
నయనతార
వీలైనప్పుడల్లా ప్రేమ యాత్రలకు పయనమవుతారు లవ్‌బర్డ్స్ నయనతార, విఘ్నేష్ శివన్. ఈ ప్రేమజంట తాజాగా గ్రీస్‌లోని శాండోరిని దీవుల్లో ఫుల్‌గా హాలిడే టైమ్‌ని స్పెండ్ చేస్తున్నారు. ఈ వెకేషన్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు విఘ్నేష్. ‘‘ఎప్పటినుంచో ఇక్కడికి వెళ్దాం అనుకున్నాం. ఇప్పటికి కుదిరింది. డ్రీమ్ డెస్టినేషన్’’ అని పేర్కొన్నారు విఘ్నేష్. ఇక సినిమాల విషయానికి వస్తే... రజనీకాంత్ ‘దర్బార్’, విజయ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. అలాగే తెలుగులో చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘సైరా: నరసింహారెడ్డి’ సినిమాలో హీరోయిన్‌గా నటించారు నయన్. ఇక ఎప్పటిలాగానే తన ఉమెన్‌సెంట్రిక్ ఫిల్మ్స్‌లో నటించడం ఆపలేదు ఈ లేడీ సూపర్‌స్టార్. శివకార్తికేయన్ హీరోగా ఓ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు విఘ్నేష్ శివన్.
Comments
Please login to add a commentAdd a comment