న్యూఢిల్లీ : ఈ నెల 31 విశ్వంలో అద్భుతం జరగనుంది. చరిత్రలో అత్యంత అరుదైన బ్లూమూన్ సంపూర్ణ చంద్రగ్రహణం చీకట్లో కనువిందు చేయనుంది. ఈ అంతరిక్ష వింతను మధ్య ఆసియా, ఇండోనేషియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఐరోపా, అలాస్కా, కెనడా, సెంట్రల్ అమెరికా ప్రాంత ప్రజలు వీక్షించవచ్చు. సంపూర్ణ గ్రహణ సమయంలో చంద్రుడు పసిఫిక్ మహాసముద్రం మీద ప్రయాణిస్తుంటాడని సైంటిస్టులు చెబుతున్నారు.
సాధారణంగా నెలలో రెండోసారి కనిపించే నిండు చంద్రుడు సంపూర్ణ గ్రహణానికి గురవడాన్ని బ్లూమూన్ అని పిలుస్తారు. ఇటువంటి అపూర్వ ఘటన 150 ఏళ్ల కిందట ఒకసారి ఆవిష్కృతమైంది. మళ్లీ ఇన్నేళ్లకు 2018 జనవరి 31న అంతరిక్షంలో బ్లూమూన్ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ అరుదైన చంద్రగ్రహణం.. మొత్తం 77 నిమిషాలపాటు కనువిందు చేయనుంది. ఈ సమయంలో చంద్రడిపై పడే భూమి దక్షిణ భాగపు నీడను స్పష్టంగా వీక్షించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment