వీడియో: ఆకాశంలో అద్భుతం.. కనువిందు చేసిన చంద్రుడు | Super Blue Moon Of Raksha Bandhan 2023 On Sky Video Viral - Sakshi
Sakshi News home page

Super Blue Moon On Raksha Bandhan 2023 Video: ఆకాశంలో అద్భుతం.. కనువిందు చేసిన చంద్రుడు

Published Wed, Aug 30 2023 8:20 PM | Last Updated on Wed, Aug 30 2023 8:33 PM

Super Blue Moon of Raksha Bandhan On SKY Video Viral - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. దేశంలో అరుదైన సూపర్ బ్లూ మూన్ కనువిందు చేసింది. రాఖీ పౌర్ణమి పండుగ వేళ రోజులా కాకుండా నేడు చంద్రుడు పెద్దగా, కాంతివంతంగా దర్శనమిచ్చాడు. చంద్రుడు భూమికి అత్యంత సమీపంలోకి వచ్చినప్పుడు పౌర్ణమి రావడంతో ఈ అద్భుతం కనిపించింది.

కాగా, నేడు చంద్రుడు భూమికి 3,57,244 కిలోమీటర్ల దూరంలో కనిపించాడు. ఇక, బ్లూమూన్‌ అంటే చంద్రుడు బ్లూ కలర్‌లో కాకుండా నారింజ రంగులో దర్శనమిచ్చాడు. అయితే, ఇది ఈ నెలలో కనిపించే రెండో ఫుల్‌ మూన్‌. ఆగస్టు 1న తొలి పౌర్ణమి నాడు బ్లూ మూన్‌ కనిపించింది. కాబట్టి నేడు కనిపించే చంద్రుడిని సూపర్‌ బ్లూ మూన్‌గా పిలుస్తున్నారు. సాధారణంగా ఏడాదిలో రెండు లేదా మూడు సూపర్ మూన్‌లు ఏర్పడుతుంటాయి.

బ్లూ మూన్‌ అంటే..?
బ్లూ మూన్ అంటే  చంద్రుడు బ్లూలో కనిపించడం కాదు. ఒకే నెలలో రెండోసారి ఏర్పడే పున్నమి చంద్రుడిని బ్లూ మాన్‌గా పిలుస్తుంటారు. ఒకే నెలలో బ్లూ మూన్‌, సూపర్‌ మూన్‌లు దర్వనమివ్వడం అరుదనే చెప్పాలి. ఇప్పుడు కనిపించే సూపర్‌ బ్లూ మూన్‌ నాలుగు పౌర్ణమిలతో కూడిన సీజన్‌లో అదనపు చంద్రుడు. బుధవారం ఏర్పడిన బ్లూ మూన్ ప్రత్యేకమైనది. సాధారణంగా పౌర్ణమి రోజుల కంటే సూపర్‌ మూన్‌ సమయంలో చంద్రుడు మరింత ప్రకాశవంతంగా కనిపించడంతో పాటు భారీ పరిమాణంలో కనిపిస్తాడు. సాధారణ రోజుల కంటే 16 శాతం వెన్నెలను పంచబోతున్నాడు.

అరుదుగా బ్లూ సూపర్‌ మూన్‌
బ్లూ సూపర్‌ మూన్‌ చాలా అరుదుగా వస్తుంది. ఖగోళ పరిస్థితుల కారణంగా ప్రతీ పది సంవత్సరాలకు మాత్రం ఇలాంటిది వస్తుందని నాసా తెలపింది. ఒక్కోసారి బ్లూ సూపర్‌ మూన్‌ రావడానికి ఇరవై సంవత్సరాలు కూడా పట్టొచ్చని పేర్కొంది. చివరిసారిగా బ్లూ బూన్‌ 2009 డిసెంబర్‌లో ఏర్పడింది. మళ్లీ 2037 జనవరిలో బ్లూ మూన్‌ కనపించనుందట.. మరొకటి మార్చిలో దర్శనమివ్వనుంది. అంటే మళ్లీ 14 సంవత్సరాల వరకు చూడలేరని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: కౌలు రైతులకు రైతు భరోసా.. నిధులు జమ చేయనున్న సీఎం జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement