ఆకాశంలో సోమవారం సాయంత్రం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రతి పౌర్ణమి రోజు కంటే ఈ సారి చంద్రుడు (సూపర్ మూన్) అత్యంత పెద్దగా, ప్రకాశవంతంగా కనిపించడంతో పాటు భూమికి దగ్గరగా వచ్చాడు. 1948లో ఇదే తరహాలో చంద్రుడు పెద్దగా కనిపించాడని, 70 ఏళ్ల తర్వాత మళ్లీ ఇవాళ అలా కనిపించాడని శాస్త్రవేత్తలు తెలిపారు.