
నిత్యా మీనన్
‘‘ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల అందరం ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ ఖాళీ సమయాన్ని ఎక్కువగా మన గురించి మనం విశ్లేషించుకోవడానికి ఉపయోగిద్దాం. నేను అదే చేస్తున్నాను’’ అన్నారు నిత్యా మీనన్. లాక్‌డౌన్‌లో చేస్తున్న విషయాల గురించి, తదుపరి చిత్రాల గురించి నిత్యా మీనన్ మాట్లాడుతూ– ‘‘ఈ ఖాళీ సమయాన్ని ఉపయోగకరంగా వినియోగించుకుంటున్నాను. అలాగే దీన్ని నా ‘కామ్ టైమ్’గా మార్చుకున్నాను.
నా గురించి నేను ఇంకా ఎక్కువ విశ్లేషించుకోవడానికి వీలు దొరికింది. ఇలాంటి సమయం మళ్లీ దొరకదు. ప్రస్తుతం బయట ఉన్న పరిస్థితి వల్ల అందరం మానసికంగా పోరాటం చేస్తున్నాం. ఎవరి ఫైట్ వాళ్లది. అలాగే ప్రస్తుతం డిజిటల్ నుంచి చాలా స్క్రిప్ట్ ఆఫర్స్ ఉన్నాయి. స్క్రిప్ట్ నచ్చితేనే సినిమా కమిట్ అవుతాను. వెబ్‌లోనూ అదే పద్ధతిని పాటిస్తాను. ప్రస్తుతం జయలలిత బయోపిక్, తమిళంలో ధనుష్ తో ఓ సినిమా, తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment