రేపు ఆకాశంలో అద్భుతం!
న్యూయార్క్: ఆకాశంలో ఈ నెల 14న (సోమవారం) ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ప్రతి పౌర్ణమి రోజు కంటే ఆరోజు చంద్రుడు (సూపర్ మూన్) అత్యంత పెద్దగా, ప్రకాశవంతంగా కనిపించనున్నాడు. 1948లో ఇదే తరహాలో చంద్రుడు పెద్దగా కనిపించాడని, 70 ఏళ్ల తర్వాత సోమవారం అలా కనిపించనున్నాడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రుడి కక్ష్య దీర్ఘవృత్తాకారంలో ఉంటుందని, అందుకే కొన్నిసార్లు భూమికి దగ్గరగా వస్తోందని నాసా పేర్కొంది.
.అరుుతే సోమవారం సూర్యాస్తమయ సమయంలో చంద్రుడు 14 శాతం పెద్దగా, 30 శాతం ప్రకాశవంతంగా కనిపించనున్నాడు. ఇదే తరహాలో ‘సూపర్ మూన్’ మళ్లీ 2034లో కనిపించనుంది. సోమవారం సూర్యాస్తమయం అద్భుతంగా ఉండనుందని, ఈ అవకాశాన్ని వదులుకోవద్దని నాసాకు చెందిన శాస్త్రవేత్త నోహ్ పెట్రో తెలిపారు. కానీ మేఘాలు సహకరించకపోతే మాత్రం తర్వాతి అవకాశం కోసం వేచి చూడాల్సిందేనని పరిశోధకులు అంటున్నారు.