వన్స్‌ మోర్‌? | Allu Arjun To Romance Pooja Hegde Once Again | Sakshi
Sakshi News home page

వన్స్‌ మోర్‌?

Published Sun, Feb 17 2019 3:00 AM | Last Updated on Thu, Aug 22 2019 9:35 AM

Allu Arjun To Romance Pooja Hegde Once Again - Sakshi

పూజా హెగ్డే, అల్లు అర్జున్‌

సెర్చింగ్‌.. సెర్చింగ్‌.. సెర్చింగ్‌... అల్లు అర్జున్‌ హీరోగా నటించనున్న తాజా సినిమాలో హీరోయిన్‌ ఎవరు? అనే విషయంపై టీమ్‌ ఇంకా సెర్చ్‌ చేస్తూనే ఉన్నట్లున్నారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా అల్లు అరవింద్, ఎస్‌. రాధాకృష్ణ ఓ సినిమాను నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కథానాయిక పాత్ర చేయబోయేది ఎవరు? అనే విషయంపై ఫిల్మ్‌నగర్‌లో జోరుగా చర్చ జరుగుతోంది. నిన్న మొన్నటివరకు కియారా అద్వానీ, రష్మికా మండన్నా పేర్లు వినిపించాయి. మధ్యలో ప్రియా ప్రకాష్‌ వారియర్‌ పేరు కూడా వినిపించింది.

తాజాగా పూజా హెగ్డే ట్రాక్‌లోకి వచ్చారు. త్రివిక్రమ్‌ గత చిత్రం ‘అరవిందసమేత వీరరాఘవ’లో పూజా హెగ్డే కథానాయికగా నటించారు. ఆల్రెడీ ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్‌’ సినిమాలో అల్లు అర్జున్‌తో పూజా జోడి కట్టారు. సో... ఈ సినిమాలో పూజానే హీరోయిన్‌గా ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని ఫిల్మ్‌నగర్‌ సినీ లవర్స్‌ అంటున్నారు. అంటే.. అల్లు అర్జున్‌–పూజా హెగ్డే వన్స్‌ మోర్‌ సిల్వర్‌స్క్రీన్‌పై జంటగా అలరించే చాన్స్‌ ఉందన్న మాట. ప్రస్తుతం ప్రభాస్‌తో  ఓ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఆల్రెడీ బాలీవుడ్‌లో ‘హౌస్‌ఫుల్‌ 4’ సినిమా షూటింగ్‌ను కంప్లీట్‌ చేశారు పూజా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement