లుక్‌ టెస్ట్‌ | mahesh babu sarileru neekevvaru test look | Sakshi
Sakshi News home page

లుక్‌ టెస్ట్‌

Published Tue, Jul 2 2019 2:40 AM | Last Updated on Tue, Jul 2 2019 2:40 AM

mahesh babu sarileru neekevvaru test look - Sakshi

మహేశ్‌బాబు

హాలిడే ముగిసింది. రెస్ట్‌ అయిపోయింది. మళ్లీ వర్క్‌ మోడ్‌కి షిఫ్ట్‌ అయ్యారు మహేశ్‌బాబు. నెక్ట్స్‌ చేయబోయే ‘సరిలేరు నీకెవ్వరు’ పాత్రలోకి మారిపోవడానికి రెడీ అయ్యారు. ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్‌లో మహేశ్‌ లుక్‌ టెస్ట్‌ జరుగుతోందని తెలిసింది. సినిమాలో మహేశ్‌బాబు ఏ లుక్‌తో కనిపించాలో ఈ లుక్‌ టెస్ట్‌లో డిసైడ్‌ అవుతారు.  అలాగే చిత్రకథానాయిక రష్మికా మండన్నాపై కూడా ఫొటోషూట్‌ చేస్తున్నారట. విడివిడిగా ఇద్దరి లుక్‌ టెస్ట్‌ చేసి, జంటగా కూడా ఫొటోషూట్‌ జరుపుతున్నారని సమాచారం. ఈ సినిమాలో మహేశ్‌ ఆర్మీ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నారని తెలిసిందే. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘దిల్‌’ రాజు, అనిల్‌ సుంకర నిర్మించనున్నారు. విజయశాంతి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ నెల 5న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుందని సమాచారం. కశ్మీర్, కర్నూల్‌ ప్రాంతాల్లో ఎక్కువ శాతం షూటింగ్‌ జరగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement