబంధీకులు కానీ నెల రోజుల్లో తగిన ఆధారాలతో జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఇన్‌చార్జి పీడీ టి.ప్రవీణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎవరూ రాకపోతే శిశువులను చట్టబద్ధంగా దత్తత ఇస్తారని చెప్పారు.