ఆ సినిమా ఆగలేదు | Deepika Padukone confirms her superhero film | Sakshi
Sakshi News home page

ఆ సినిమా ఆగలేదు

Published Sat, Dec 29 2018 12:26 AM | Last Updated on Sat, Dec 29 2018 12:26 AM

Deepika Padukone confirms her superhero film - Sakshi

దీపికా పదుకోన్‌

‘పద్మావత్‌’ తర్వాత బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పదుకోన్‌ నెక్ట్స్‌ మూవీ ఏంటి? అంటే ‘చపక్‌’ అనే లేడీ ఓరియంటెడ్‌ మూవీ అని చటుక్కున చెప్పొచ్చు. కానీ ఈ సినిమా అధికారికంగా వెల్లడవ్వక ముందు దీపిక ఓ ఫిమేల్‌ సూపర్‌ హీరో ఫిల్మ్‌ చేయబోతున్నారని బాలీవుడ్‌లో వార్తలు వచ్చాయి. తీరా ‘చపక్‌’ అనౌన్స్‌ కాగానే ఈ సినిమా ఆగిపోయిందని మాట్లాడుకున్నారు బాలీవుడ్‌ జనాలు. కానీ ఆ సినిమా ఆగిపోలేదు. ‘‘నేను సూపర్‌హీరో పాత్ర చేయబోయే సినిమా పూర్తిగా ఆగిపోలేదు. ఆ సినిమాపై నేను, నా ఫ్రెండ్‌ వర్క్‌ చేస్తున్నాం. ఈ సినిమా కాస్త కొత్తగా ఉండాలనే ప్రయత్నం చేస్తున్నాం.

వీలైనంత త్వరగా సెట్స్‌పైకి వెళ్లాలని కోరుకుంటున్నాను. ఇంకా పూర్తి కథ రెడీ కాలేదు. ఇప్పుడే విత్తు నాటాం. పెంచి పోషించడానికి కష్టపడుతున్నాం’’ అని ఓ ఇంటర్వ్యూలో దీపికా పేర్కొన్నారని బాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ‘రాజీ’ ఫేమ్‌ మేఘనా గుల్జార్‌ దర్శకత్వంలో దీపికా పదుకోన్‌ నటించినున్న ‘చపక్‌’ చిత్రం వచ్చే ఏడాది మార్చిలో స్టార్ట్‌ కానుంది. ఇక దీపిక పర్సనల్‌ లైఫ్‌లోకి తొంగిచూస్తే... ఈ ఏడాది రణ్‌వీర్‌ సింగ్‌తో ఏడడుగులు వేసిన ఆమె న్యూ ఇయర్‌ వేడుకలతో పాటు తన బర్త్‌ డే వేడుకలను కూడా ఫారిన్‌లో ప్లాన్‌ చేశారు. జనవరి 5న దీపికా పుట్టినరోజని ప్రత్యేకించి చెపక్కర్లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement