బ్యూటిప్స్
► సోంపు ఆకులను నీటిలో మరిగించి ఆ నీటితో తలస్నానం చేస్తే కేశాలు బాగా పెరుగుతాయి, మృదుత్వాన్ని సంతరించుకుంటాయి. రెండు లీటర్ల నీటిలో రెండు గుప్పెళ్ల సోంఫు ఆకులను వేసి మరిగించి దించాక కొంచెం సేపు కదిలించకుండా అలాగే ఉంచాలి. నీరు ఆకులలోని సుగుణాలను ఇముడ్చుకుంటుంది. ఈ నీటిలో ఒక టేబుల్ స్పూన్ వెనిగర్‌ను కలిపి తలస్నానం పూర్తయ్యాక జుట్టుకంతటికీ పట్టేటట్లు పోయాలి.
►చర్మం మీద నల్లటి మచ్చలుంటే బీర ఆకులను మెత్తగా పేస్టు చేసి అప్లయ్ చేయాలి. రోజుకు నాలుగైదు సార్లు చేస్తుంటే వారం రోజుల్లో మచ్చలు మాయమవుతాయి.
► చెమట వాసన శరీరం నుంచి దుర్గంధం వస్తుంటే బిల్వ ఆకులను మెత్తగా నూరి ఒంటికి పట్టించి అరగంట తర్వాత స్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే దుర్వాసన సమస్య తగ్గుతుంది.
► లెట్యూస్ ఆకులను(క్యాబేజీ లాగా ఉంటుంది, ఆకులు మరింత పలుచగా ఉంటాయి) గ్రైండ్ చేసి అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి పదిహేను నిమిషాల తర్వాత నీటితో కడగాలి. ఇది అదనపు జిడ్డును తొలగించి చర్మాన్ని తాజాగా ఉంచడంలో చక్కగా పని చేస్తుంది.