Hand pump handle
-
గ్రీజ్ అంటిన చేతితో తాకాడని.. దళితుడి ఒంటికి మలం రాశాడు!
చత్తర్‌పూర్: అనుకోకుండా గ్రీజ్ పూసిన చేతితో తాకినందుకు ఓబీసీ కులానికి చెందిన ఓ వ్యక్తి తనకు మలం పూశాడంటూ మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ దళితుడు ఆరోపించడం కలకలం రేపుతోంది. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. దశరథ్ అహిర్వార్ అనే వ్యక్తి బికౌరా గ్రామంలో పంచాయతీ మురుగుకాల్వ నిర్మాణ పనులు చేస్తున్నాడు. సమీపంలోని చేతి పంపు వద్ద రామ్‌కృపాల్ పటేల్ స్నానం చేస్తున్నాడు. గ్రీజ్ అంటిన చేతితో తాకడంతో ఆగ్రహించిన పటేల్ చేతిలోని మగ్గుతో మలాన్ని తీసుకువచ్చి అహిర్వార్ ముఖం, తల సహా ఒంటిపై రాశాడు. కులం పేరుతో దూషించాడు. పంచాయతీ పెద్దలు అహిర్వార్కు రూ.600 జరిమానా కూడా విధించారు. బాధితుడు కేసు పెట్టడంతో పటేల్‌పై కేసు నమోదయ్యాయి. వారు సరదాగా వస్తువులు విసిరేసుకున్నారు. అది కాస్తా ఇలా వికటించినట్టు విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు. కాగా, మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో గిరిజన యువకుడిపై ఒక వ్యక్తి మూత్రవిసర్జన చేసిన ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైన విషయం తెలిసిందే. -
ఇక్కడ స్నానం చేయకూడదు అన్నందుకే తలపై..
సాక్షి, హైదరాబాద్(అఫ్జల్‌గంజ్): అ చేతి పంపు వద్ద స్నానం చేయ వద్దన్నందుకు ఓ వ్యక్తిని రోకలితో మోది హత్య చేసిన సంఘటన మంగళవారం అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... నారాయణపేట జిల్లా, జలాల్పూర్ ప్రాంతానికి చెందిన పురుషోత్తం రెడ్డి (35) గత కొంత కాలం క్రితమే నగరానికి వచ్చాడు. చాదర్‌ఘాట్ వద్ద ఉన్న సాయి బాబా దేవాలయం వద్ద ఉంటూ ప్రసాదాలు, దాతలు ఇచ్చే ఆహారం తింటూ ఫుట్‌పాత్‌పై నివాసం ఉండేవాడు. కాగా మంగళవారం దేవాలయం సమీపంలో ఉన్న చేతి పంపు వద్ద నేపాల్‌కు చెందిన బహద్దూర్ (30) చేతులు శుభ్రం చేసుకుంటున్నాడు. అక్కడికి వెళ్లిన పురుషోత్తం రెడ్డి ఇక్కడ చేతులు కడుక్కోవద్దని అభ్యంతరం చెప్పాడు. ఈ విషయమై ఇరువురి మధ్య స్వల్ప వివాదం తలెత్తింది. దీంతో కోపోద్రిక్తుడైన బహద్దూర్ పురుషోత్తం రెడ్డిపై రోకలిబండతో బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే సుల్తాన్ బజార్ ఏసీపీ దేవేందర్, అఫ్జల్‌గంజ్ ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి, ఎస్సై మాన్సింగ్, క్లూస్ టీం, వేలిముద్రల నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆలయ పరిసరాల్లోని సీసీ టీవి పుటేజీని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. హత్యకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: అత్తతో తగాదా.. అశ్లీల ఫొటోలు పంపి బ్లాక్మెయిల్ -
పాపం మూగజీవి.. చోద్యం చూడకపోతే సాయం చేయొచ్చుగా
-
మనిషిని అనుకరించిన ఏనుగు.. ఏకంగా తొండంతో
రోజు రోజుకి వేసవి తీవ్రత అధికమవుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మనుషులతో పాటు జంతువులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉదయం ఏడు గంటలకే సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. వేసవి తాపానికి ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరడం లేదు. మన పరిస్థితే ఇలా ఉంటే ఇక నోరులేని జంతువుల సంగతి చెప్పక్కర్లేదు. అడవిలో నీరు దొరక్క.. జనవాసంలోకి వస్తున్నాయి మూగ జీవులు. ఈ క్రమంలో దాహంతో అల్లాడుతున్న ఏనుగు.. స్వయంగా చేతి పంపు కొట్టుకుని.. నీరు తాగుతున్న వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దాహం తీర్చుకోవడం కోసం గజరాజు ఇన్ని తిప్పలు పడుతుంటే.. ఆ పక్కనే కొందరు కూర్చుని చోద్యం చూశారు.. తప్ప దానికి సాయం చేయలేదు. ఈ దృశ్యాలు చూసిన నెటిజనులు ‘‘మీకు కొంచెం కూడా మానవత్వం లేదా.. పాపం మూగ జీవి నీటి కోసం అల్లాడుతుంటే.. చోద్యం చూస్తారా’’ అని విమర్శిస్తున్నారు. ఇక ఈ వీడియోలో దాహంతో ఉన్న ఏనుగు చేతి పంపు దగ్గరకు వచ్చింది. నీరు ఎలా తాగాలో అర్థం కాలేదు. వెంటనే దానికి మనుషులు చేతి పంపును ఎలా వాడతారో గుర్తుకు వచ్చినట్లుంది. దాంతో అది కూడా తన తొండతో చేతి పంపు కొట్టి.. నీరు తాగి తన దాహం తీర్చుకుంది. అయితే ఏనుగు ఇంత కష్టపడుతుంటే.. పక్కనే ఉన్న ముగ్గురు వ్యక్తులు చోద్యం చూశారు తప్ప దానికి సాయం చేయలేదు. ఈ వీడియో చూసిన నెటిజనులు ఏనుగు సమయస్ఫూర్తిపై ప్రశంసలు.. ఆ వ్యక్తులపై విమర్శలు చేస్తున్నారు. చదవండి: ‘‘కన్నీరాగడం లేదు.. జీవితాంతం వెంటాడుతుంది’’ -
రైతుల శ్రమ తగ్గించాడు
పరిగి: చదువున్నా.. లేకున్నా అనుభవాలు పాఠాలు నేర్పుతాయనటానికి మెకానిక్ వెంకటేష్‌ను నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 7వ తరగతి వరకు మాత్రమే చదివిన ఆయన తన వృత్తిలో అనుభవాలను రంగరించి సొంత పరిజ్ఞానంతో రైతుల శ్రమను తగ్గించేందుకుఓ సరికొత్త పరికరాన్ని తయారు చేశాడు. దోమ మండలం కమ్మం నాచారం గ్రామానికి చెందిన వెంకటేష్ (27) పరిస్థితులు అనుకూలించక 7వ తరగతితోనే చదువు మానేశాడు. అనంతరం కూలిపనులు, చేను పనులు చేసేవాడు. అనంతరం తెలిసిన వారి దగ్గర మోటార్ వైండింగ్ మెకానిక్ నేర్చుకున్నాడు. పరిగిలో ఓ దుకాణం ఏర్పాటు చేసుకుని తన వృత్తి కొనసాగిస్తున్నాడు. రైతుల బోరుబావుల్లోంచి పాడైన మోటార్లు తీయడటం, వాటిని బాగుచేసి మళ్లీ బోరుబావుల్లో దించటం చేస్తుంటాడు. ఈ సమయంలో 10 మంది అతికష్టమ్మీద బోరుబావుల్లోంచి పైపులు, మోటార్లను తీయాల్సివస్తోంది. మోటార్ తీయాల్సిన ప్రతిసారి రైతులు 10 మంది కూలీలను వెతుక్కోవాల్సి ఉంటుంది. కూలిడబ్బులు కూడా భారంగా మారుతు న్నాయి. రైతులకు ఎంతో ఇబ్బందిగా మారుతోంది. ఈ పనిని సులువుగా మార్చేందుకు వెంకటేష్‌కు ఓ ఆలోచనతట్టింది. కొత్త పరికరం తయారీకి శ్రీకారం.. చేతిపంపు హ్యాండిల్ పైకి కిందకు కదపటం ద్వారా ఎంతో లోతులో ఉన్న నీరు పైకి ఉబికి వ చ్చే సూత్రాన్ని వినియోగించి అలాంటిదే ఓ కొత్త పరికరం తయారు చేశాడు. కొన్ని పైపులు ఒక దగ్గర చేర్చి వాటికి వెల్డింగ్ చేసి పరికరంగా మార్చాడు. తయారు చేసిన పరికరంతో ఒకరు మాత్రమే పట్టుకుని హ్యాండిల్‌ను పైకి కిందకు అంటుంటే పైపులు, మోటారుతో సహా పైకి వస్తాయి. ఇవి పైకి వచ్చే క్రమంలో వాటిని టైట్ చేస్తూ పైకి లాగేందుకు మరొకరు అవసరం అవుతారు. ఇలా 10 మంది చేసే పనిని ఈ పరికరం వినియోగించి ఇద్దరు వ్యక్తులే సులువుగా చేయగలుగుతున్నారు. దీంతో రైతులకు మోటార్ పైకి లాగేటప్పుడు బాగు చేశాకా మళ్లీ దించే సమయంలో రూ. 2 వేల నుంచి 3 వేల వరకు ఖర్చు తగ్గుతుందని వెంకటేష్ పేర్కొంటున్నాడు. మోటార్‌ను వెలికితీసేందుకు పరికరం అవసరమైన రైతులు వెంకటేష్‌తోనే ఈ పనిని కానిస్తున్నారు. కూలిడబ్బులు, శ్రమను తగ్గించేలా పరికరాన్ని కనుగొన్న వెంకటేష్‌ను పలువురు రైతులు అభినందిస్తున్నారు.