
చంద్రుడిని చూశారుగా? ఎంత పెద్దగా కనిపిస్తున్నాడో కదా! ఇంత పెద్దగా ఎలా కనిపిస్తున్నాడని సందేహం వచ్చే ఉంటుంది కదా. చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చే రోజు, పౌర్ణమి రెండూ ఒకేరోజు వస్తే ఇలా పెద్ద ఆకారంలో చంద్రుడు కనిపిస్తాడు. దీన్నే ‘సూపర్ మూన్’అంటారు. ఈ సమయంలో చంద్రుడు మామూలు కన్నా 14 శాతం పెద్దగా, 30 శాతం ప్రకాశవంతంగా ఎరుపు, కాషాయం రంగుల్లో మెరుస్తుంటాడు. ఇంతకీ ఫొటో ఎక్కడ తీశారో చెప్పలేదు కదా. ఇటీవల గ్రీస్‌లోని కేప్ ఆఫ్ సౌనియన్ ప్రాంతంలో తీశారు. ఇక్కడ కనిపిస్తున్న కట్టడంపేరు టెంపుల్ ఆఫ్ పొసెయ్‌డన్.
చదవండి: ప్రాణాలకు తెగించి మరీ సింహంతో పోరాడిన కుక్క: వైరల్
Comments
Please login to add a commentAdd a comment