super Moon
-
వీడియో: ఆకాశంలో అద్భుతం.. కనువిందు చేసిన చంద్రుడు
సాక్షి, హైదరాబాద్: ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. దేశంలో అరుదైన సూపర్ బ్లూ మూన్ కనువిందు చేసింది. రాఖీ పౌర్ణమి పండుగ వేళ రోజులా కాకుండా నేడు చంద్రుడు పెద్దగా, కాంతివంతంగా దర్శనమిచ్చాడు. చంద్రుడు భూమికి అత్యంత సమీపంలోకి వచ్చినప్పుడు పౌర్ణమి రావడంతో ఈ అద్భుతం కనిపించింది. కాగా, నేడు చంద్రుడు భూమికి 3,57,244 కిలోమీటర్ల దూరంలో కనిపించాడు. ఇక, బ్లూమూన్ అంటే చంద్రుడు బ్లూ కలర్లో కాకుండా నారింజ రంగులో దర్శనమిచ్చాడు. అయితే, ఇది ఈ నెలలో కనిపించే రెండో ఫుల్ మూన్. ఆగస్టు 1న తొలి పౌర్ణమి నాడు బ్లూ మూన్ కనిపించింది. కాబట్టి నేడు కనిపించే చంద్రుడిని సూపర్ బ్లూ మూన్‌గా పిలుస్తున్నారు. సాధారణంగా ఏడాదిలో రెండు లేదా మూడు సూపర్ మూన్‌లు ఏర్పడుతుంటాయి. #WATCH | Bihar: A super blue moon lights up the sky; visuals from Patna. pic.twitter.com/Fe9XDrg5g1 — ANI (@ANI) August 30, 2023 బ్లూ మూన్ అంటే..? బ్లూ మూన్ అంటే చంద్రుడు బ్లూలో కనిపించడం కాదు. ఒకే నెలలో రెండోసారి ఏర్పడే పున్నమి చంద్రుడిని బ్లూ మాన్‌గా పిలుస్తుంటారు. ఒకే నెలలో బ్లూ మూన్, సూపర్ మూన్‌లు దర్వనమివ్వడం అరుదనే చెప్పాలి. ఇప్పుడు కనిపించే సూపర్ బ్లూ మూన్ నాలుగు పౌర్ణమిలతో కూడిన సీజన్లో అదనపు చంద్రుడు. బుధవారం ఏర్పడిన బ్లూ మూన్ ప్రత్యేకమైనది. సాధారణంగా పౌర్ణమి రోజుల కంటే సూపర్ మూన్ సమయంలో చంద్రుడు మరింత ప్రకాశవంతంగా కనిపించడంతో పాటు భారీ పరిమాణంలో కనిపిస్తాడు. సాధారణ రోజుల కంటే 16 శాతం వెన్నెలను పంచబోతున్నాడు. VIDEO | Visuals of Super Blue Moon from Patna, Bihar.#supermoon #SuperBlueMoon #SUPERBLUEMOON2023 pic.twitter.com/5u3l7mYiFD — Press Trust of India (@PTI_News) August 30, 2023 అరుదుగా బ్లూ సూపర్ మూన్ బ్లూ సూపర్ మూన్ చాలా అరుదుగా వస్తుంది. ఖగోళ పరిస్థితుల కారణంగా ప్రతీ పది సంవత్సరాలకు మాత్రం ఇలాంటిది వస్తుందని నాసా తెలపింది. ఒక్కోసారి బ్లూ సూపర్ మూన్ రావడానికి ఇరవై సంవత్సరాలు కూడా పట్టొచ్చని పేర్కొంది. చివరిసారిగా బ్లూ బూన్ 2009 డిసెంబర్లో ఏర్పడింది. మళ్లీ 2037 జనవరిలో బ్లూ మూన్ కనపించనుందట.. మరొకటి మార్చిలో దర్శనమివ్వనుంది. అంటే మళ్లీ 14 సంవత్సరాల వరకు చూడలేరని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: కౌలు రైతులకు రైతు భరోసా.. నిధులు జమ చేయనున్న సీఎం జగన్ -
ఆకాశంలో అద్భుతం.. మళ్లీ 'సూపర్ మూన్'.. ఎప్పుడంటే?
వాషింగ్టన్: ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఈ ఆషాడ పౌర్ణిమ రోజున చంద్రుడు.. భూమికి అత్యంత దగ్గరగా రానున్నాడు. ఈ జులై 13న 'సూపర్‌మూన్' కనువిందు చేయనుంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు ఈ అద్భుతాన్ని దర్శించుకోనున్నాయి. నిండు చంద్రుడిని బక్ సూపర్ మూన్, థండర్ మూన్, హేమూన్, మెడ్ మూన్ అని కూడా పిలుస్తారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకారం.. జులై 13న ఈ సూపర్ మూన్ కనిపించనుంది. మధ్యాహ్నం 2.38 గంటలకు ఆ అద్భుతం కనిపించనుందని నాసా తెలిపింది. అయితే.. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి 12.08 గంటలకు అంటే జులై 14న కనిపించనుంది. ఇలా భూమికి అత్యంత సమీపంలోకి వచ్చిన నిండైన చంద్రుడిని మూడు రోజుల పాటు చూడొచ్చు. మంగళవారం తెల్లవారుజాము నుంచి శుక్రవారం తెల్లవారు వరకు కనువిందు చేయనుంది జాబిల్లి. సూపర్ మూన్ అంటే ఏమిటి? తన కక్షలో తిరుగుతున్న చంద్రుడు భూమికి అత్యంత సమీపంలోకి వచ్చినప్పుడు నిండుగా, అతిపెద్దగా కనిపిస్తుంది. దానినే సూపర్‌మూన్‌గా పిలుస్తారు. ఖగోళ శాస్త్రవేత్త రిచర్డ్ నొల్లే 1979లో ఈ సూపర్ మూన్ అనే పదాన్ని మొదటి సారి ఉపయోగించారు. ఒక ఏడాదిలో మూడు, నాలుగు సార్లు ఇలా సూపర్‌మూన్ ఏర్పడుతుంది. దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతూ భూమిని 27 రోజుల్లో చూట్టివస్తాడు చంద్రుడు. అలా అత్యంత సమీపంలోకి వచ్చినప్పుడు ఆ స్థానాన్ని పేరీజీ అంటారు. భూమి నుంచి 3,63,300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అత్యంత దూరంలోని స్థానాన్నిఅపోజీగా పిలుస్తారు. అది 4,05,500 కిలోమీటర్ల దూరం ఉంటుంది. భూమికి అత్యంత సమీపానికి వచ్చినప్పుడు సాధారణం కంటే 17శాతం పెద్దగా, 30 శాతం ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తాడు చంద్రుడు. ఇలా సూపర్‌మూన్ ఏర్పడిన సమయంలో సముద్రం ఎక్కువగా ఆటుపోట్లకు గురవుతుంటుంది. గత నెల జూన్‌లో సంభవించిన సూపర్‌మూన్‌ను స్ట్రాబెరీ మూన్‌గా వ్యవహరించారు. ఇదీ చదవండి: 10 నెలలు.. 9 దేశాలు.. 6,500 కిలోమీటర్లు నడిచి 'హజ్' యాత్ర -
చంద్రుడిని చూశారుగా? ఎంత పెద్దగా కనిపిస్తున్నాడో.. ఎక్కడో తెలుసా!
చంద్రుడిని చూశారుగా? ఎంత పెద్దగా కనిపిస్తున్నాడో కదా! ఇంత పెద్దగా ఎలా కనిపిస్తున్నాడని సందేహం వచ్చే ఉంటుంది కదా. చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చే రోజు, పౌర్ణమి రెండూ ఒకేరోజు వస్తే ఇలా పెద్ద ఆకారంలో చంద్రుడు కనిపిస్తాడు. దీన్నే ‘సూపర్ మూన్’అంటారు. ఈ సమయంలో చంద్రుడు మామూలు కన్నా 14 శాతం పెద్దగా, 30 శాతం ప్రకాశవంతంగా ఎరుపు, కాషాయం రంగుల్లో మెరుస్తుంటాడు. ఇంతకీ ఫొటో ఎక్కడ తీశారో చెప్పలేదు కదా. ఇటీవల గ్రీస్‌లోని కేప్ ఆఫ్ సౌనియన్ ప్రాంతంలో తీశారు. ఇక్కడ కనిపిస్తున్న కట్టడంపేరు టెంపుల్ ఆఫ్ పొసెయ్డన్. చదవండి: ప్రాణాలకు తెగించి మరీ సింహంతో పోరాడిన కుక్క: వైరల్ -
ఒకేసారి సూపర్ మూన్.. చంద్ర గ్రహణం
న్యూఢిల్లీ: ఆకాశంలో మరో అద్భుతానికి వేళయింది. ఓ వైపు సంపూర్ణ చంద్ర గ్రహణం, మరోవైపు సూపర్ మూన్ ఒకేసారి దర్శనమివనున్నాయి. ప్రాంతాన్ని బట్టి ఆదివారం అర్ధరాత్రి లేదా సోమవారం వేకువజామున ఇది చోటుచేసుకోనుంది. సుమారు మూడు గంటల పాటు కొనసాగే ఈ దృశ్యం ఆసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రాంత ప్రజలకు కనిపించదు. ఉత్తర, దక్షిణ అమెరికా, ఐస్లాండ్, గ్రీన్లాండ్, స్వీడన్, నార్వే, బ్రిటన్, పోర్చుగల్ , ఫ్రాన్స్, స్పెయిన్ తదితర దేశాల్లో ఈ సంపూర్ణ చంద్రగ్రహణం, సూపర్‌మూన్‌లను పూర్తిగా వీక్షించొచ్చు. 2019, 20 సంవత్సరాల్లో చోటుచేసుకోబోతున్న ఏకైక సంపూర్ణ చంద్రగ్రహణం ఇదే. చంద్రుడు భూమికి సమీపంగా రావడం వల్ల సాధారణం కన్నా ప్రకాశవంతంగా మెరుస్తూ సూపర్‌మూన్‌లా కనిపిస్తాడు. ఈ ఏడాది మరో రెండు సూపర్ మూన్‌లు కనిపించనున్నాయి. -
వావ్.. సూపర్ మూన్
-
కనువిందు చేసిన సూపర్ బ్లూ బ్లడ్‌మూన్
-
150 ఏళ్ల తర్వాత అద్భుతం
-
నేడే సూపర్ బ్లూ బ్లడ్ మూన్
న్యూఢిల్లీ: సుమారు 150 ఏళ్ల తర్వాత ఆకాశంలో నేడు ఒక అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. సూపర్‌మూన్, బ్లూమూన్, సంపూర్ణ చంద్రగ్రహణం మూడు కలసి కనువిందు చేయబోతున్నాయి. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా భూమి పూర్తిగా నీడలోనే ఉండిపోనుండటంతో జాబిల్లి ముదురు ఎరుపురంగులో (బ్లడ్‌మూన్‌గా) కనిపించనుంది. సాయంత్రం 4.21 గంటలకు ప్రారంభమై రాత్రి 7.37 గంటల వరకు ఆసియా, తూర్పు రష్యా, మధ్య ప్రాచ్యప్రాంతం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ఈ ఖగోళ వింత చోటుచేసుకోనుంది. అమెరికా పశ్చిమ ప్రాంతంలో ఇది మరింత బాగా కనపడవచ్చు. భారత్ వ్యాప్తంగా... మన దేశంలోనూ సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని వీక్షించొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చందమామపై పాక్షిక నీడ లేదా భూమికి చెందిన పెన్యుంబ్రా నీడతో ఇది భారత్‌లో సాయంత్రం 5.20కి ప్రారంభమవుతుంది. ప్రధాన గ్రహణం మాత్రం సూర్యాస్తమయం తర్వాత 6.25 నిమిషాలకు ప్రారంభమై, తూర్పు వైపు ఆకాశంలో కనిపిస్తుంది. ఆ తర్వాత జాబిల్లి వెండి రంగులోకి మారుతుంది. కొన్ని నిమిషాల తరువాత మొత్తం నీడ పరచుకుంటుంది. రాత్రి 7.25 గంటల నుంచి దాని పరిమాణం క్రమంగా తగ్గుతూ ఉంటుంది. దీనిని నెలలో రెండో నిండుపున్నమి లేదా నీలవర్ణ చంద్రుడిగా (బ్లూమూన్)గా పిలుస్తారు(జనవరి 1న తొలి పౌర్ణమి ఏర్పడింది). బ్లూమూన్ సందర్భంగా నదులు, సముద్రాల్లో అలలు కొంచెం ఎత్తులో ఎగిసిపడతాయని, దీని వల్ల భయపడాల్సిందేమీ లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూపర్‌మూన్... చంద్రుడు గుండ్రంగా ఒక స్థిరకక్ష్యలో కాకుండా కొంచెం అటూ ఇటూగా (అప్సిడల్ ప్రిసిషన్)లో భ్రమిస్తుండటంతో కొన్ని పర్యాయాలు భూమికి కొంత సమీపంగా వస్తాడు. ఇలాంటి సందర్భాల్లో... పున్నమి రోజుల్లో సూర్యుడికి ఎదురుగా వస్తాడు. ఈ కారణంగా చంద్రుడి పరిమాణం పెరిగినట్లుగా అనిపిస్తుంది. ఈ విధంగా పౌర్ణమినాడు చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చినపుడు ‘సూపర్‌మూన్’ అని పిలుస్తారు. భూమండలానికి సమీపంగా రావడం వల్ల చంద్రుడు కొంచెం పెద్దగా, మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాడు. సాధారణంగా కనిపించే జాబిల్లితో పోల్చితే ఇది 30 శాతం పెద్దదిగా, రోజు కనిపించే దాని కంటే 14 శాతం ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తాడని సైంటిస్టులు వెల్లడించారు. ఆకాశంలో చోటుచేసుకునే ఈ అరుదైన అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు ప్రత్యేకమైన బైనాక్యులర్లు, టెలిస్కోప్‌ల అవసరం లేదని, మామూలుగా అందరూ చంద్రుడిని చూసినట్టే ఎలాంటి ఉపకరణాలు లేకుండా చూడొచ్చునని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మరో సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చే జూలై 27న ఏర్పడనుందని, అది బ్లూ లేదా సూపర్‌మూన్ మాత్రం కాదని వారు తెలిపారు. ఎప్పుడు, ఎక్కడెక్కడ... తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నంలో సూపర్ బ్లూబ్లడ్ మూన్‌ను ముందుగా వీక్షించొచ్చు. హైదరాబాద్ ప్రజలు సంపూర్ణ చంద్రగ్రహణాన్ని మొత్తం చూసే అవకాశముంది. దేశవ్యాప్తంగా అయితే ఈశాన్య రాష్ట్రాలతో పాటు కోల్‌కతా ప్రజలు ఈ అద్భుతాన్ని అందరికన్నా ముందు చూడొచ్చు. చంద్రోదయం..అరుణాచల్‌ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌లో సాయంత్రం 4.47 గంటలకు, కోల్‌కతా–5.16, పట్నా–5.25, ఢిల్లీ–5.53, చెన్నై–6.04, ముంబై–6 గంటల 27 నిమిషాలకు జరగనుంది. -
సూపర్ మూన్ అద్భుత దృశ్యం!
-
సూపర్ మూన్
సిటీలో సూపర్ మూన్ దృశ్యాన్ని చిన్నారులు ఆనందంగా వీక్షించారు. ప్లానెటరీ సొసైటీ ఇండియా, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం నెక్లెస్‌రోడ్ సంజీవయ్య పార్కులోని ఎత్తైన జాతీయ జెండా వద్ద వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు సూపర్ మూన్‌ను వీక్షింప చేశారు. ప్లానెటరీ సొసైటీ ఇండియా డెరైక్టర్ రఘునందన్ కుమార్, టీఎస్సీవోఎస్టీ మెంబర్ సెక్రటరీ నాగేష్ కుమార్‌లు మాట్లాడుతూ చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చి 14శాతం పెద్దగా, 30శాతం కాంతివంతంగా కనిపించే అరుదైన రోజని తెలిపారు. -రాంగోపాల్‌పేట్ -
సూపర్ మూన్ అద్భుత దృశ్యం!
న్యూయార్క్: ఆకాశంలో సోమవారం సాయంత్రం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రతి పౌర్ణమి రోజు కంటే ఈ సారి చంద్రుడు (సూపర్ మూన్) అత్యంత పెద్దగా, ప్రకాశవంతంగా కనిపించడంతో పాటు భూమికి దగ్గరగా వచ్చాడు. 1948లో ఇదే తరహాలో చంద్రుడు పెద్దగా కనిపించాడని, 70 ఏళ్ల తర్వాత మళ్లీ ఇవాళ అలా కనిపించాడని శాస్త్రవేత్తలు తెలిపారు. సూర్యాస్తమయ సమయంలో చంద్రుడు 14 శాతం పెద్దగా, 30 శాతం ప్రకాశవంతంగా కనిపించాడు. మళ్లీ ఇదే తరహాలో ‘సూపర్ మూన్’ 2034లో కనిపించనుంది. సూపర్ మూన్‌ను ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా వీక్షించారు. కొన్ని ప్రాంతాల్లో చంద్రుడిని చూసేందుకు శాస్త్రవేత్తలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
రేపు ఆకాశంలో అద్భుతం!
-
రేపు ఆకాశంలో అద్భుతం!
న్యూయార్క్: ఆకాశంలో ఈ నెల 14న (సోమవారం) ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ప్రతి పౌర్ణమి రోజు కంటే ఆరోజు చంద్రుడు (సూపర్ మూన్) అత్యంత పెద్దగా, ప్రకాశవంతంగా కనిపించనున్నాడు. 1948లో ఇదే తరహాలో చంద్రుడు పెద్దగా కనిపించాడని, 70 ఏళ్ల తర్వాత సోమవారం అలా కనిపించనున్నాడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రుడి కక్ష్య దీర్ఘవృత్తాకారంలో ఉంటుందని, అందుకే కొన్నిసార్లు భూమికి దగ్గరగా వస్తోందని నాసా పేర్కొంది. .అరుుతే సోమవారం సూర్యాస్తమయ సమయంలో చంద్రుడు 14 శాతం పెద్దగా, 30 శాతం ప్రకాశవంతంగా కనిపించనున్నాడు. ఇదే తరహాలో ‘సూపర్ మూన్’ మళ్లీ 2034లో కనిపించనుంది. సోమవారం సూర్యాస్తమయం అద్భుతంగా ఉండనుందని, ఈ అవకాశాన్ని వదులుకోవద్దని నాసాకు చెందిన శాస్త్రవేత్త నోహ్ పెట్రో తెలిపారు. కానీ మేఘాలు సహకరించకపోతే మాత్రం తర్వాతి అవకాశం కోసం వేచి చూడాల్సిందేనని పరిశోధకులు అంటున్నారు. -
28న చంద్రగ్రహణం, సూపర్‌మూన్!
సాక్షి, హైదరాబాద్: వచ్చే సోమవారం తెల్లవారుజామున ఆకాశంలో ఓ అరుదైన అద్భుతం జరగనుంది. ఆ రోజున భూమికి అతిదగ్గరగా చంద్రుడు రావడంతోపాటు అదే సమయంలో సంపూర్ణ చంద్రగ్రహణం ప్రజలకు కనువిందు చేయనుంది. ఇలాంటి ఘటన దాదాపు 33 ఏళ్ల క్రితం..1982లో ఒకసారి జరిగింది. మళ్లీ 2033 ఏడాది వరకూ సంభవించే వీలు లేదు. 28వ తేదీ ఉదయం గం. 5.40లకు ప్రారంభమయ్యే గ్రహణం గం.10.53కు ముగుస్తుంది. గం. 6.37 నుంచి గం.9.57ల మధ్య ఉంబ్రల్ దశ (చంద్రుడు పూర్తిగా భూమి ఛాయలోకి చేరిపోవడం) నడుస్తుంది. అయితే ఈ గ్రహణం భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించే వీలుందని ప్లానెటరీ సొసైటీ, ఇండియా డెరైక్టర్ శ్రీరఘునందన్ తెలిపారు. పూర్తిస్థాయిలో కనిపించే చోట వాతావరణ పరిస్థితులను బట్టి చంద్రుడు నారింజ లేదా ఎరుపు వర్ణంలో కనిపిస్తాడు. ఈ ఏడాదికి ఇదే చివరి చంద్రగ్రహణం కావడం విశేషం. ఏడాదికి మూడు నాలుగుసార్లు.... భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో చంద్రుడు తిరుగుతాడు. కక్ష్యలో తిరుగుతూ చంద్రుడు రెండుసార్లు భూమికి అతిదగ్గరగా, ఇంకో రెండుసార్లు అతిదూరంగా వస్తాడు. భూమికి, చంద్రుడికి మధ్య సగటు దూరం 3.84 లక్షల కిలోమీటర్లు కాగా...28న ఈ దూరం దాదాపు 50,000 కి.మీ.లు తగ్గనుంది. ఫలితంగా ఆ రోజున చంద్రుడి సైజు పెరిగినట్టుగా కనిపిస్తుంది. మామూలు రోజుల్లో కంటే ఆ రోజు చంద్రుడి పరిమాణం 14 శాతంఎక్కువ ఉన్నట్టుగా కనిపిస్తుంది. 30 శాతం ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటాడు. అందుకే దీన్ని కొందరు సూపర్‌మూన్‌గా వ్యవహరిస్తారు. శాస్త్రవేత్తలు దీన్ని అరుదైన చంద్రగ్రహణంగా పరిగణిస్తారు. -
28న చంద్రగ్రహణం, సూపర్‌మూన్!