రేయ్‌.. అంచనాలు పెంచకండ్రా | rashmika hashtag on Twitter | Sakshi
Sakshi News home page

రేయ్‌.. అంచనాలు పెంచకండ్రా

Published Sat, Nov 17 2018 3:44 AM | Last Updated on Sat, Aug 3 2019 12:30 PM

rashmika hashtag on Twitter - Sakshi

రష్మికా మండన్నా

...అంటున్నారు రష్మికా మండన్నా. ఈ కన్నడ క్యూటీ అంచనాలను ఎవరు పెంచారు? అంటే ట్వీటర్‌లో ఊహారాయుళ్లే. ఇంతకూ ఈ ఊహారాయుళ్లు ఏం చేశారు? అంటే... తమిళ టాప్‌ హీరో విజయ్‌ నెక్ట్స్‌ సినిమాలో హీరోయిన్‌గా రష్మికను ఊహించేసుకున్నారు. ‘సర్కార్‌’ సూపర్‌ సక్సెస్‌ తర్వాత హీరో విజయ్‌ నెక్ట్స్‌ చేయబోయే చిత్రాన్ని ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరనేది మాత్రం అధికారికంగా ప్రకటించలేదు చిత్రబృందం. కానీ ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మికా మండన్నా ఫిక్స్‌ అయిపోయారు అని ట్వీటర్‌లో కొందరు రాసుకొచ్చారు.

వెంటనే ఆ ట్వీట్లకు స్పందిస్తూ రష్మికా మండన్నా సరదాగా ‘రేయ్‌... నా అంచనాలను పెంచకండ్రా’ అంటూ సరదగా రిప్లై ఇచ్చారు. కెరీర్‌ స్టార్టింగ్‌ స్టేజ్‌లో ఉన్న ఏ హీరోయిన్‌ అయినా టాప్‌ స్టార్‌తో సిల్వర్‌ స్క్రీన్‌పై జోడీ కట్టాలనుకుంటారు. లేని పోని పుకార్లతో నాకు అంచనాలు పెంచొద్దనే ఉద్దేశంతోనే రష్మిక ఇలా సరదాగా ఈ వార్తలను కొట్టిపారేసుండొచ్చు. ప్రస్తుతం ఈ భామ ‘ధృవ’ కన్నడ రీమేక్‌ ‘పొగరు’, తెలుగులో విజయ్‌ దేవరకొండతో ‘డియర్‌ కామ్రేడ్‌’, నితిన్‌తో ‘భీష్మ’ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement