blue moon diamond
-
వీడియో: ఆకాశంలో అద్భుతం.. కనువిందు చేసిన చంద్రుడు
సాక్షి, హైదరాబాద్: ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. దేశంలో అరుదైన సూపర్ బ్లూ మూన్ కనువిందు చేసింది. రాఖీ పౌర్ణమి పండుగ వేళ రోజులా కాకుండా నేడు చంద్రుడు పెద్దగా, కాంతివంతంగా దర్శనమిచ్చాడు. చంద్రుడు భూమికి అత్యంత సమీపంలోకి వచ్చినప్పుడు పౌర్ణమి రావడంతో ఈ అద్భుతం కనిపించింది. కాగా, నేడు చంద్రుడు భూమికి 3,57,244 కిలోమీటర్ల దూరంలో కనిపించాడు. ఇక, బ్లూమూన్ అంటే చంద్రుడు బ్లూ కలర్లో కాకుండా నారింజ రంగులో దర్శనమిచ్చాడు. అయితే, ఇది ఈ నెలలో కనిపించే రెండో ఫుల్ మూన్. ఆగస్టు 1న తొలి పౌర్ణమి నాడు బ్లూ మూన్ కనిపించింది. కాబట్టి నేడు కనిపించే చంద్రుడిని సూపర్ బ్లూ మూన్‌గా పిలుస్తున్నారు. సాధారణంగా ఏడాదిలో రెండు లేదా మూడు సూపర్ మూన్‌లు ఏర్పడుతుంటాయి. #WATCH | Bihar: A super blue moon lights up the sky; visuals from Patna. pic.twitter.com/Fe9XDrg5g1 — ANI (@ANI) August 30, 2023 బ్లూ మూన్ అంటే..? బ్లూ మూన్ అంటే చంద్రుడు బ్లూలో కనిపించడం కాదు. ఒకే నెలలో రెండోసారి ఏర్పడే పున్నమి చంద్రుడిని బ్లూ మాన్‌గా పిలుస్తుంటారు. ఒకే నెలలో బ్లూ మూన్, సూపర్ మూన్‌లు దర్వనమివ్వడం అరుదనే చెప్పాలి. ఇప్పుడు కనిపించే సూపర్ బ్లూ మూన్ నాలుగు పౌర్ణమిలతో కూడిన సీజన్లో అదనపు చంద్రుడు. బుధవారం ఏర్పడిన బ్లూ మూన్ ప్రత్యేకమైనది. సాధారణంగా పౌర్ణమి రోజుల కంటే సూపర్ మూన్ సమయంలో చంద్రుడు మరింత ప్రకాశవంతంగా కనిపించడంతో పాటు భారీ పరిమాణంలో కనిపిస్తాడు. సాధారణ రోజుల కంటే 16 శాతం వెన్నెలను పంచబోతున్నాడు. VIDEO | Visuals of Super Blue Moon from Patna, Bihar.#supermoon #SuperBlueMoon #SUPERBLUEMOON2023 pic.twitter.com/5u3l7mYiFD — Press Trust of India (@PTI_News) August 30, 2023 అరుదుగా బ్లూ సూపర్ మూన్ బ్లూ సూపర్ మూన్ చాలా అరుదుగా వస్తుంది. ఖగోళ పరిస్థితుల కారణంగా ప్రతీ పది సంవత్సరాలకు మాత్రం ఇలాంటిది వస్తుందని నాసా తెలపింది. ఒక్కోసారి బ్లూ సూపర్ మూన్ రావడానికి ఇరవై సంవత్సరాలు కూడా పట్టొచ్చని పేర్కొంది. చివరిసారిగా బ్లూ బూన్ 2009 డిసెంబర్లో ఏర్పడింది. మళ్లీ 2037 జనవరిలో బ్లూ మూన్ కనపించనుందట.. మరొకటి మార్చిలో దర్శనమివ్వనుంది. అంటే మళ్లీ 14 సంవత్సరాల వరకు చూడలేరని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: కౌలు రైతులకు రైతు భరోసా.. నిధులు జమ చేయనున్న సీఎం జగన్ -
నేడే సూపర్ బ్లూ బ్లడ్ మూన్
న్యూఢిల్లీ: సుమారు 150 ఏళ్ల తర్వాత ఆకాశంలో నేడు ఒక అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. సూపర్‌మూన్, బ్లూమూన్, సంపూర్ణ చంద్రగ్రహణం మూడు కలసి కనువిందు చేయబోతున్నాయి. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా భూమి పూర్తిగా నీడలోనే ఉండిపోనుండటంతో జాబిల్లి ముదురు ఎరుపురంగులో (బ్లడ్‌మూన్‌గా) కనిపించనుంది. సాయంత్రం 4.21 గంటలకు ప్రారంభమై రాత్రి 7.37 గంటల వరకు ఆసియా, తూర్పు రష్యా, మధ్య ప్రాచ్యప్రాంతం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ఈ ఖగోళ వింత చోటుచేసుకోనుంది. అమెరికా పశ్చిమ ప్రాంతంలో ఇది మరింత బాగా కనపడవచ్చు. భారత్ వ్యాప్తంగా... మన దేశంలోనూ సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని వీక్షించొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చందమామపై పాక్షిక నీడ లేదా భూమికి చెందిన పెన్యుంబ్రా నీడతో ఇది భారత్‌లో సాయంత్రం 5.20కి ప్రారంభమవుతుంది. ప్రధాన గ్రహణం మాత్రం సూర్యాస్తమయం తర్వాత 6.25 నిమిషాలకు ప్రారంభమై, తూర్పు వైపు ఆకాశంలో కనిపిస్తుంది. ఆ తర్వాత జాబిల్లి వెండి రంగులోకి మారుతుంది. కొన్ని నిమిషాల తరువాత మొత్తం నీడ పరచుకుంటుంది. రాత్రి 7.25 గంటల నుంచి దాని పరిమాణం క్రమంగా తగ్గుతూ ఉంటుంది. దీనిని నెలలో రెండో నిండుపున్నమి లేదా నీలవర్ణ చంద్రుడిగా (బ్లూమూన్)గా పిలుస్తారు(జనవరి 1న తొలి పౌర్ణమి ఏర్పడింది). బ్లూమూన్ సందర్భంగా నదులు, సముద్రాల్లో అలలు కొంచెం ఎత్తులో ఎగిసిపడతాయని, దీని వల్ల భయపడాల్సిందేమీ లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూపర్‌మూన్... చంద్రుడు గుండ్రంగా ఒక స్థిరకక్ష్యలో కాకుండా కొంచెం అటూ ఇటూగా (అప్సిడల్ ప్రిసిషన్)లో భ్రమిస్తుండటంతో కొన్ని పర్యాయాలు భూమికి కొంత సమీపంగా వస్తాడు. ఇలాంటి సందర్భాల్లో... పున్నమి రోజుల్లో సూర్యుడికి ఎదురుగా వస్తాడు. ఈ కారణంగా చంద్రుడి పరిమాణం పెరిగినట్లుగా అనిపిస్తుంది. ఈ విధంగా పౌర్ణమినాడు చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చినపుడు ‘సూపర్‌మూన్’ అని పిలుస్తారు. భూమండలానికి సమీపంగా రావడం వల్ల చంద్రుడు కొంచెం పెద్దగా, మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాడు. సాధారణంగా కనిపించే జాబిల్లితో పోల్చితే ఇది 30 శాతం పెద్దదిగా, రోజు కనిపించే దాని కంటే 14 శాతం ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తాడని సైంటిస్టులు వెల్లడించారు. ఆకాశంలో చోటుచేసుకునే ఈ అరుదైన అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు ప్రత్యేకమైన బైనాక్యులర్లు, టెలిస్కోప్‌ల అవసరం లేదని, మామూలుగా అందరూ చంద్రుడిని చూసినట్టే ఎలాంటి ఉపకరణాలు లేకుండా చూడొచ్చునని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మరో సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చే జూలై 27న ఏర్పడనుందని, అది బ్లూ లేదా సూపర్‌మూన్ మాత్రం కాదని వారు తెలిపారు. ఎప్పుడు, ఎక్కడెక్కడ... తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నంలో సూపర్ బ్లూబ్లడ్ మూన్‌ను ముందుగా వీక్షించొచ్చు. హైదరాబాద్ ప్రజలు సంపూర్ణ చంద్రగ్రహణాన్ని మొత్తం చూసే అవకాశముంది. దేశవ్యాప్తంగా అయితే ఈశాన్య రాష్ట్రాలతో పాటు కోల్‌కతా ప్రజలు ఈ అద్భుతాన్ని అందరికన్నా ముందు చూడొచ్చు. చంద్రోదయం..అరుణాచల్‌ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌లో సాయంత్రం 4.47 గంటలకు, కోల్‌కతా–5.16, పట్నా–5.25, ఢిల్లీ–5.53, చెన్నై–6.04, ముంబై–6 గంటల 27 నిమిషాలకు జరగనుంది. -
రేపు ఖగోళ వింత!
న్యూఢిల్లీ: ఆకాశంలో రేపు అత్యంత అరుదైన ఖగోళ అద్భుతం చోటుచేసుకోనుంది. ఈ నెల 31న సూపర్‌మూన్‌గా మారే చంద్రుడు బ్లూమూన్, బ్లడ్‌మూన్‌గానూ దర్శనమివ్వనున్నాడు. దాదాపు 150 ఏళ్ల తర్వాత ఈ అద్భుతం జరగనుందనీ, మరో పదేళ్ల తర్వాత కానీ ఇలాంటి అవకాశం రాదని శాస్త్రవేత్తలు ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు ఈ ఖగోళ వింతను కెమెరాల్లో బంధించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా వచ్చినప్పుడు 14 శాతం పెద్దగా, 30 శాతం ప్రకాశవంతంగా కన్పిస్తాడు. దీన్నే సూపర్‌మూన్‌గా వ్యవహరిస్తారు. ఓ నెలలో రెండో పౌర్ణమి రోజున చంద్రుడు భూమికి దగ్గరగా వస్తే దాన్ని బ్లూమూన్‌గా పిలుస్తారు. ఇక చంద్రగ్రహణం సమయంలో చంద్రుడు భూమి నీడలోకి చేరినప్పుడు.. భూమి వాతావరణంలోకి వచ్చిన సూర్యకాంతి పరావర్తనం చెంది చంద్రుడిపైకి ప్రసరిస్తుంది. ఎక్కువ తరంగదైర్ఘ్యమున్న ఎరుపు రంగు కిరణాలు చంద్రుడ్ని చేరడంతో చందమామ రుధిర వర్ణంలో ప్రకాశిస్తాడు. దీన్నే బ్లడ్‌మూన్‌గా వ్యవహరిస్తారు. 1866 తర్వాత ఈ మూడు ఖగోళ అద్భుతాలు ఒకేసారి సంభవించడం ఇదే తొలిసారి. భారత్‌లో బుధవారం సాయంత్రం 4.21 గంటల సమయంలో పాక్షికంగా చంద్ర గ్రహణం మొదలు కానుంది. సాయంత్రం 6.21 గంటల నుంచి 7.37 గంటల వరకూ బ్లూ, బ్లడ్‌మూన్ చూడొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ గ్రహణం 76 నిమిషాల పాటు కొనసాగనుంది. -
ఈ నెల 31 అంతరిక్షంలో వింత
న్యూఢిల్లీ : ఈ నెల 31 విశ్వంలో అద్భుతం జరగనుంది. చరిత్రలో అత్యంత అరుదైన బ్లూమూన్ సంపూర్ణ చంద్రగ్రహణం చీకట్లో కనువిందు చేయనుంది. ఈ అంతరిక్ష వింతను మధ్య ఆసియా, ఇండోనేషియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఐరోపా, అలాస్కా, కెనడా, సెంట్రల్ అమెరికా ప్రాంత ప్రజలు వీక్షించవచ్చు. సంపూర్ణ గ్రహణ సమయంలో చంద్రుడు పసిఫిక్ మహాసముద్రం మీద ప్రయాణిస్తుంటాడని సైంటిస్టులు చెబుతున్నారు. సాధారణంగా నెలలో రెండోసారి కనిపించే నిండు చంద్రుడు సంపూర్ణ గ్రహణానికి గురవడాన్ని బ్లూమూన్ అని పిలుస్తారు. ఇటువంటి అపూర్వ ఘటన 150 ఏళ్ల కిందట ఒకసారి ఆవిష్కృతమైంది. మళ్లీ ఇన్నేళ్లకు 2018 జనవరి 31న అంతరిక్షంలో బ్లూమూన్ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ అరుదైన చంద్రగ్రహణం.. మొత్తం 77 నిమిషాలపాటు కనువిందు చేయనుంది. ఈ సమయంలో చంద్రడిపై పడే భూమి దక్షిణ భాగపు నీడను స్పష్టంగా వీక్షించవచ్చు. -
ఆ వజ్రం వెల.. రూ. 284 కోట్లు
అది చాలా అరుదైన 12.03 క్యారెట్ల వజ్రం. దాని పేరు 'బ్లూ మూన్'. జెనీవాలోని సోత్బీ వేలం శాలలో దీన్ని వేలానికి పెట్టగా.. ఏకంగా రూ. 284 కోట్ల ధర పలికింది. ఈ విషయాన్ని సోత్బీ ప్రతినిధి ఒకరు తెలిపారు. క్యారట్ వారీగా చూసుకుంటే వజ్రాలకు ఇప్పటివరకు పలికిన అత్యంత ఎక్కువ ధర ఇదేనని చెబుతున్నారు. ఒక్క లోపం కూడా లేని ఈ వజ్రానికి ఇంత ధర రావడం సహజమేనని సోత్బీ అంతర్జాతీయ నగల విభాగం అధిపతి డేవిడ్ బెన్నెట్ అన్నారు. తాము మాత్రం దీనికి 231-363 కోట్ల మధ్యలో ఏదో ఒక ధర పలుకుతుందని అనుకున్నామన్నారు.