
సాక్షి, హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెవర్ బిఫోర్ క్యారెక్టర్‌లో రంగస్థలం ద్వారా చూపించబోతున్నాడు దర్శకుడు సుకుమార్. చిట్టిబాబుగా చెర్రీ చేయబోయే సందడి.. పొలిటికల్ విలేజ్ డ్రామా కోసం మెగా అభిమానుల కౌంట్‌డౌన్ మొదలైపోయింది.
అయితే ఈ చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సుకుమార్ ఓ చిత్రం చేయబోతున్నాడంటూ ఈ మధ్య జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. రంగస్థలం ఫలితంపైనే అది ఆధారపడి ఉంటుందని విశ్లేషిస్తూ కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రంగస్థలం ప్రమోషన్‌లో పాల్గొంటున్న సుక్కూ ఈ విషయంపై స్పష్టత ఇచ్చేశాడు.
‘చిరంజీవిగారికి నేను పెద్ద అభిమానిని. ఆయన చిత్రాలు చూస్తూ పెరిగాను. ఆయనతో కలిసి పని చేయాలన్నది నా కల. కానీ, తర్వాతి చిత్రం ఆయనతో అన్న వార్త వాస్తవం నిజం కాదు. అలాంటి ప్రతిపాదన కూడా చర్చకు రాలేదు’ అని సుకుమార్ తేల్చేశాడు. అయితే అల్లు అర్జున్‌తో తన తర్వాతి చిత్రం ఉండే ఛాన్స్ ఉందంటూ సుకుమార్ చివర్లో ఓ హింట్ ఇచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment