సూపర్ మూన్ అద్భుత దృశ్యం!
న్యూయార్క్: ఆకాశంలో సోమవారం సాయంత్రం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రతి పౌర్ణమి రోజు కంటే ఈ సారి చంద్రుడు (సూపర్ మూన్) అత్యంత పెద్దగా, ప్రకాశవంతంగా కనిపించడంతో పాటు భూమికి దగ్గరగా వచ్చాడు. 1948లో ఇదే తరహాలో చంద్రుడు పెద్దగా కనిపించాడని, 70 ఏళ్ల తర్వాత మళ్లీ ఇవాళ అలా కనిపించాడని శాస్త్రవేత్తలు తెలిపారు.
సూర్యాస్తమయ సమయంలో చంద్రుడు 14 శాతం పెద్దగా, 30 శాతం ప్రకాశవంతంగా కనిపించాడు. మళ్లీ ఇదే తరహాలో ‘సూపర్ మూన్’ 2034లో కనిపించనుంది. సూపర్ మూన్‍ను ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా వీక్షించారు. కొన్ని ప్రాంతాల్లో చంద్రుడిని చూసేందుకు శాస్త్రవేత్తలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.