upper caste comments
-
గ్రీజ్ అంటిన చేతితో తాకాడని.. దళితుడి ఒంటికి మలం రాశాడు!
చత్తర్‌పూర్: అనుకోకుండా గ్రీజ్ పూసిన చేతితో తాకినందుకు ఓబీసీ కులానికి చెందిన ఓ వ్యక్తి తనకు మలం పూశాడంటూ మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ దళితుడు ఆరోపించడం కలకలం రేపుతోంది. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. దశరథ్ అహిర్వార్ అనే వ్యక్తి బికౌరా గ్రామంలో పంచాయతీ మురుగుకాల్వ నిర్మాణ పనులు చేస్తున్నాడు. సమీపంలోని చేతి పంపు వద్ద రామ్‌కృపాల్ పటేల్ స్నానం చేస్తున్నాడు. గ్రీజ్ అంటిన చేతితో తాకడంతో ఆగ్రహించిన పటేల్ చేతిలోని మగ్గుతో మలాన్ని తీసుకువచ్చి అహిర్వార్ ముఖం, తల సహా ఒంటిపై రాశాడు. కులం పేరుతో దూషించాడు. పంచాయతీ పెద్దలు అహిర్వార్కు రూ.600 జరిమానా కూడా విధించారు. బాధితుడు కేసు పెట్టడంతో పటేల్‌పై కేసు నమోదయ్యాయి. వారు సరదాగా వస్తువులు విసిరేసుకున్నారు. అది కాస్తా ఇలా వికటించినట్టు విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు. కాగా, మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో గిరిజన యువకుడిపై ఒక వ్యక్తి మూత్రవిసర్జన చేసిన ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైన విషయం తెలిసిందే. -
అగ్రవర్ణాల వాళ్లంటే విదేశీయులు: బీహార్ సీఎం
బీహార్ ముఖ్యమంత్రి జీతన్ రాం మాంఝీ మరో వివాదానికి తెరదీశారు. అగ్రవర్ణాల వాళ్లంటే విదేశీయులని, ఆర్యుల సంతతి వారసులని వ్యాఖ్యానించారు. దాంతో ఆయనపై బీజేపీ మండిపడింది. రాష్ట్రంలో కులపరమైన విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించింది. అగ్రవర్ణాల వాళ్లు విదేశాల నుంచి ఇక్కడికొచ్చారని మాంఝీ వ్యాఖ్యానించారు. బెట్టాయ్ ప్రాంతంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కేవలం గిరిజనులు, దళితులు మాత్రమే ఈ దేశం వాళ్లని ఆయన అన్నారు. వాళ్లకు చదువు సంధ్యలు నేర్పించి, రాజకీయ అవగాహన కల్పించాలని, బీహార్ రాష్ట్రంలో ప్రభుత్వాల ఏర్పాటులో వాళ్లు కీలక పాత్ర పోషించేలా చూడాలని మాంఝీ చెప్పారు. అయితే, మాంఝీ వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా స్పందించింది. పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ సీఎం వ్యాఖ్యలను ఖండించారు. వాటివల్ల బీహార్‌లో కులపరమైన విద్వేషాలు రెచ్చగొట్టినట్లవుతోందని అన్నారు.