
చత్తర్‌పూర్: అనుకోకుండా గ్రీజ్ పూసిన చేతితో తాకినందుకు ఓబీసీ కులానికి చెందిన ఓ వ్యక్తి తనకు మలం పూశాడంటూ మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ దళితుడు ఆరోపించడం కలకలం రేపుతోంది. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. దశరథ్ అహిర్వార్ అనే వ్యక్తి బికౌరా గ్రామంలో పంచాయతీ మురుగుకాల్వ నిర్మాణ పనులు చేస్తున్నాడు. సమీపంలోని చేతి పంపు వద్ద రామ్‌కృపాల్ పటేల్ స్నానం చేస్తున్నాడు.
గ్రీజ్ అంటిన చేతితో తాకడంతో ఆగ్రహించిన పటేల్ చేతిలోని మగ్గుతో మలాన్ని తీసుకువచ్చి అహిర్వార్ ముఖం, తల సహా ఒంటిపై రాశాడు. కులం పేరుతో దూషించాడు. పంచాయతీ పెద్దలు అహిర్వార్‌కు రూ.600 జరిమానా కూడా విధించారు. బాధితుడు కేసు పెట్టడంతో పటేల్‌పై కేసు నమోదయ్యాయి. వారు సరదాగా వస్తువులు విసిరేసుకున్నారు. అది కాస్తా ఇలా వికటించినట్టు విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు. కాగా, మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో గిరిజన యువకుడిపై ఒక వ్యక్తి మూత్రవిసర్జన చేసిన ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment